విజయవాడ

తీరని లోటు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ రాజకీయ నాయకుడు

అహోబలరావు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స

పొందుతూ కోలుకుంటున్న సమయంలో

ఆకస్మికంగా మృతి చెందారని,

పార్ధీవదేహాన్ని ఆసుపత్రి నుంచి ఆయన

స్వగృహానికి తరలిస్తున్నారన్న వార్త టీవీ

ఛానళ్ల ద్వారా రాష్టమ్రంతటా వ్యాపించింది.

దాంతో సహచరులు, అభిమానులు, అధికార

పార్టీ నాయకులు, మంత్రులు, ఆయన

ఇంటికి చేరుకొని పార్ధీవదేహంపై దండలు,

పుష్పగుచ్ఛాలు ఉంచి

నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రిగారు

కళ్లనీళ్లు పెట్టుకొని ‘నా సోదరుడు

అహోబలరావు మృతి రాజకీయ రంగానికే

కాదు, రాష్ట్రానికే తీరనిలోటు. ప్రతిపక్షంలో

ఉన్నా నిత్యం ప్రజల సమస్యల గురించే

మాట్లాడేవాడు. అహోరాత్రులు

శ్రమించేవాడు. మా పార్టీలో చేరతానంటే -

తొందరపడొద్దు, ఎన్నికలప్పుడు

చూసుకుందాం. ఆవిధంగా మనం

ముందుకుపోదాం - అని చెప్పాను. ఇలా

అకస్మాత్తుగా చనిపోతాడని అనుకోలేదు.

ఆయన కుటుంబాన్ని మేం ఆదుకుంటాం’

అని ప్రకటించారు. మరో నాయకుడు, సిఎం

అనుంగు శిష్యుడైన మంత్రి గన్నారావు

మాట్లాడుతూ ‘అహోబలరావు నాకు మంచి

మిత్రుడు. పదవులున్నా, లేకపోయినా

ప్రజాసమస్యల కోసం కృషి చేసేవాడు.

ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా

అండగా ఉండేవాడు. నిజాయితీనే ఊపిరిగా

బతికాడు. ఆయన లేనిలోటు తీరనిది.

ఆయన కుటుంబానికి అండగా ఉంటాం’ అని

భరోసా ఇచ్చారు.
గన్నారావు గారూ.. గతంలో మీరు ‘ఆయన

అవినీతిపరుడని, కోట్లు సంపాదించటానికే

రాజకీయాల్లోకి వచ్చాడని, ప్రజాధనాన్ని

దోచుకుతింటున్నాడని, ఆయన

రాజకీయాల్లో ఉండటం ప్రజల దౌర్భాగ్యమ’నీ

అన్నారు. ఇపుడేమో ఇలా అంటున్నారు.

మీలాంటి వాళ్లను గురించే ఒక కవిగారు

‘బతికుండగా నినే్నడిపించినోళ్లు - నువు

చస్తే ఏడుస్తరు దొంగనాయాళ్లు.. అది నువు

చూసేదికాదు, నిను కాల్చేదికాదు’ అన్నారు.

మీలాంటి వాళ్లను చూసే ఆ పాట

రాసివుంటారేమో!’ అన్నాడు వారి సంతాప

ప్రసంగాలు వింటూ కడుపు మండిన ఓ

విలేఖరి.
‘ఏమంటున్నావు నువ్వు? ఎవరితో

మాట్లాడుతున్నావో తెలుసా? ఒక బాధ్యత

కలిగిన మంత్రితో మాట్లాడుతున్నావు.

అయినా మేం నాయకులం. కోపంలో,

ఆవేశంలో ఏమేమో మాట్లాడుతుంటాం. ఆ

మాటలు ఆ క్షణంలోనే మరిచిపోతాం. లోపల

విషం కక్కుతున్నా పైకి చిరునవ్వు

నవ్వుతూ కౌగిలించుకుంటాం. అధికారంలో

ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకరికి ఒకరం

సాయం చేసుకుంటాం. ఎన్నికలపుడు ఏ

పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలుంటే ఆ

పార్టీలోకి జంప్ చేస్తాం. మేం ఎన్నికల్లో

గెలవటానికి ప్రజలకెన్నో వాగ్దానాలు

చేస్తుంటాం. కిలో బియ్యం రూపాయి అని,

రైతుల రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో

ఉద్యోగం అని, నిరుద్యోగులకు భృతి

కల్పిస్తామని, ఉద్యోగుల సమస్యలన్నీ

పరిష్కరిస్తామని.. ఇలా నోటికి వచ్చిందల్లా

చెపుతాం. కానీ వాటిల్లో ఏదీ చేయం.

నాయకుడు చెప్పింది ఎపుడూ చెయ్యడు.

అదే రాజకీయం. ఇదంతా ప్రజలకు తెలిసిన

విషయమే. ఇవన్నీ మీ ఛానల్స్ వాళ్లు,

పేపర్ల వాళ్లు హైలైట్ చేస్తారు. ఆవిధంగా

మాకు ఫ్రీగా ప్రచారం లభిస్తుంది. ఆ స్థానంలో

అహోబలరావే కాదు, ఎవరున్నా అలాగే

అంటాం - ‘తీరనిలోట’ని. పైకి సంతాపం

వెలిబుచ్చినా లోపల సంబరపడిపోతుంటాం.

ఎందుకంటే, ఒక సీటు ఖాళీ అయితే

ఎన్నికలొస్తాయి. మా క్యాండిడేట్‌ని పోటీకి

పెట్టి గెలిపిస్తే మాకు ఇంకో సీటు

పెరుగుతుంది కదా! ఇదంతా తెలిసీ నువ్వు

చచ్చు ప్రశ్నలు వేస్తావేంది’ అంటూ కాసింత

ఆవేశంగా, కొంత ప్రశాంతంగా ఆయన

సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు.
‘అంటే మీకు సిగ్గూ, అభిమానం ఏవీ

ఉండవా?’ అడిగాడు విలేఖరి.
‘అవన్నీ వుంటే వాడు రాజకీయ

నాయకుడెలా అవుతాడయ్యా! అవన్నీ

వదిలేసి అవసరమైతే బ్రోకర్ లాగానూ

పనిచేయాలి. అపుడే పరిపూర్ణ రాజకీయ

నాయకుడనిపించుకుంటాడు’ అని

బదులిచ్చాడు గన్నారావు.
‘రాజకీయాలలో కుటుంబ వారసత్వంపై

మీరేమంటారు?’ ఇదే సందర్భమనుకుంటూ

కూల్‌గా అడిగాడు విలేఖరి.
‘పిచ్చివాడా..! అది ఇప్పటిది కాదు. దేశానికి

స్వాతంత్య్రం వచ్చిన డెభ్బై ఏళ్ల నుంచీ

నడుస్తుందదే. దేశంలో అయినా, రాష్ట్రంలో

అయినా అందుకేగా మా నాయకుల

కొడుకులకు మాతృభాష రాకపోయినా పదవి

మాత్రం వరించింది. రేపు వారేకదా కాబోయే

సిఎంలు’ చెప్పాడాయన.
‘అదేంటి సార్! ఇంకో 20, 30 ఏళ్ల వరకు

ఇపుడున్న సిఎంనే ఉంటారని మొన్ననే

అన్నారుగా మీరు?’ అమాయకంగా

ప్రశ్నించాడు విలేఖరి.
‘అబ్బ! అదేనయ్యా పదవీదాహం. కానీ

కొడుకు ఊరుకోడు కదా! రాజకీయాల్లో

వెన్నుపోట్లు కూడా సహజమే మరి. ఇపుడు

ఈ అహోబలరావు పోయాడు. ఆ సీటు

ఆయన కొడుక్కో, కూతురికో ఇస్తారు.

సెంటిమెంట్‌తో వారు గెలుస్తారు. మళ్లీ

షరామామూలే! ఏదేమైనా ఆయన లాంటి

మహానుభావుడు పోవటం తీరనిలోటు!’

అంటూ ముగించాడు గన్నారావు.
ఇలా అక్కడున్న (వి)నాయకులంతా

ముక్తకంఠంతో అహోబలరావు మృతికి

సంతాపం ప్రకటించి ‘ఆయన లేనిలోటు

తీరనిది’ అంటుంటే కొత్తగా ఫీల్డ్‌లోకి

వచ్చినట్లు ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టటం విలేఖరి

వంతయ్యింది.

- సిహెచ్‌విఎస్ బ్రహ్మానందరావు, విజయవాడ. చరవాణి : 9573147109