బిజినెస్

ఒఎన్‌జిసి చేతికి హెచ్‌పిసిఎల్ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో వాటాను ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసికి విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. ఒఎన్‌జిసికి హెచ్‌పిసిఎల్‌లో 51.11 శాతం వాటాను అమ్మాలని నిర్ణయించింది. దీని విలువ 26,000 కోట్ల రూపాయల నుంచి 30,000 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా. కాగా, ఈ వాటా అమ్మకం.. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా సమీకరించాలనుకున్న 72,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకునేందుకు మోదీ సర్కారుకు దోహదపడనుంది. గెయిల్‌తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)ను విలీనం చేయాలని, ఆయిల్ ఇండియాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి)చే కొనిపించాలని కూడా మోదీ సర్కారు చూస్తోంది.