మెయిన్ ఫీచర్

వానాకాలం అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇష్టమున్నా..లేకున్నా ముసురు కాలంలో రైయిన్ కోట్స్, గమ్‌బూట్స్, వాటర్‌ప్రూఫ్ మేకప్ వేసుకోవాల్సిందే. చినుకులు పడుతున్నాయి కదా అని ఎపుడూ మెయిన్‌టెయిన్ చేసే స్టైల్‌ను ఇపుడు వదలేయలేం కదా!.మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మనమూ మారక తప్పదు. అందునా ఆధునిక యువత ఈ కాలంలో స్టైల్‌ను వదులుకోవటానికి సుతరాము ఇష్టపడదు. ఓ వైపు యువత అభిమానించే నటీనటులు ఏ కాలంలో ఎలా ఉండాలో వస్త్ధ్రారణలో మార్పులు చేసుకుంటుంటే మరి వారిని అనుకరించక ఉంటారా? ఉత్తర భారతంలో ఆసాప్ రాకీ, డ్రాకే, బెల్లా హడిడ్, కైలీ, కెండాల్ జెన్నర్, కిమ్ కర్దాషియన్ తదితరులు కాలానికి తగ్గట్లు స్టైల్ మెయిన్‌టెయిన్ చేయటంలో ముందు వరుసలో ఉంటారు. రుతుపవనాల వరుస మారినట్టే యువత కూడా ఎవరికి వారు స్టైల్‌గా ఉండటానికి ఈ కాలంలో ప్రయత్నిస్తారని, వార్డురోబ్‌లో ఉన్న షార్ట్స్, స్కర్ట్స్, గమ్‌బూట్స్‌ను బయటకు తీస్తారని, ట్రెంచ్ కోట్స్ యువతీ యువకులిద్దరికి ఈ కాలంలో ఉపయోగించవచ్చని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్ అంటున్నారు. కరిష్మాకపూర్, షారూఖ్ ఖాన్, అలియాభట్‌ల వద్ద అర్చన ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ కాలంలో ఫ్యాబ్రిక్ దుస్తులు మంచిదని, వెంటనే ఆరిపోతాయని ఆమె చెబుతున్నారు. ఈ దుస్తులు కూడా చూడటానికి కలర్‌ఫుల్‌గా, ఆనందం కలిగించేటట్లు వర్షాకాలాన్ని బీట్ చేసేలా ఎంపిక చేసుకోవాలి.
అలాగే గొడుగు తీసుకువెళ్లటం ఈ కాలంలో స్టైల్‌కి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆమీపాటిల్, అలియాభట్ కూడా ఈ కాలంలో పసుపు రంగును ఎక్కువగా ఇష్టపడతారు. మార్కెట్లోకి ట్రెండీ రెయిన్ కోట్స్, క్యాప్స్, పఫ్ఫర్ జాకెట్స్ స్టయిల్‌గా వచ్చేశాయి. ఇవి మెత్తగా.. వదులుగా ఉండేటట్లు చూసుకోవాలి. పాదాలకు ధరించే షూస్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. స్లిప్ప ర్లు, రబ్బరు బూట్లు ధరించకపోవటం ఎంతో మంచిది. వాటర్‌ప్రూఫ్ కాని వస్తువులను వెంట తీసుకువెళ్లకపోవటమే ఉత్తమం. అమ్మాయిలు ఈ కాలంలో కుర్తీలు, హ్యాండ్‌లూమ్ చీరలు ధరిస్తే బాగుంటుంది. అలాగే కాంట్రాస్టింగ్ కలర్స్ కూడా ఈ కాలంలో చక్కగా నప్పుతాయి. బయటకు వెళ్లేటపుడు లూస్ టీస్, షార్ట్ కుర్తీలు ఎంచుకోవటం మం చిది. ఇక మేకప్ విషయానికి వస్తే లేయర్స్ వదిలేయండి వాటర్ ప్రూఫ్ మేకప్ ఎంతో ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు. మేకప్ నిండుగా వేసుకున్నా ఆయిల్ కంటెంట్ లేకుండా జాగ్రత్తపడాలి. బుగ్గల మీద లైట్ కలర్ పౌడర్ వాడితే సరిపోతుంది. పెదాలను స్ట్రాబెర్రీ వలే ఎర్రగా ఉంచుకుంటే అందంగా ఉంటారు. కరెంట్ షాకు ఇచ్చినట్లు బ్లూ కళ్లతో మిలమిల మెరిసేపోయేటట్లు వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోమని సలహా ఇస్తున్నారు మేకప్ ఆర్టిస్ట్ ఎమ్రాన్. ఈయన సానియా మీజ్రా, కాజల్ అగర్వాల్‌కు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. మరింకెందుకు ఆలస్యం కాలంతో పాటు కొత్తదనాన్ని ఆహ్వానించినపుడే మనకంటూ ఓ స్టైల్ ఉంటుందని గ్రహించండి.