రివ్యూ

కాదన్నా.. అదే కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * ఇందు సర్కార్

తారాగణం: కీర్తి కుల్హారి, నీల్ నితిన్ ముఖేష్, అనుపమ్ ఖేర్, తోతా రాయ్ చౌదరి, సుప్రియా వినోద్ తదితరులు
సంగీతం: అనూ మాలిక్
స్క్రీన్‌ప్లే: అనిల్ పాండే, మాధుర్ భండార్కర్
మాటలు: సంజయ్
సినిమాటోగ్రఫీ: కికో నకహర
దర్శకత్వం: మాధుర్ భండార్కర్
*
1975 -చరిత్రలో అదో శిలాక్షర తేదీ. దేశంలో ‘ఎమర్జెన్సీ’ని విధించి ప్రజల్లో భయాందోళన సృష్టించిన వేదనాభరిత సంవత్సరం. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తలకెత్తుకోవటం.. ఆఖరికి ఇది ‘బయోపిక్’ కాదు- చరిత్రకీ.. ఈ కథకీ సంబంధం లేదు -యాదృచ్ఛికంగా ఆయా సన్నివేశాలు దొర్లి ఉంటే దొర్లి ఉండవచ్చు -అంతేగానీ కావాల్సి చేసింది కాదు అనటం బాలీవుడ్ రివాజు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఆత్మ’కథ కాదు -ఆమె కుమారుడు సంజయ్‌గాంధీ విధి విధానాల ప్రణాళికలేం లేవు -అంటూ కథకుడు చెప్పినప్పటికీ.. నేపథ్యం అదే. దీంతో కాంగ్రెస్ పార్టీ అనుయాయులు కోర్టులో కేసు వేయటం.. కథ కోర్టు మెట్లెక్కటం.. ఇందుకు సంబంధించి సంజయ్ గాంధీ కుమార్తె సరైన ఆధారాలు చూపని కారణంగా కేసు కొట్టివేయటం జరిగి -‘ఇందు సర్కార్’ రిలీజైంది.
***
ఇందు (కీర్తి) అనాధ. ఎవరితోనూ స్పష్టంగా మాట్లాడలేదు. మాట తడబడుతుంది. ఈ కారణంగానే ఎన్నో పెళ్లి సంబంధాలు చెడిపోతాయి. ‘ఒక మంచి ఇల్లాలిగా జీవితాన్ని గడపాలన్న’ ఆమె కోరిక -నవీన్ సర్కార్ అనే ఒక ప్రభుత్వోద్యోగి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటంతో నెరవేరే తరుణం ఆసన్నమవుతుంది. నవీన్ బాస్ ఓంనాథ్. ఓంనాథ్ అతని సహచర వర్గం ఓ ఫైవ్‌స్టార్ హోటల్ కట్టడానికి ప్లాన్ చేస్తారు -టర్క్‌మేన్ గేట్ ప్రాంతంలో. హోటల్ కట్టాలంటే అక్కడి ప్రజల్ని నిర్వాసితుల్ని చేయాలి. ఓంనాథ్ ఆదేశానుసారం పోలీసులు రంగప్రవేశం చేస్తారు. దీంతో నవీన్ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. జీవించే హక్కును కాలరాస్తున్న మంత్రి అనుచర బృందంపై తిరుగుబాటుకి దిగుతుంది ఇందు.
ఈ కథకి సమాంతరంగా -ఎమర్జెన్సీ తాలూకు నీలినీడల్ని స్పష్టంగా చూపిస్తారు. ఆనాటి రాజకీయ విష వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కథ నడుస్తుంది. ఐతే -‘పేజ్ 3’ ‘్ఫ్యషన్’ చిత్రాల స్పష్టత ఈ చిత్రంలో కనిపించక పోవటం ప్రధాన లోపం. ‘ఎమర్జెన్సీ’ నేపథ్యం ద్వారా కథకుడు ఏం చెప్పాలనుకున్నాడో పక్కదారి పట్టింది. దాంతో ‘ఎమర్జెన్సీ’ ఐడియా ఫిక్షన్‌గా మారినట్టయింది. సన్నివేశాలు కృతకంగా అనిపిస్తూ.. నిజ జీవిత పాత్రల కోణంలోంచి ప్రేక్షకుడు చూట్టం మొదలయింది. ఎప్పుడైతే పోలిక సరిచూసుకోవటం ఆరంభిస్తాడో.. అప్పటి నుంచీ కథ నేలవిడిచి సాము చేస్తుంది.
‘ఉత్తమ గృహిణి’గా జీవితం వెళ్లదీయాలన్న ‘ఇందు’లో ఉన్నట్టుండి తిరుగుబాటు మనస్తత్వం చోటు చేసుకోవటానికి కారణాన్ని హైలైట్ చేయటంలో దర్శకుడు సఫలీకృతుడు కాలేకపోయాడు. ఆమె జీవిత లక్ష్యం మంచి ఇల్లాలు. మరి ఒక రాజకీయ వాతావరణాన్నీ.. అరాచకీయ బలగాన్నీ ఎదిరించే పరిస్థితికి దారితీసే అంశాలు బలంగా లేకపోవటంవల్ల ఎక్కడో ‘లాజిక్’ మిస్సయ్యాడనిపిస్తుంది. కథకీ.. రాజకీయ నేపథ్యానికీ పొంతన లేనట్టుగా -రెండు కథలూ వేర్వేరుగా జరుగుతున్నట్టు అనిపించటంతో ‘ఎమర్జెన్సీ’ ఫీల్ కథలో కనిపించదు.
కథనీ.. రాజకీయాన్నీ విడివిడిగా చూస్తే 30 శాతం ‘ఎమర్జెన్సీ’ నేపథ్యాన్ని చూపించటంలో దర్శకుడికి పాస్ మార్కులే పడతాయి. కథలో ‘ఎమర్జెన్సీ’ని బలవంతంగా జొప్పించకుండా.. కథలో మిళితం చేసినట్టయితే.. ‘ఇందు సర్కార్’ మరింత రక్తికట్టి ఉండేది.
నటనాపరంగా -అందరూ చక్కగా జీవించారు. మాటలు పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ -అంతగా జనంలోకి వెళ్లే అవకాశం లేదు. సంగీతం ఫర్వాలేదు. దర్శకుడు మాధుర్ భండార్కర్ తనదైన స్టైల్‌లో ‘ఇందు సర్కార్’ని నడిపించాడు. కానీ.. క్లాస్‌గానూ.. కమర్షియల్‌గానూ అలరించదు.

-బిఎనే్క