బిజినెస్

మార్కెట్లను కుదిపేస్తున్న సెబీ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 9: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 216.35 పాయింట్లు పతనమై 31,797.84 వద్ద ముగియగా, ఇది మూడు వారాల కనిష్ట స్థాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 70.50 పాయింట్లు పడిపోయి 9,908.05 వద్ద నిలిచింది. అనుమానిత షెల్ కంపెనీలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నది తెలిసిందే. మంగళవారం కూడా ఇదే కారణంతో సూచీలు నష్టపోగా, సెనె్సక్స్ 259 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయాయి. ఇక గడచిన మూడు రోజుల్లో సెనె్సక్స్ 528 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 158 పాయింట్లు దిగజారింది. స్టాక్ మార్కెట్లలో చేరిన 331 అనుమానిత డొల్ల కంపెనీలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించడంతో మదుపరుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగిపోయాయి. ఈ సంస్థల షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేసింది సెబీ. వీటిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంస్థలే ఎక్కువగా ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీకి చెందిన సంస్థలూ అధికంగానే ఉన్నాయి. ఒడిషా, అస్సాం, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థలూ ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ, ఎస్‌ఎఫ్‌ఐఒ దర్యాప్తుల్లో తేలిన నిజాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. సెబీకి తెలియజేసింది. దీంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 127 సంస్థలు, మహారాష్టక్రు చెందిన 50 సంస్థలు, గుజరాత్, ఢిల్లీకి చెందిన 30కిపైగా సంస్థలతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మొత్తం 331 సంస్థల షేర్ లావాదేవీలపై సెబీ వేటు వేసింది. దీనిపై పలు సంస్థలు అభ్యంతరం తెలపగా, న్యాయపోరాటానికీ సిద్ధమ య్యాయ. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలోనూ జపాన్, హాంకాంగ్, సింగపూర్, చైనా, తైవాన్ సూచీలు 1.29 శాతం మేర నష్టపోయాయి.