బిజినెస్

డిపాజిటైన పాత పెద్ద నోట్లను ఇంకా లెక్కిస్తున్నాం: ఆర్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: రద్దయిన పాత పెద్ద నోట్ల లెక్కింపు ఇంకా జరుగుతూనే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ బుధవారం పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. ఈ నోట్లను పోస్ట్ఫాసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, అంతే విలువైన కొత్త నోట్లను, ఇతర నోట్లను పొందాలని సూచించారు. దీంతో పెద్ద మొత్తంలో డిపాజిట్ అయిన ఆ నోట్లను ఇంకా లెక్కిస్తూనే ఉన్నామని పటేల్ చెప్పారు. రద్దయిన పాత 500, 1,000 రూపాయల నోట్ల విలువ ఎంతన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడు అడిగిన ప్రశ్నకుగాను పటేల్ పైవిధంగా జవాబిచ్చారు. అయితే ప్రస్తుతం దేశంలో 15.4 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని, నిరుడు నవంబర్ 8 నాటికి 17.7 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉన్నాయని తెలిపారు.