విశాఖపట్నం

మానవతావాద కవిత్వం ‘నేను అస్తమించను’ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్య అభ్యుదయ వాద కవుల

శ్రేణిలో, ఒక కవిగా గుర్తింపు తెచ్చుకున్న

ఇంద్రపాల శ్రీనివాస్ చేయి తిరిగిన కవి. ఇది

వరకే అయిదు కవితా సంపుటాలను (మాజీ

మానవుడు, తాజా అన్యాయం, కన్నీటి

వాచకం, చెరసాలలో చిరునవ్వు, మహా

శ్మశానం) అందించి తెలుగు పాఠకులను

రంజింపజేశారు. ఇప్పుడు నేను అస్తమించను

వీరి ఆరవ కవితా సంపుటిగా అరవై కవితల

సమాహారంగా వెలుగులోకి వచ్చి తెలుగు

పాఠకులను అలరిస్తోంది.
ఇందులో చైతన్యభరిత, ఆశావాద,

మానవతాయుక్త కవిత్వం పెల్లుబికింది. వీరి

కవిత్వంలో అవినీతి ఖండన, సామాజిక

దృక్పథం, స్వేచ్ఛావాదం, నిరాడంబరత,

నిర్మొహమాటం, నిక్కచ్చితనం (నిబద్ధత)

వంటివి కొన్ని కాగా అసంతృప్తి, నిరసన,

దుర్మార్గాన్ని ఎండగట్టడం, ప్రపంచీకరణలో

ఎదురీత, చెడుకి తిరస్కారం, మంచికి

స్వాగతం, మన సంస్కృతి ఘనతని

ప్రశంసించడం, పాశ్చాత్య ధోరణలు

వెర్రితలలను తిరస్కరించడం, శ్రమైక జీవన

సౌందర్య, అక్షరప్రీతి వంటివి మరికొన్ని

కవితల్లో దర్శనమిస్తాయి. కవ్వింపు,

పలకరింపు, పులకరింత, తన్మయత,

ఆలోచనాలోచనాలు మరి కొన్నింటిలో

రూపుదిద్దుకుని వైవిధ్యభరితంగా

వెలుగులిస్తాయి. అన్ని స్థాయిల పాఠకులను

అలరిస్తాయి. సహజంగా కవిత్వం వీరికి

అబ్బినట్లు పాఠకుడు గ్రహిస్తాడు.
ఈ కవితా సంపుటికి ముందు మాటను

ప్రముఖ రచయిత జయధీర్ తిరుమలరావు

రాశారు. ఏడు గుర్రాల మీద రాలేను కానీ/

ఆరుకాక ముందే కన్ను తెరచిన కవితను

నేను/అక్షరం నన్ను ప్రేమించనంత

కాలం/నేను అస్తమించను అంటున్న

పంక్తుల్లో కవి దృఢ సంకల్పం,

ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం, అక్షరంపై

ఆత్మీయత అన్నీ ఏకమై కవిని ఆవహించే

స్థితి గోచరిస్తుంది.
పుడమి అంతా పుండ్ల వాసన/నేల నెల

తప్పి/కన్నది కరువు పిశాచిని/కళ్లలో

కన్నీళ్ల జాతర/ ఇంట్లో ప్రతిమూల రోగాల

చిరునామా అంటున్న పదాల్లో

పెరుగుతున్న జనాభా, కమ్ముతున్న

కరవును కళ్ల ముందుంచిన తీరులో కవి

చెప్పదలచింది చమత్కారంగా చెక్కబడిన

సూచనప్రాయ హెచ్చరికలో హితవు ఉంది.

మితముంది.
ఇది కలియుగం కాదు/కన్నీళ్ల

యుగం/మనిషిప్పుడు బొడ్డు తాడుతో

కాదు/్ఫల్‌బాటిల్‌తో పుడతాడు అని నేటి

మత్తు మందు విస్తరణతో విస్తుబోయిన

జనాల గోడుని తన కవిత్వ అద్దంలో

చూపారు. దీనికింక స్వస్తి పలకాలన్న

అంతరార్ధంలో అక్షర తూటాలను పేల్చారు.
సూర్యుడు చీకటిని

పంచిపెడుతున్నప్పుడు/దేశదేశాల

కాలమానం/కాలు జారిన కనె్నపిల్లలా

భయంతో వణికి చస్తూ ఉంటే/నేను ప్రకృతి

పైట చాటున/మార్మాంగాలను దాచుకున్న

మట్టి కణాన్ని అంటూ సాగిన కవిత్వం కదం

తొక్కింది. లోకం పోకడల్ని, యువత

పోతున్న వెర్రితలల్ని అద్దం పట్టి

చూపిస్తాయి.
ప్రమాదాలు లేని/ప్రశ్నలు లేని/ప్రపంచం

కొరకు/చట్టంతో కలసి/గ్రంథాలయాలు/

ఆసుపత్రులు/శ్మశానాలతో

సంప్రదింపులు/జరుపుతున్నాయంటూ

ప్రపంచంలో దేశ కాల పరిస్థితులను

తూర్పారాబడుతూ అక్షర గవాక్షాల్లోంచి

దర్శనం గావించారు.
కార్మికుల సమ్మె/ ఓ కాకికి/ నాలుగు

మెతుకులు కరవును/ప్రసాదించింది అంటూ

వాస్తవికతను దృశ్యమానంగా వేలాడదీశారు.

కవితాక్షరాల చిత్రపటాన్ని మరో కవితలో

నిద్రొస్తే అసెంబ్లీకెళ్లు/పొద్దు

పోకపోతే/పార్లమెంటులో పాదం మోపు అన్న

పంక్తులు నేటి నేతల నేతి బీరకాయ

రూపానికి ఆనవాళ్లుగా నిలబెడతాయి.
చాలా కవితల్లో మానవత్వాన్ని మంటగలిపే

మానవ మృగాలిని, హింసావాదాన్ని రగిల్చే

రాబందుల్ని, స్ర్తి స్వేచ్ఛను కాలరాసే

కామాంధుల్ని ఎదిరిస్తూ, ఖండిస్తు,

నిరసిస్తూ, ఆక్రోసిస్తూ, అత్యాధునికతను,

అన్యాయాల్ని, అణగదొక్కేందుకు

సూచనలను, హెచ్చరికలను వినిపిస్తూ,

అంత వరకు నేను అస్తమించనని

అభయమిచ్చ కవికి అభినందనలనందిస్తూ

స్వాగతిద్దాం. ప్రతులకు 90522 41005లో

సంప్రదించగలరు.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 7032606821.