బిజినెస్

స్వల్పంగా పెరిగిన ఎన్‌హెచ్‌పిసి నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న హోదా కలిగిన ఎన్‌హెచ్‌పిసి స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో స్వల్పంగా పెరిగి 862.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 857.82 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. ఆదాయం ఈసారి 2,432.77 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,360.06 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, సంస్థాగత వ్యయం గతంతో పోల్చితే ఈసారి 1,453.74 కోట్ల రూపాయల నుంచి 1,535.72 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం 4,290 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఐదు ప్రాజెక్టులను ఎన్‌హెచ్‌పిసి నిర్మిస్తోంది. 7,151 మెగావాట్ల సామర్థ్యమున్న మరో 10 ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు రావాల్సి ఉంది.