రివ్యూ

ప్చ్.. ఏదో మిస్సైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * వైశాఖం

తారాగణం: హరీష్, అవంతిక మిశ్రా, సాయికుమార్, కాశీ విశ్వనాథ్, రమాప్రభ, ఆమని, శ్రీలక్ష్మి.
సంగీతం: డిజె వసంత్
నిర్మాత: బి.ఏ.రాజు
దర్శకత్వం: జయ
*
ప్రేమకథల్ని ఎటునుంచి ఎటైనా తీసెయ్యొచ్చు. కాకపోతే కాస్తంత ‘అనుభూతి’ అన్న చిక్కదనాన్ని రంగరించాలి. స్క్రీన్‌పై రంగుల కలనీ.. ఊహల ప్రపంచాన్నీ అద్దాలి. వీక్షిస్తున్నది అంతా భ్రాంతి అయినప్పటికీ.. ఆ లోకంలో విహరించేట్టు చేయాలి. చెట్టాపట్టాలేసుకొని.. హీరో హీరోయిన్లతోపాటు నదీ తీరాన.. ఇసుక తినె్నలపై.. పల్లెటూరి పచ్చదనంలో మమేకమై జీవించేట్టు చేయాలి. అది దర్శకుడు ఫీలైతే.. చాలదు -ప్రేక్షకులు కూడా ఫీలయ్యేట్టు చేయగలగాలి. అప్పుడే ‘ప్రేమ’కథకి అర్థం పరమార్థం ఒనగూడుతాయి. ‘చంటిగాడు’ చిత్రంతో ఓ సరికొత్త లవ్‌స్టోరీని ఆవిష్కరించిన దర్శకురాలు.. ఆ తర్వాత్తర్వాత కూడా ‘లవ్’ అంశంతో చిత్రాలు తీసి తన ‘హవా’ని చూపెట్టారు. తన అభిరుచిని ప్రేక్షకుల్తో పంచుకున్నారు. కొన్నాళ్ల విరామం తర్వాత ‘వైశాఖం’తో మళ్లీ తెర మీదికి తెచ్చిన దర్శకురాలు ఏం చెప్పదలచుకున్నారో చూద్దాం.
-వేణు (హరీష్) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూంటాడు. మాయమాటలు చెప్పటం.. అందర్నీ తన మాటల గారడీతో బుట్టలో వేసుకోవటం అతని నైజం. ఫ్లాట్స్‌లో చెప్పిన మాట చెప్పకుండా చెప్పుకొస్తూ పబ్బం గడుపుకొంటూంటాడు. యుఎస్ నించీ ఇండియా చేరిన భాను (అవంతిక) ఓ బ్యూటీ బొటిక్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. రెసిడెన్షియల్ ప్రాంతమైతే బాగుంటుందని వెతుకుతూండగా.. వేణు ఉంటున్న అపార్ట్‌మెంట్ దొరుకుతుంది. వేణు వల్ల అప్పటికే అపార్ట్‌మెంట్ జనం ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొన్న.. భాను -తాను వేణు గర్ల్‌ఫ్రెండ్‌నని చెబుతుంది. నిజానికి ఆ అమ్మాయి వేణు లవరేనా? ఈ అనుమానం వేణుక్కూడా కలుగుతుంది. మింగలేడు కక్కలేడు. భాను లవర్ కాదని చెబితే ఓ తంటా. అవునని చెబితే మరో తంటా. దీంతో మాటిమాటికీ ఆమెతో గొడవ పడుతూనే.. చనువుగా ఉంటూంటాడు. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య ప్రేమ చివురించి వెనువెంటనే -మొగ్గ తొడిగి.. మనస్ఫర్థలకు కూడా దారి తీస్తుంది. ఇదీ టూకీగా కథ. అసలు వేణు లవర్‌ని అని భాను ఎందుకు చెప్పింది? ఇద్దరి మధ్యా ఇదివరకే పరిచయం ఉందా? ప్రేమించుకున్న తర్వాత.. ఇద్దరూ విడిపోయారా? - ఇవన్నీ చూడాలంటే కాస్త ఓపిక్కావాలి. ఏ విషయంలోనూ తొందర పడకూడదు. దర్శకురాలు జయ గత చిత్రాల్తో పోల్చకూడదు. ఏదో మిస్ అవుతున్నామే అని అనుకోకూడదు. లవ్ ట్రాక్ మరీ ఇంతగా పేలవంగా నిస్సారంగా ఉందేమిటి? అని తలచకూడదు. ఫుల్‌కామెడీని ఎక్స్‌పెక్ట్ చేస్తే.. ఓ మోస్తరు హాస్యపు జల్లు కురిసిందేమిటి? అని క్వొశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకూడదు. లవర్స్ మధ్య కెమిస్ట్రీ కోసం వెతక్కూడదు. ఏమిటో ఈ స్క్రీన్‌ప్లే.. అని నిట్టూర్చకండి. ఆఖరికి కథేంటి? అని కూడా చూడకండి. ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మధ్య అలరించే పాటల్ని చూసి ఫుల్ ఖుష్ అవ్వండి. తళుక్కున మెరిసే అవంతిక గ్లామర్‌ని చూసి.. ఆహో ఓహో అనేసుకోండి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విని చూసి కాసేపు హాయిగా నవ్వుకోండి. కథలోని అపార్ట్‌మెంట్ సంస్కృతినీ.. వాస్తవ జీవితాన్ని పోల్చి చూసుకొని ఇవన్నీ ఫ్లాట్స్‌లో కామనే అనేసుకొని.. ‘కనెక్ట్’ అయిపోండి. పక్క ఫ్లాట్‌లోని కుటుంబీకులో.. ఎదురింటి ఫ్లాట్‌లోని మరొకరో.. ఇలా ఎవరైనా పరిచయం అయితే.. వీళ్లని ఎక్కడో చూసినట్టుందే? అనుకోండి. ఠక్కున జ్ఞాపకం రాకపోవచ్చు గానీ.. ఆయా క్యారెక్టర్స్ నిజ జీవితంలో ఎదురుపడి ఉంటాయి. కామెడీ ట్రాక్‌తో కాస్త ఫీల్ అవ్వండి -ఇంకేం? బోలెడంత కాలక్షేపం. కాకపోతే - ఒక్కటే.. ఇవన్నీ చేయాలంటే -ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో లేదో? పరీక్షించుకొన్న పిదప.. ‘వైశాఖం’ తిలకించండి.
హరీష్ నటనలో ఓనమాలు నేర్చుకోకపోయినా.. ఫైట్స్, డాన్స్.. ఇలా అన్నింటిలోనూ తన పెర్‌ఫార్మెన్స్‌ని చక్కగా కనబరిచాడు. అవంతిక గ్లామర్‌తో అలరించింది. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిలో మేరకు నటించారు. సాయికుమార్ పాత్ర పరిధి తక్కువైనప్పటికీ.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. వాలిశెట్టి కెమెరా ప్లస్ పాయింట్. డిజె సంగీతం ఫర్వాలేదు. చక్కటి లొకేషన్స్‌లో పాటల చిత్రీకరణ జరిగింది. చూట్టానికి బాగున్నాయి. వీటితోపాటు లవ్ ట్రాక్ గురించి పట్టించుకొని ఉంటే.. ‘వైశాఖం’ ఫీల్ కలిగించేది.

-బిఎనే్క