బిజినెస్

క్షీణించిన ఎన్‌టిపిసి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 18.90 శాతం క్షీణించింది. 2,492.87 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,074 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఎన్‌టిపిసి తెలియజేసింది. ఆదాయం విషయానికొస్తే ఈసారి 17,657.99 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 19,371.33 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే పోయినసారి విద్యుదుత్పత్తి ద్వారా 18,915.19 కోట్ల రూపాయలుగా ఉన్న ఆదాయం.. ఈసారి 17,455.71 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే గత ఏడాది 2015 ఏప్రిల్-డిసెంబర్‌లో సంస్థ లాభం 7,526.50 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఏడాది 2014 ఏప్రిల్-డిసెంబర్‌లో 7,346.83 కోట్ల రూపాయలుగా ఉంది.