బిజినెస్

మళ్లీ లాభాల్లోకి బ్యాంక్ ఆఫ్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం 87.71 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఏకంగా 741.36 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఈ ఒక్క త్రైమాసికంలోనేకాదు.. మొత్తం గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ 1,558.34 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకుంది. మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) భారీగా పెరిగిపోవడమే దీనికి కారణం. ఇదిలావుంటే ఆదాయం ఈసారి ఏప్రిల్-జూన్‌లో 11,106.61 కోట్ల రూపాయలుగా, పోయినసారి ఏప్రిల్-జూన్‌లో 10,664.36 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది.