బిజినెస్

సంస్కరణలు ఆగవు: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సంస్కరణలకు ముగింపు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. గత నెల జూలై 1న చారిత్రక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో మున్ముందు మరిన్ని సంస్కరణలు ఉంటాయని, దీనికి విశ్రాంతి ఉండబోదని శుక్రవారం ఇక్కడ తెలిపారు.
‘ఇండియా ట్రాన్స్‌ఫార్మ్‌డ్ - 25 ఇయర్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్’ పేరిట ఉన్న పుస్తకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాగా, ఓ నూతన ఎక్స్‌చేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ను ఏర్పాటు చేసినట్లు జైట్లీ విలేఖరులకు తెలిపారు. ఒఎన్‌జిసి, ఐఒసి, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్ తదితర 22 సంస్థలతో కూడిన భారత్-22 ఇటిఎఫ్‌ను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. సిపిఎస్‌ఇ ఇటిఎఫ్ నుంచి ఇప్పటికే 8,509 కోట్ల రూపాయల నిధులను కేంద్రం సమీకరించగా, ఇప్పుడు ఈ రెండో ఇటిఎఫ్‌ను పరిచయం చేసింది.