గుంటూరు

రేపటి నుండి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 23: ఈనెల 25 నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన జరగనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రస్తుతం నగరంలో ఈనెల 25వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు స్థానిక నగరంపాలెంలోని కెకెఆర్ ఫంక్షన్ హాలులో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నరేష్ తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి 60 చేనేత సహకార సంఘాల ఉత్పత్తిదారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నరేష్ మాట్లాడుతూ 2016-17 సంవత్సరంలో 9 ప్రత్యేక జాతీయ చేనేత వస్త్ర పరిశ్రమలను రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో ఇప్పటివరకు ఐదు ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శనలు, ఒక జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహించామని, ఈ వస్త్ర ప్రదర్శనల ద్వారా 4.5 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఇప్పటివరకు 2 చేనేత వస్త్ర ప్రదర్శనలను నిర్వహించిందన్నారు. విజయవాడ వస్త్ర ప్రదర్శనలో 3 కోట్లు, రెండవ జాతీయ చేనేత ప్రదర్శనను నెల్లూరులో నిర్వహించి 2.25 కోట్ల అమ్మకాలు జరిపామన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు సరైన మార్కెటింగ్ సదుపాయాన్ని కల్గజేయడంతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన చేనేత వస్త్రాలు ఒకే వేదిక ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం, చేనేత రంగంలో మగ్గాలపై అభివృద్ధి చేసిన అధునాతన డిజైన్లను వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే వస్త్ర ప్రదర్శనల ఉద్దేశాలని తెలిపారు. సంక్షోభంలో ఉన్న చేనేత వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు పవర్‌లూమ్స్‌దే పై చేయిగా మారింది. నూలుపై సబ్సిడీతో పాటు వివిధ రకాల ప్రోత్సాహకాలను కల్పించి వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించాలని కూడా గతంలో ఆదేశాలు జారీచేసింది. పవర్‌లూమ్స్ కారణంగా మగ్గం కార్మికులు నిలువునా నష్టపోతున్నారు. కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటైన సొసైటీలు సైతం బినామీలుగా మారడంతో చేనేత కార్మికులు ఆకలిచావులకు గురయ్యే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ సారి చేనేతరంగ మనుగడకు పలు రాయితీలు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఈ వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వస్త్ర ఉత్పత్తిరంగంలో దేశంలో చేనేత రంగానికి 18 శాతం ఉందని, చేనేత, జౌళిశాఖ కమిషనర్ శ్రీనివాస్ శ్రీనరేష్ తెలిపారు. చేనేత కార్మికులు తమ సృజనాత్మకశక్తితో వస్త్రాలను రూపొందిస్తున్నారని వివరించారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమ ద్వారా సుమారు 130 లక్షల మంది చేనేత కార్మికులు ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 10 లక్షల మంది కార్మికులకు ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇతర దేశాలకు మన రాష్ట్రం నుండి 15 శాతం మేర చీరల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లతో మిల్లు వస్త్ర ఉత్పత్తులతో పోటీపడుతూ వస్త్రాలు తయారు చేస్తున్నారు.