బిజినెస్

ఆకట్టుకున్న మెటల్, హెల్త్‌కేర్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 19: మంగళవారం భారీ నష్టాలపాలైన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 244.36 పాయింట్లు పుంజుకుని 31,955.35 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 72.45 పాయింట్లు బలపడి 9,899.60 వద్ద నిలిచింది. మెటల్, హెల్త్‌కేర్, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. మెటల్ షేర్ల విలువ 1.95 శాతం, హెల్త్‌కేర్ షేర్ల విలువ 1.78 శాతం, రియల్టీ షేర్ల విలువ 1.50 శాతం, ఎఫ్‌ఎమ్‌సిజి షేర్ల విలువ 1.49 శాతం మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో దాదాపు ప్రధాన సూచీలన్నీ లాభపడగా, ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలు లాభాల్లోనే కదలాడాయి. ఇదిలావుంటే మంగళవారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న పొగాకు ఆధారిత సంస్థల షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. ఐటిసి షేర్ విలువ 2.42 శాతం, విఎస్‌టి షేర్ విలువ 1.22 శాతం, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్ ధర 0.71 శాతం మేర పెరిగాయి. ఇకపోతే మంగళవారం సుమారు 85 వేల కోట్ల రూపాయలు క్షీణించిన బిఎస్‌ఇ మార్కెట్ విలువ.. బుధవారం అంతకంటే ఎక్కువగా పెరిగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 1,31,26,644 కోట్ల రూపాయలకు బిఎస్‌ఇలోని సంస్థల మార్కెట్ విలువ చేరింది.