బిజినెస్

నిజాయతీగా వ్యవహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1.: నిజాయతీగా వ్యవహరించాలని, విశ్వసనీయతను కోల్పోరాదని చార్టెడ్ అకౌంటెంట్ల (సిఎ) కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. శనివారం ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెం ట్స్ ఇన్ ఇండియా (ఐసిఎఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎలనుద్దేశించి మాట్లాడుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా చురకలు వేశారు. సిఎల మూలంగానే కంపెనీలు అవినీతికి పాల్పడగలుగుతున్నాయని ఆయన విమర్శించారు. మీరిప్పుడు నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాల మూలంగానే మీతో మనసు విప్పి మాట్లాడుతున్నానన్నారు. కంపెనీల తప్పుడు బ్యాలెన్స్ షీట్లపై సంతకాలు చేయవద్దన్న మోదీ.. దేశ ప్రధాన మంత్రి కంటే సిఎల సంతకం విలువైనది, శక్తివంతమైనదని, వారు సంతకాలు చేసిన అకౌంట్లను ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుందని చెప్పారు. మ్యూచువల్ ఫండ్సైనా, ఇతర పథకాలైనాసరే అమాయక ప్రజలు పెట్టుబడులు పెట్టేది మీ సంతకాల ఆధారంగా ప్రభుత్వం అనుమతులిస్తున్న సంస్థలు జారీ చేస్తున్నవాటిలోనేనని గుర్తుచేశారు. కాబట్టి తప్పుడు సంతకాలు పెట్టరాదని, స్వార్థ ప్రయోజనాల కోసం మీమీ విశ్వసనీయతను దూరం చేసుకోరాదని హితవు పలికారు. నిరుడు నవంబర్ 8వ తేదీన జరిగిన పాత పెద్ద నోట్ల రద్దు అందరికంటే సిఎలకే ఎక్కువ జ్ఞాపకం ఉంటుందన్న మోదీ.. పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు తరువాత సిఎలు చాలా పనే చేయాల్సి వచ్చిందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో ఎప్పుడు చేయనంత పని నవంబర్ 8 తేదీ తరువాత చేశారంటూ ఆయన సిఎల అవినీతిపై చురకలు వేశారు. ‘సిఎల కార్యాలయాలు రాత్రింబవళ్లు పని చేశాయి. అసలు మీరు ఏ పని చేశారు? మంచి పని చేశారా? చెడ్డ పని చేశారా? దేశం కోసమే పని చేశారా? లేక క్లయింట్ కోసం పని చేశారా? మీరు ఎదోఒకటైతే చేశారు.’ అంటూ నరేంద్ర మోదీ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. దేశంలో ఇంత వరకు కేవలం ఇరవై ఐదు మంది సిఎలకు మాత్రమే తప్పు చేసినందుకు శిక్ష పడిందని, దాని అర్థం.. మిగతా సిఎలు తప్పు చేయలేదనా? అంటూ మోదీ వారి నిజాయతీని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సిఎలు కృషి చేయాలని నరేంద్ర మోదీ కోరారు. కంపెనీలు తప్పు చేయకుండా చూడాలి తప్ప వారి తప్పులను కప్పిపుచ్చెందుకు ప్రయత్నించకూడదన్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి సంతకానికి లేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత, బలం సిఎల సంతకానికి ఉందన్నారు. మీరు సంతకం చేసే ఖాతాను ప్రభుత్వం, ప్రజలు విశ్వసిస్తారని మోదీ చెప్పారు. దానే్న అధికారులు ఆమోదిస్తారని, అలాంటి కంపెనీలో వృద్ధ మహిళ, ఒక ఉద్యోగి తన పెన్షన్, వేతనం డబ్బులు పెడతారని, ఆ కంపెనీ మూత పడితే సిఎలకు మాత్రం ఏమీ కాదని, సదరు మహిళ, ఉద్యోగి కష్టార్జితం, భవిష్యత్తు నాశనమైపోతుందన్నారు. ‘కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ సంతకంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దు.’ అని మోదీ సూచించారు. దేశంలోని చార్టెడ్ అకౌంటెంట్లు మారవలసిన సమయం ఆసన్నమైందన్నారు.
చిత్రం.. ఐసిఎఐ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతున్న మోదీ