బిజినెస్

పారిశ్రామిక రంగానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: భారత రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ).. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఐఈఓ) ప్రాంతీయ చైర్మన్ శక్తివేల్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల పారిశ్రామిక రంగానికి తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు వీలు ఉంటుందని, ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిలో రెపో రేటు తగ్గింపు వల్ల పారిశ్రామిక రంగానికి ఊరట కలిగినట్లు అయ్యిందని వ్యాఖ్యానించారు. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని కూడా వర్తక, వ్యాపార వర్గం అంచనా వేస్తోందని పేర్కొన్నారు. ఆర్‌బిఐ తక్షణమే అన్ని బ్యాంకులకు సవరించిన రెపో రేట్ల ప్రకారం వడ్డీ రేట్లను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, దాదాపు రెండేళ్ల నుంచి దేశంలో ఆర్థిక ప్రగతి తగ్గుతూ వచ్చిందని అన్నారు. దీంతోపాటు ఉత్పాదక రంగంపై జిఎస్‌టి ప్రభావం పడి, తద్వారా ఎగుమతిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తులు వెళ్లాలంటే ఎంఎస్‌ఎంఈ రంగానికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అవసరమవుతాయని చెప్పారు. ఆర్‌బిఐ రెపో రేట్ల తగ్గింపు నిర్ణయం వల్ల ఉత్పాదక రంగం పుంజుకునే అవకాశం ఉందని శక్తివేల్ అభిప్రాయపడ్డారు.
1.3 మిలియన్ కార్లను
విక్రయించిన హ్యుందాయ్
దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల ఉత్పత్తి, ఎగుమతి కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) 1.3 మిలియన్ల కార్లను విక్రయించి మైలురాయిని అధిగమించిందని ఆ కంపెనీ ఎండి, సిఈఓ వైకె కూ తెలిపారు. తమ కంపెనీ గుర్తింపు పొందిన మోడల్స్‌లో అధికంగా గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20, క్రెటా వంటి కార్లు దేశీయ మార్కెట్లో 1.3 మిలియన్ విక్రయాలు జరిగి రికార్డు సృష్టించాయని తెలిపారు.
ఈ విజయాన్ని అందించిన వినియోగదారులు, డీలర్లు, చానల్ పార్టనర్లుకు వైకె కూ కృతజ్ఞతలు తెలిపారు. భద్రత, నాణ్యత, ఉత్తమ పనితీరు వల్ల తమ కార్లపై ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డం వల్లే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గత నెల జూలైలోనూ హ్యుందాయ్ కార్ల అమ్మకాలు భారీగానే జరిగాయ.