బిజినెస్

ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 1.90 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్-జూలై వ్యవధిలో గతంతో పోల్చితే 19.1 శాతం పెరిగి 1.90 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.80 లక్షల కోట్ల రూపాయల వసూళ్లను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తొలి నాలుగు నెలల్లో 19.5 శాతం లక్ష్యం నెరవేరింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూలైలో 1.59 లక్షల కోట్ల రూపాయల వసూళ్లు జరగగా, నాడు వృద్ధిరేటు మాత్రం 24.01 శాతంగా నమోదవడం విశేషం.