మెయిన్ ఫీచర్

‘చైతన్య’శీలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా అబ్బాయి సరిగా చదవటం లేదు. జులాయిగా తిరుగుతున్నాడు. వీడిని శ్రీ చైతన్యలో వేస్తే ఏమన్నా దారికి వస్తాడేమో అని ఆశ- ఓ కన్నతండ్రి. మా అమ్మాయిని డాక్టరు చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకే శ్రీ చైతన్యలో వేసి హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నాం - సగటు తల్లిదండ్రులు
ఇలా నేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని ప్రతిఒక్కరి నోట వినిపించే శ్రీ చైతన్య విద్యాసంస్థ వటవృక్షం నీడలో తమ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలని ఆరాటపడే సగటు తల్లిదండ్రుల ఆలోచనలు ఇవి. ఉన్నత విద్యావ్యవస్థకు ప్రతిరూపంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలను తీర్చిదిద్దిన ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు ఆశయం కూడా ఇదే. భావి భారతావని నిర్మాణానికి అవసరమయ్యే ఉత్తమ పౌరుడిని తరగతి గది నుంచే తయారుచేయాలనే సంకల్పంతో ఏర్పాటుచేసిన ఈ విద్యాసంస్థ నేడు కన్నవారి కలల సాకారానికి ప్రతిరూపంగా నిలిచింది. చదవింది వైద్యవిద్య అయినా విద్యావేత్తగా ఆయన తనని తాను తీర్చిదిద్దుకున్నారు. కేవలం 56మంది విద్యార్థులతో 1986లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ నేడు 300 బ్రాంచ్‌లతో విస్తరించింది. మూడు దశాబ్దాలకు పైగా విద్యావ్యవస్థలో తనదైన చెరగని ముద్ర వేసుకున్న ఈ సంస్థ వ్యవస్థాపకులు సత్యానారాయణ, తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చేయూతనిస్తున్న ఆయన కుమార్తె బొప్పన సీమ తమ అనుభవాలను పంచుకున్నారు.
56మంది విద్యార్థులతో తొలి బ్రాంచ్..
డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. విద్యార్థులు మాత్రం వెయ్యిమందికి పెరిగారు. 1995 నుంచే ఈ విద్యాసంస్థ విస్తరించటం ఆరంభమైందంటారు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ. ఒకేఒక బ్రాంచ్‌తో ఆరంభమైన ఈ విద్యావ్యవస్థ నేడు 300 బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆయనకు ఈ సంస్థను ఏర్పాటుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే.. డాక్టర్ సత్యనారాయణ ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చి తన కుమార్తెల ఉన్నత చదువుల కోసం బాలికల కాలేజీని వెతికారు. సరైన కాలేజీ ఒక్కటి కూడా కనిపించలేదు. అలాంటి నిరీక్షణ నుంచే ఆయన ఈ విద్యాసంస్థను ఏర్పాటుచేయటం జరిగింది. అప్పటి నుంచే తాను ఓ వ్యాపార విద్యావేత్తగా ఎదగటం ఆరంభమైందని ఆయన తెలియజేస్తున్నారు.
ఇంటర్ నుంచి పునాది..
ఇంటర్ నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయటం అనేది శ్రీ చైతన్య విద్యాసంస్థల తన ప్రత్యేకతగా నిలుపుకుంది. పదవ తరగతిలో మంచి మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులను గుర్తించి.. వారికి ఇంటర్ నుంచి చక్కటి పునాది వేసేందుకు సమాయత్తమయ్యేటట్లు ఈ విద్యావ్యవస్థను ఆయన తీర్చిదిద్దారు. పదవ తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లటం అనేది విద్యార్థి దశలో కీలక మలుపు. అందుకే ఈ మలుపునే ఆయన వ్యాపార విస్తరణకు అవకాశంగా మలుచుకున్నారు. విద్యార్థులు వెనుకబడినట్లయితే వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
సరిహద్దులు దాటి విస్తరణ
శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ సరిహద్దులు దాటి విస్తరించటం అనేది 2004 నుంచి ఆరంభమైంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో దీని బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. 2006 నుంచి ఐఐటి-జెఇఇ, ఎఐఇఇ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు.
తండ్రి మార్గదర్శకత్వంలో..
ఇదే సందర్భంలో ఛైర్మన్ సత్యనారాయణ కుమార్తెలు సీమ, సుష్మా అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఈ సంస్థలోకి అడుగుపెట్టిన సీమ తండ్రి మార్గదర్శకత్వంలో విద్యావ్యాపారవేత్తగా రూపాంతరం చెందా రు. తొలి రెండేళ్లు సీమ విద్యావ్యవస్థను పూర్తిగా ఆకళింపుచేసుకునేందుక యత్నించారు. అంతేకాదు పాఠ్యప్రణాళికను రూపొందించే దిశగా తొలి అడుగు వేశారు. తల్లిదండ్రులు తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం వల్లే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలో ఎన్నో ఏళ్ల నుంచి సిబ్బంది, టీచర్లు పనిచేస్తున్నట్లు సీమ గుర్తించారు. వీరిలో కొంతమంది తాను చదువుకునేటప్పటి నుంచి ఉంటున్నట్లు గమనించారు. తొలుత ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఉపక్రమించారు. ఈ సందర్భంలో చిన్న పొరపాట్లు జరిగితే తల్లిదండ్రుల సలహాతో వాటిని అధిగమించేవారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛతో వారి మార్గదర్శకత్వం పనిచేయటంలో ఎంతోమంది వ్యాపారవేత్తల కుటుంబాల్లో రెండవ జనరేషన్ వ్యాపారవేత్తలుగా రాణించగలుగుతున్నారని అంటారు సీమ బోపన్న. ఆమె శ్రీ చైతన్య టెక్నో విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
2008లో ఐదు టెక్నో స్కూళ్లు ఏర్పాటుకాగా.. నేడు 340 బ్రాంచ్‌లు ఏర్పడ్డా యి. నా తండ్రే బలం, బలహీనత అని సీమ అంటారు. ఇద్దరం కలిసి పనిచేస్తున్న సందర్భంలో తండ్రి ఎల్లప్పుడు చెదోడువాదోడుగా ఉంటారని, ఏవై నా సమస్యలు వచ్చినా ఆయన సలహా సంప్రదింపులతో చాకచక్యంగా పరిష్కరించుకునే స్థాయికి ఆమె ఎదిగారు. ఎన్నో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ తండ్రి వారసత్వంగా వచ్చిన ప్రశాంతతను స్వీకరించినట్లు 34 సంవత్సరాల సీమ తెలియజేస్తున్నారు. సరైన మార్గంలో నడుస్తూ.. సాధించిన విజయాలను ఆయన ముందుంచాం. సంస్థలో అభిప్రాయభేదాలు తలెత్తినపుడు వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ..నిజాయితీ, నిబద్ధత పనిచేస్తూ ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు సీమ.

తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోమని నా తల్లిదండ్రులు నాకెంతో స్వేచ్ఛను ఇచ్చారు. ఇలాంటి స్వేచ్ఛ చాలా పారిశ్రామికవేత్తల కుటుంబాల్లో కనిపించదు. కాని పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి రెండవ జనరేషన్ వచ్చే సందర్భంలో ఇలాంటి స్వేచ్ఛ ఎంతో అవసరం.
- బొప్పన సీమ,
అకడమిక్ డైరక్టర్

తొమ్మిదేళ్లపాటు వ్యాపారంలో ఎలాంటి విస్తరణ కనిపించలేదు. విద్యార్థులు 56మంది నుంచి వెయ్యిమందికి పెరిగారు. ఇతర ప్రాంతాల్లో విద్యాసంస్థల విస్తరణ 1995 నుంచి ప్రారంభమైంది.
- డాక్టర్ బి.ఎస్.రావు,
ఫౌండర్, ఛైర్మన్.