నెల్లూరు

భూమి నా భావావేశం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వూ నేనూ..
అంతా భూమిపుత్రులమే
ఈ పుడమితల్లి
తన పచ్చటి ఒడిలో
మనిషి బతుకును పూదోటగా
చేసి కోడి తన రెక్కలచాటున
పిల్లల్ని దాచినట్లు
భూమాత కాలుష్యపు
బొంతగద్దల నుండి కాపాడుతోంది!

ప్రతిగా ప్రతి మనిషీ నిర్దయగా
పచ్చదనాన్ని కబ్జా చేస్తూ
బతుకును దుర్గంధపు
రొంపిని చేసుకొంటున్నాడు!
పక్షుల కిలకిలారావాలతో
సకల జీవరాసులకూ నెలవై
నిత్యశోభాయమానంగా వున్న
ప్రకృతికన్య నిత్యం దుఃఖిస్తోంది

జనం గుండెలనిండా జాలువారిన కలలు
కల్లలయి పోతున్న ఈనాడు
కనుమరుగవుతున్న పచ్చని
మనిషితనము!
ప్రతి రాత్రీ అమృతం కురిసిన
రాత్రే అవుతుంది అనుకున్నా
మా వెకిలిగాడి ప్లాస్టిక్ పల్టీలు
చూశాక తెలిసింది ప్రతిరాత్రీ
గరళం కురిసే రాత్రేనని!

మనిషిప్పుడు
సౌకర్యాల సౌధాలతో
కృత్రిమ కాంతను కావలించుకు
నిద్రిస్తున్నాడు!
పుడమి తల్లి పచ్చి బాలింతయి
భూబకాసురులను చూసి
పలవరిస్తూ విలాపాఘు్నలు
చిందిస్తోంది!

పూచే ప్రతి పువ్వూ నా ఆత్మ
విత్తే ప్రతి విత్తూ..
నాకు విన్నాణం!
మా తాత తండ్రులు
దున్నిన భూమి సాక్షిగా
చెబుతున్నాను
మట్టిని ధ్వంసం చేసిన వాడు
మట్టిగొట్టుకుపోతాడు!

భూమి నా భావావేశం
భూమి నా కన్నతల్లి, నా నేస్తం
నా పచ్చదనాన్ని తగులబెట్టి
చెట్లను నరికేస్తున్న
ఓ నరకాసుర సంతానమా!
మీరు నిర్మించుకుంటున్న
కాంక్రీటు సౌధాలే
మీ సమాధులవుతాయి జాగ్రత్త.. జాగ్రత్త..!
- డా.నెమిలేటి, తిరుపతి
చరవాణి : 9490182636

అక్షరబాల్యం

అక్షరాలెప్పుడూ
నగ్నంగానే వుంటాయి
అప్పుడే పుట్టిన
పురిటి పాపల్లా..!
కాకుంటే - మనమే
అప్పుడప్పుడు
నాగరికతను కట్టి
సంస్కృతిని చుట్టి
సీతమ్మల్ని - మాతమ్మల్ని చేస్తుంటాం
తామరాకుపై నీటిబొట్టులా
ఏటి ఒడ్డున తాటిచెట్టులా
స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఎదగాల్సిన
అక్షరబాల్యాన్ని -
మనమే బలవంతంగా
బరియల్ గ్రౌండ్ చేస్తున్నాం
మేధావుల్లారా
ఒక్క క్షణం ఆలోచించండి
అందమైన ఈ అక్షరబాల్యాన్ని
ఆనందంగా ఆడుకోనిద్దాం
అక్షరాలికి - అక్షరాలా
స్వేచ్ఛనిద్దాం!
- ఈదూరు సుధాకర్
చరవాణి : 9849561613

మన కర్తవ్యం

ఎన్ని వనె్నలు, ఎన్ని చినె్నలు
ఎన్ని వయ్యారాలు, ఎన్ని హోయలు
కలగలసిన రసరమ్య భాష
మన తెలుగు భాష
తియ్యమామిడి కన్నా, తేనె కన్నా
మధురాతి మధురమైన భాష
మన తెలుగుభాష
ఎర్రన, తిక్కన, నన్నయార్యుల
ఘంటనా రాటుదేలిన రాజభాష
మన తెలుగుభాష
కృష్ణరాయలచే ఘనకీర్తినొందిన
మంత్ర భాష మన మాతృభాష
కవుల నాల్కలపై అలవోకగా నర్తించు
కమనీయ భాష మన మాతృభాష
అట్టి మాతృభాష మృతభాషగా
మారుతున్నా వౌనం దాల్చడం
మన మాతృమూర్తిని మనం
దూరం చేసుకోవడమే
అందుకే తెలుగునే వాడుమన్నా
భాషను కాపాడుమన్నా
ప్రగల్భాలు పలుకకోయి
సజీవ భాషగా ఉంచవోయి
తెలుగు ఏమవుతుందో ఏమో
వేదికలపై విషాద విషణ్ణ వదనాలు
మనవాడు ‘మమీడాడీ’ అనకపోతేనేమో
మనలో ఏదో తెలియని దిగులు
లక్షణంగా లక్షలాది సర్కారీ బడులుండగా
లక్షల్ని తగలేసి కానె్వంటు సీటుకై పడిగాపులు
రహదారికిరువైపులా తెలుగు వెలుగుకు
పదునెక్కిన నినాదాలు హోరెత్తిస్తుంటే
మనవాడికి తెల్లవాడి భాష
తలకెక్కేలా తెరవెనుక ప్రయత్నాలు
మనలోనే గందరగోళం
మనభాష అజరామరం
మన బడినే గుడిగా చేద్దాం
మన గురువుల మనసే మార్చుదాం
తెలుగోడి - తెల్లవాడి భాషలకు సమప్రాధాన్యతనిద్దాం
మన తెలుగుజాతి సనాతన,
సంప్రదాయ, సాంస్కృతిక విలువల
వారసత్వాన్ని భావితరాలకు మిగుల్చుదాం!