బిజినెస్

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: విదేశీ మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్లకు క్రమేణా దూరమవుతున్నారా? తమ పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లే కాస్తో కూస్తో ఉత్తమమని భావిస్తున్నారా? జనవరి నెలలో విదేశీ మదుపరుల తీరును చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయ మరి. జనవరిలో రుణ మార్కెట్లలోకి 2,313 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు.. స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా 11,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. స్టాక్ మార్కెట్లలోకి 70,742 కోట్ల రూపా యల పెట్టుబడులు తెచ్చినప్పటికీ, తిరిగి 81,868 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. జనవరి ట్రేడింగ్‌ను గమనిస్తే.. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న ఆందోళనలు, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం, గ్లోబల్ మార్కెట్‌లో రికార్డు స్థాయలో పడిపోయన ముడి చమురు ధరలు వంటివి అటు విదేశీ స్టాక్ మార్కెట్లను, ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలకు గురిచేశాయ. ముఖ్యంగా ఎగుమతుల మందగమనంతో పెరిగిన వాణిజ్య లోటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించిన నిరాశాజనక ఆర్థిక ఫలితాలు భారతీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు అడ్డుకట్ట వేశాయ. అయతే చైనా, జపాన్, ఐరోపా సమాజం ఉద్దీపన ప్యాకేజీల అంచనాలపై ప్రకటనలు స్టాక్ మార్కెట్లను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాయ. అయనప్పటికీ విదేశీ మదుపరులు జనవరిలో 11,126 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. గత సంవత్సరం ఆగస్టులో 16,877 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నాక, మళ్లీ ఒక నెలలో ఈ స్థాయలో పెట్టుబడులు తరలిపోవడం ఇదే. కాగా, భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి.
ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివచ్చాయ. అయతే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46,408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.