బిజినెస్

డేటావిండ్‌లో ఉద్యోగాల కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: చౌక ధరల టాబ్లెట్ తయారీదారు డేటావిండ్.. తమ హైదరాబాద్ ఉత్పాదక కేంద్రంలో 50 శాతం ఉత్పత్తిని ఆపేసింది. దీంతో ఈ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు పడుతోందని అక్కడి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తెలంగాణ జాయింట్ కమిషనర్ (లేబర్) ఆర్ చంద్ర శేఖరం తమకు ఉద్యోగుల నుంచి చాలా పిటిషన్లు వచ్చాయని పిటిఐకి తెలిపారు. అయితే దీనిపై సంస్థ స్పందన ఇంకా రాలేదని, త్వరలోనే వారిని సంప్రదిస్తామన్నారు. కాగా, హైదరాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి 50 శాతం తగ్గింది నిజమేనని, అమృత్‌సర్ ప్లాంట్‌లో ఉత్పత్తి జరుగుతోందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.