బిజినెస్

‘వడ్డీరేట్ల కోతతో పెరగనున్న క్రెడిట్ డిమాండ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించడాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు స్వాగతించారు. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం క్రెడిట్ డిమాండ్‌ను పెంచుతుందని, పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తుందని, వృద్ధిరేటు బలోపేతానికి కృషి చేస్తుందని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్ అన్నారు. యెస్ బ్యాంక్ ఎండి, సిఇఒ రాణా కపూర్ సైతం ఇదే విధంగా స్పందించారు. అలాగే గృహ, ఆటో, కార్పొరేట్ రుణాల వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాలు ఏర్పడ్డాయని, మరిన్ని రుణాల మంజూరుకూ వీలు చిక్కిందని పేర్కొన్నారు. దీంతో రుణాలపై వడ్డీరేట్లు దిగొస్తాయన్న సంకేతాలు బ్యాంకర్ల నుంచి వచ్చినట్లైంది.