బిజినెస్

పతంజలి దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్.. కన్స్యూమర్ గూడ్స్ రంగంలో ఓ సంచలనం. దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రత్యర్థి సంస్థలకు ఇప్పుడు పతంజలి సవాల్ విసురుతోందంటే అతిశయోక్తి కాదేమో మరి. కేవలం పదేళ్లలో కన్స్యూమర్ గూడ్స్ విభాగంలో పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంతకంతకూ పెరుగుతూపోయింది. వ్యాపార ప్రపంచంలో పతంజలి ఎదుగుదల సరికొత్త రికార్డే. అవును.. 2006లో మొదలైన పతంజలి ప్రస్థానం.. అప్రతిహతంగా కొనసాగుతోంది.
ఆచార్య బాల్‌కృష్ణతో కలిసి యోగా గురువు బాబా రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌ను నెలకొల్పారు. మొదట్లో తనకంటూ నిర్దేశించుకున్న పరిధిలోనే కదలాడిన పతంజలి.. తర్వాతర్వాత తమ ఉత్పత్తులను విస్తరించుకుంటూ పోయింది. ఆయుర్వేద మందులు, ఆహారోత్పత్తులు, శీతల పానియాలు, చర్మ సౌందర్య ఉత్పత్తులు ఇలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయిన పతంజలి.. ఇటీవల రెడిమేడ్ దుస్తుల అమ్మకాల్లోకీ ప్రవేశించింది. హరిద్వార్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పతంజలి.. కొత్తగా దేశవ్యాప్తంగా ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
5.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉన్న పతంజలి.. దాన్ని 9.3 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్ తదితర ప్రాంతాల్లో నూతన ప్లాంట్లను ఏర్పాటు చేసిన పతంజలి.. దేశంలోని మరిన్ని ప్రాంతాలతోపాటు పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా కొత్త యూనిట్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నేపాల్‌లో పతంజలికి ఉత్పాదక కేంద్రాలుండగా, నేపాల్ గ్రాముద్యోగ్ ట్రేడ్‌మార్క్ కింద ఇవి నడుస్తున్నాయి. నేపాల్‌లోని హిమాలయా పర్వతాల నుంచి ఎంతో విశిష్టత కలిగిన మొక్కలు, ఆయుర్వేద మూలికలను భారత్‌లోకి తీసుకొస్తోంది.
ఇక ఎఫ్‌ఎమ్‌సిజి (్ఫస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) సంస్థల్లో భారత్‌లోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటు కలిగిన సంస్థగా పతంజలి ఉన్నట్లు సిఎల్‌ఎస్‌ఎ, హెచ్‌ఎస్‌బిసిలు చెబుతున్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరంలో 163 కోట్ల రూపాయలుగా ఉన్న పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ ఆదాయం.. ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇంకా చెపాల్పంటే రెట్టింపవుతోంది. గడచిన ఏడేళ్లలో సంస్థ ఆదాయం ఏకంగా 10 వేల కోట్ల రూపాయలకుపైగా పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు పతంజలి దూకుడు ఎలా? ఉందన్నది. కేవలం నాలుగేళ్లలోనే 852 కోట్ల రూపాయల నుంచి 10,561 కోట్ల రూపాయలకు పతంజలి ఆదాయం చేరుకుంది. 2015-16లో 5,000 కోట్ల రూపాయలుగా ఉన్న పతంజలి ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 10,561 కోట్ల రూపాయలను తాకింది. ఒక్క ఏడాదిలోనే 5,561 కోట్ల రూపాయల ఆదాయం పెరగడం గమనార్హం. భారత్‌తోపాటు దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్నాయి.
సొంతంగా రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసుకుంటున్న పతంజలి.. ఫ్యూచర్ గ్రూప్, పిట్టీ గ్రూప్ వంటి సూపర్ మార్కెటీర్లతోనూ చేతులు కలుపుతోంది. బిగ్‌బజార్‌తోపాటు మోడ్రన్ ట్రేడ్ స్టోర్లు, రిలయన్స్ రిటైల్, హైపర్ సిటీ, స్టార్ బజార్‌లలో పతంజలి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇక 2016 మే నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 4,700 రిటైల్ ఔట్‌లెట్లను కలిగి ఉన్న పతంజలి.. ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ తమ ఉత్పత్తులను అమ్ముతోంది. వివిధ ఈ-కామర్స్ సంస్థలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. చివరకు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లోనూ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. తద్వారా ప్రత్యర్థి సంస్థలకు గట్టి సవాల్‌నే విసురుతోంది. కాగా, ఆయుర్వేద ఔషధాలతోపాటు వెన్న, నెయ్యి తదితర పాల ఉత్పత్తులు, తేనె మొదలగు ప్రకృతి పానియాలు, పప్పు్ధన్యాలు, తృణధాన్యాలు, గోధుమపిండి, నూడుల్స్, బిస్కట్లు, పండ్ల రసాలు, వంటనూనెలు, టూత్ పేస్ట్, పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్‌లు ఇలా చెప్పుకుంటూపోతే అవిఇవి అని లేకుండా దాదాపు అన్ని రకాల కన్స్యూమర్ గూడ్స్‌ను పతంజలి మార్కెట్‌లో అమ్మేస్తోంది. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికే 2 లక్షల ఉద్యోగులను కలిగి ఉన్న పతంజలి సంస్థ.. వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మరెందరికో ఉపాధి అవకాశాలనూ అందిస్తోంది. సిఎన్‌ఎన్-న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పతంజలి ఉత్పత్తుల ద్వారా వచ్చిన లాభం చారిటీలకే వెళ్తోందని రామ్‌దేవ్ బాబా తెలిపారు. ఇలా సమాజానికి తన వంతు సాయం చేస్తున్న పతంజలి గ్రూప్.. మొత్తానికి దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి కంపెనీల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.