బిజినెస్

మెగా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, జూలై 19: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య ఈ నెల 24న హైదరాబాద్‌లో 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) సమావేశం మొదలవుతోంది. అయితే ఈ మెగా ఆసియా వాణిజ్య ఒప్పందం ఈసారి కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో కమ్ముకున్న ఉద్రిక్త వాతావరణమే ఇందుకు కారణం. ఒప్పందం విషయంలో భారత్ వైఖరిపై ఈ ఉద్రిక్తతల ప్రభావం చూపవచ్చన్న అంచనాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి మరి. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. భారత్‌తోపాటు చైనా, బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన 700 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్ వద్ద ఈ సమావేశం జరుగుతోంది. వస్తు, సేవల వాణిజ్య నిబంధనల సరళతరం, పెట్టుబడుల ప్రోత్సాహమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశం.. చివరిసారిగా మే నెలలో ఫిలిప్పీన్స్‌లో జరిగింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సమావేశం 19వది. అయితే భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ సమావేశంలోనూ ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరే అవకాశం లేదనిపిస్తోంది. సరిహద్దులో చైనా దూకుడుపై భారత్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే చైనా ఉత్పత్తులను కొనరాదన్న ప్రచారం దేశంలో ఎక్కువైంది. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత మార్కెట్.. ప్రపంచ దేశాలకు అత్యంత కీలకం. చైనా కూడా భారతీయ మార్కెట్‌నే నమ్ముకుని ఉత్పాదకతను పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఆర్‌సిఇపి ఒప్పందం భారత్‌తోపాటు ఇతర దేశాల కంటే చైనాకే చాలా అవసరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ఆర్థిక వ్యవస్థది రెండో స్థానం. మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కి నెట్టేయాలని చైనా ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. దానికి ఈ ఒప్పందం కొండంత బలం చేకూర్చనుంది. దీంతో ఈ ఒప్పందానికి ఒప్పుకోకుండా చైనాపై భారత్ ఒత్తిడి తీసుకురావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత జిడిపిలో సేవా రంగం వాటా 50 శాతానికిపైనే ఉంది. దేశంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇది మరింత పెరగడం ఎంతో ప్రధానం. పెరగాలంటే ఈ ఒప్పందం సఫలం కావాల్సి ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో చైనాతో సరిహద్దు సమస్యలను పక్కనబెట్టి భారత్ ముందుకెళ్లే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాదే పైచేయి. చైనాతో భారత వాణిజ్య లోటు 51 బిలియన్ డాలర్లపైనే. దీంతో చైనాతో మైత్రి.. భారత్‌కు ఆ దేశంలో మరింత వ్యాపార, వాణిజ్య అవకాశాలను తప్పక పెంచుతుందని పేర్కొంటున్నారు. అందుకే భారత్ సుహృద్భావ ధోరణితో మెలగవచ్చని చెబుతున్నారు. మరోవైపు ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్య (టిపిపి) కూటమి నుంచి అమెరికా తప్పుకుంది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. 12 దేశాలతో ఏర్పాటైన ఈ కూటమి నుంచి అమెరికాను తప్పించేశారు. దీంతో అమెరికా మార్కెట్‌లేని టిపిపి వాణిజ్య ఒప్పందం ప్రయోజనాలు నీరుగారిపోగా, ఈ నేపథ్యంలో ఆసియా ట్రేడ్ ఒప్పందం (ఆర్‌సిఇపి) ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ భారత్-చైనా సరిహద్దు ఆందోళనలు ఈ ఒప్పందాన్నీ అడ్డుకుంటున్నాయి. ఫలితంగా ఈ ఏడాది కూడా ఆర్‌సిఇపి ఒప్పందంపై సంప్రదింపులు ఫలించే అవకాశాలు లేవని, వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు ఈ సంప్రదింపులు జరగడం ఖాయమని విశే్లషకులు అంటున్నారు. కాగా, 2012 నవంబర్‌లో నాంఫెన్‌లో ఆర్‌సిఇపి చర్చలు మొదలయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్‌సిఇపి భాగస్వామ్య దేశాల త్రైమాసిక వాటా 75 ట్రిలియన్ డాలర్ల పైమాటే. ప్రపంచ జిడిపిలో ఇది దాదాపు 30 శాతంతో సమానం. అంతర్జాతీయ ఎగుమతుల్లోనూ 25 శాతం వాటాను ఆర్‌సిఇపి భాగస్వామ్య దేశాలు కలిగి ఉన్నాయి.