రుచి

చక్కటి ఆరోగ్యానికి సరైన ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం తీసుకొనే ఆహారం గురించే కాదు ఏ విధంగా ఆహారాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలో కూడా అంటే మనం తీసుకొనే ఆహారంలో సగం తిని, మరో పావువంతు నీరు త్రాగి మిగతా పావు భాగాన్ని ఖాళీగా వుంచాలని, సాత్వికాహారం మాత్రమే భుజించాలని, అపక్వాహారాన్ని అంటే పచ్చికూరలు, పళ్లు, మొలకెత్తిన గింజలు వంటివి తినడం ఉత్తమమని మనకు భగవద్గీత చెబుతుంది. ఒక్క ఆహారమే కాదు మనిషి ఎట్లా మసలుకుంటే మనిషిగా పిలువబడుతాడో కూడా భగవద్గీత చెబుతుంది.
పాశ్చాత్య మోజులో మనం పెళ్లిళ్ళల్లోనూ, అనేక రకాల వేడుకల్లోనూ ప్లాస్టిక్ ఆకులు, ప్లేట్లలో వేడి వేడి పదార్థాలు వడ్డించి పెట్టడం చూస్తున్నాం. ప్లాస్టిక్ గ్లాసులలో మంచినీళ్ళు, వేడి కాఫీ తాగుతున్నాం. మనకి తెలియకుండా హాని కలిగించే కొన్ని రసాయనాలు, బాక్టీరియా ఆహారంతోపాటు కడుపులోనికి పోతోంది. బఫే భోజనం అంటే ప్లేట్లు పట్టుకుని తిరుగుతూ, కావలసినవి వడ్డించుకు
తినడమే కదా.
అవగాహనతోనే అసలైన బలం
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అక్షర లక్షలు విలువ చేసే ఈ మాటను మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఆహార భద్రత గురించి మన భారతీయ పురాణ గ్రంథాలు భారతంలోను, భగవద్గీతలోను ఎంతో విశదంగా చెప్పారు. శుచి శుభ్రత పాటిస్తూ మంచిమనసుతో భగవంతుని స్మరిస్తూ వండి భగవంతునికి నివేదించి అతిథిదేవో భవ అని అందులోంచి కాస్తంత దానం చేసి ఆ తరువాత మనం తింటే అది మహాప్రసాదమవుతుంది. తినే ఏ పదార్థాన్నైనా భగవంతునికి అర్పించి ‘పరమేశ్వరార్పణమస్తు!’, ‘కృష్ణార్పణమస్తు!’ అని భగవంతుని తలచుకుని కళ్ళకు అద్దుకు తింటే తినే ఆహారం పుష్టిని, శక్తిని ఇస్తుంది. అంతేకాదు, మనం ఏ పని చేసినా అది ఈశ్వరార్పణమస్తు అని కాని, ఈశ్వరుడు తన చేత ఈ పని చేయిస్తున్నాడు అనిగాని అనుకొని చేసే ఏ పనియైనా మంచి ఫలితాలను ఇస్తుందని పెద్దలందరి అనుభవం.
ఇవే రోగ కారణాలు
ఆహార విషయానికి వచ్చినపుడు- నిల్వ ఉంచిన పదార్థాలు, ఒకసారి వండినవాటిని తిరిగి వేడి చేసుకుని ఆ పదార్థాలు తినకూడదు. శ్రీకృష్ణపరమాత్మయే స్వయంగా భగవద్గీతలో- వండిన తరువాత ఒక జాము దాటినది, సారము నశించినది, దుర్గంధపూరితమై పాచిపోయిన పదార్థాలు, ఒకరు ఎంగిలి చేసినవి, తీవ్రమైన రుచిని కలిగినవి సేవించకూడదని చెప్పారు. ఇలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్య శాస్త్ర రీత్యా కూడా ఆరోగ్యానికి చేటుతెచ్చేవే అ ని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇవే రోగకారణాలూ అవుతాయి.
అక్రమ ఆర్జనతో తినే ఆహారం అనర్థాలకు హేతువ
అంతేకాదు మనం తినే తిండి కూడా న్యాయమైన ఆర్జనతో కూడి వుండాలని, అక్రమ ఆర్జన పనికిరాదని కూడా శ్రీకృష్ణపరమాత్మ చెప్పేరు. మోసాలు, అన్యాయాలు చేసి సంపాదించిన అక్రమార్జనతో చేసే అన్నదానం వల్ల అనర్థాలకు హేతువ అవు తుం ది.న్యాయంగా ఆర్జించిన సొమ్మును దానం చేస్తేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో చెప్పే పెద్దమనుష్యులు ఉన్నా వినేవారు, విని ఆచరించేవారూ తక్కువగా ఉన్నారు. కనుక ముందు పాఠ్యగ్రంథంగానే కాదు ప్రతి మనిషి కుల మత జాతి భేదాలను పక్కనపెట్టి భగవద్గీతను చదివి దాని అంతరార్థాన్ని గ్రహిస్తే మనుషులందరూ మనీషులుగా తయారవుతారు. శ్రీకృష్ణపరమాత్మ రాయబారం నిమిత్తం ధృతరాష్ట్రుని కొలువునకు వెళ్లినపుడు దుర్యోధనుడు విందుకు ఆహ్వానిస్తే దుర్యోధనుని ఇంటికి వెళ్లకుండా విదురుని ఇంటికి వెళ్లి భుజించేడు. దుర్యోధనుడు కారణం అడిగితే నీ సంపాదన న్యాయార్జితంకాదని, అహంకారం, డంబంతో పెట్టే కూడు కన్నా భక్తితో పెట్టే పట్టెడన్నం మేలు చేస్తుందని చెప్పి దుర్యోధనుని కళ్లు తెరిపించాడు. వేమన కూడా ‘గంగిగోవు పాలు’ పద్యం ద్వారానే దీనినే మరింత వివరంగా చెప్పేడు. ఇట్లా ఎందరో శతకకారులు, అనుభవజ్ఞులు చెప్పి ఉన్నారు. మనం తీసుకొనే ఆహారం పట్ల నియమ నిష్ఠలు పాటిస్తే మనకే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
పాశ్చాత్యమోజులో ఆహార నియమాలు ఉల్లంఘన
కాని నేడు పాశ్చాత్య మోజులో మనం పెళ్లిళ్ళల్లోను, అనేక రకాల వేడుకల్లోను ప్లాస్టిక్ ఆకులు, ప్లేట్లలో వేడి వేడి పదార్థాలు వడ్డించి పెట్టడం చూస్తున్నాం. ప్లాస్టిక్ గ్లాసులలో మంచినీళ్ళు, వేడి కాఫీ తాగుతున్నాం. మనకి తెలియకుండా హాని కలిగించే కొన్ని రసాయనాలు, బాక్టీరియా ఆహారంతోపాటు కడుపులోనికి పోతోంది. బఫే భోజనం అంటే ప్లేట్లు పట్టుకుని తిరుగుతూ, కావలసినవి వడ్డించుకు తినడమే కదా. రకరకాల మనుషులు ఎంగిలి చేతితో వడ్డించుకుతినడం ఈ బఫే పద్ధతిలో ప్రత్యేకత. కేటరింగు పద్ధతి అవడంవలన వారి స్వలాభాల కోసం మధ్యాహ్నం వండినవి రాత్రి, రాత్రి వండినవి మరునాడు వేడి చేసి పదార్థాలను కలిపి పెట్టడం వారి ప్రత్యేకత. ఇవన్నీ మనం చేస్తున్నామంటే స్వయంగా భగవాను డు అయిన శ్రీకృష్ణపరమా త్మ భగవద్గీతలో చెప్పిన అన్ని ఆహారనియమాలను నేడు మనం ఉల్లంఘిస్తున్నట్లే!
తస్మాత్ జాగ్రత్త సుమా!

- జంగం శ్రీనివాసులు