'క్లాప్' కొట్టు గురూ!
కెరీర్‌పై ‘శ్రద్ధ’!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో వెండితెరపై వెలిగిపోవాలని కలలుగన్న అందాలతార శ్రద్ధాదాస్ మళ్లీ కెరీర్‌పై శ్రద్ధపెడుతోంది. గతంలో ఈ అమ్మడు చేసిన చిత్రాల్లో చెప్పుకోతగ్గ పాత్రలేవీ తనకు లభించలేదు. వచ్చిన వాటిలో అందరూ మెచ్చేనటననే ప్రదర్శించినప్పటికీ టాలీవుడ్ అనుకున్న రేంజ్లో అవకాశాలను కలిపించలేకపోయింది. అయినా కెరీర్‌పై శ్రద్ధ తగ్గలేదు. పైగా ఎప్పటికైనా అనుకున్నది సాధించాలనుకుంది. అదే దారిలో ముందుకు కదిలింది. కదులుతూనే వుంది. తాజాగా మిస్ మనాలి పాత్రలో కనిపించబోతోంది. అది అలాంటి ఇలాంటి పాత్ర కానేకాదట. పాత్రికేయురాలిగానట. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ‘పిఎస్వి గరుడ వేగ 126.18ఎం’ అనే చిత్రంలో శ్రద్ధాదాస్ ఈ క్యారెక్టర్ని పోషిస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. పూజా కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. మరో ప్రత్యేక గీతంలో సంచలన తార సన్నీ లియోన్ కనివిందుచేయబోతోంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చిత్రంలో మనాలి పాత్రను ఓ ఛాలెంజింగ్‌గా తీసుకొని ఉత్సాహంగా ఉరకలు వేస్తోందిట శ్రద్ధ. ‘‘నా కెరీర్లో ఓ మైలురాయిలా ఈ చిత్రంలోని పాత్ర నిలిచిపోతుంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని చిత్రాలు చేస్తాను’’అని చెబుతోంది ఆశగా శ్రద్ధ! వాహ్..శ్రద్ధా ఆల్ ది బెస్ట్!!