బిజినెస్

భారీగా పెరిగిన టాటా మోటార్స్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 41.54 శాతం ఎగిసింది. ఈసారి 3,199.93 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 2,260.4 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టాటా మోటార్స్ తెలియజేసింది. అయితే ఆదాయం ఈసారి 59,818.22 కోట్ల రూపాయలుగా, పోయినసారి 66,165.89 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడుతో చూస్తే 9.59 శాతం ఆదాయం పడిపోయింది. అయినప్పటికీ టాటా మోటార్స్ లగ్జరీ వాహన బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) పెన్షన్ ప్లాన్ ప్రయోజనంతో సంస్థ లాభాలు పెరిగాయి. జెఎల్‌ఆర్ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఇటీవలికాలంలో భారీగా పెరిగిపోతున్నది తెలిసిందే.