రివ్యూ

ఆలస్యం.. అమృతం విషం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * జగ్గా జాసూస్

తారాగణం:
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, శాశ్వతా ఛటర్జీ, సౌరభ్ శుక్లా తదితరులు
సంగీతం: ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
నిర్మాతలు: బసు - రణబీర్
రచన, దర్శకత్వం: అనురాగ్ బసు
*
మూడేళ్ల నాటి కథ. కేప్ టౌన్ అంటే రణబీర్‌కీ, కత్రినాకీ బోలెడంత ఇష్టం- నిజ జీవితంలో. 2014లో ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా వీరిద్దరి మధ్య ఏవో గొడవలు చోటు చేసుకోవటం.. రొమాన్స్ సన్నివేశాలుగానీ.. సెంటిమెంట్ సన్నివేశాలుగానీ సరిగ్గా పండకపోవటంతో.. అనురాగ్ ఈ సినిమాని అర్థాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. కొన్ని సీన్స్ రీషూట్ చేయాల్సి వచ్చింది. దాంతో 20 రోజుల షెడ్యూల్ కాస్తా మూడేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. ఏ కథైనా.. రోజులు దొర్లే కొద్దీ.. ప్రేక్షకుల్లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ కోల్పోతుంది. నిరుత్సాహాన్ని పుట్టిస్తుంది. ఏళ్ల తరబడి తీసిన బాలీవుడ్ సినిమాలు రిలీజైన తర్వాత సంచలనాల్ని సృష్టించిన మాట వాస్తవమే గానీ... ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ‘సీన్’ రివర్స్ అయ్యింది. చతికిలపడింది.
కథ -జగ్గా (రణబీర్ కపూర్) వొఠ్ఠి అమాయకుడు. అమాయకత్వం వెనుక బోలెడన్ని తెలివితేటలు. ఏక్సిడెంట్ ప్రోన్ అయిన తండ్రి బాగ్చీ (శాశ్వత ఛటర్జీ)తో చీకూ చింతాలేని జీవితాన్ని గడుపుతూంటాడు. కొద్ది రోజులకు డార్జిలింగ్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో చేరతాడు జగ్గా. స్కూల్ హాస్టల్‌లో తోటి వాళ్లని తన సిద్ధాంతాలతో.. ఆలోచనలతో తెగ ఇబ్బంది పెట్టేస్తూంటాడు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకొనేందుకు ప్రయత్నిస్తూంటాడు. ఉన్నట్టుండి జగ్గా తండ్రి అదృశ్యమవుతాడు. ఎక్కడికి వెళ్లాడో తెలీదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఐతే- ‘విహెచ్‌ఎస్’ టేప్ ద్వారా తన తండ్రి నుంచి మెయిల్స్ అందుకుంటూంటాడు. మరో ఏక్సిడెంట్ ప్రోన్ జర్నలిస్ట్ శృతి (కత్రినా కైఫ్) ద్వారా.. తన డిటెక్టివ్ స్కిల్స్ ద్వారా.. అదృశ్యమైన తండ్రిని వెతకటానికి బయల్దేరతాడు. జగ్గా తండ్రి అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు? స్మగ్లింగ్ రాకెట్‌కీ అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇత్యాది అంశాలతో క్లైమాక్స్‌కి చేరుతుంది కథ.
ఈ కథలో ఎక్కడా లోపం లేదు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఐతే- సినిమా ఏ అనుభూతినీ మిగల్చకుండా ముగుస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలు రక్తికట్టించక పోవటానికి కారణం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. రణబీర్ -కత్రినా ఎడమొహం పెడమొహంగా ఉండటంతో ఏదో మొక్కుబడిగా రీళ్లు చుట్టేసి వదిలేశారు. ఈ సినిమాలో ఎన్నో వెరియేషన్స్ -థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్, మిస్టరీ, ఛేజ్.. అయినా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయటంలో వెనుకబడింది. కొన్ని సన్నివేశాలు మరీ సాగతీసినట్టు అనిపిస్తుంది. అలా కాకండా.. ఈ కథని క్లుప్తంగా -ఏ సాగతీత లేకుండా చెప్పినట్టయితే కొంతలో కొంత ‘డిలే’ తాలూకు ఖాళీని భర్తీ చేసి ఉండేది. దీన్ని క్లాసిక్ అనటానికి వీల్లేదు. అలాగని కమర్షియల్ పోకడలూ లేవు. సినిమాకి హార్డ్ వర్క్ చేయలేదా అంటే అదీ కాదు. నటనా పరంగా.. బాగోలేదా అంటే అదీ కాదు. అయినా.. ‘్ఫల్’ కలగదు.
రణబీర్ సినిమా అంతా తానై నటించాడు. కత్రినా ఉన్నంతలో అతనికి సపోర్ట్ చేసింది. మిగతా పాత్రధారులందరూ ఆయా పాత్రల పరిధి మేరకు నటించారు. సంగీతం ఫర్వాలేదు. పాటలు కొన్ని వినసొంపుగా ఉన్నాయి. దర్శకుడు అనురాగ్ బసు ఏదో మాయ చేద్దామని అనుకున్నాడు గానీ.. మూడేళ్ల సుదీర్ఘ కాలం దాన్ని కప్పేసింది.

-బిఎనే్క