మంచి మాట

విజయసోపానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో అనేక సందర్భాలు అనుకున్నవి, అనుకోనివి జరుగుతుంటాయ. జీవితంలో ఎత్తుపల్లాలు అనేకం చూస్తుంటాం. జీవితంలో అనేకమంది తారసపడుతుంటారు. కొంతమంది జీవితంపై చాలా ప్రభావం చూపుతారు. మరికొంతమంది అతి కొద్దిసేపు కనబడి కూడా ఎక్కువ ప్రభావితం చేస్తుంటారు. ఆ ప్రభావం అనేది కేవలం మంచిది అయతే అంతగా చెప్పుకోనక్కర్లేదు. కాని అదే చెడుది నలుగురి మంచిని కలుగచేయనిది అయతే దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు డ్రగ్స్‌కు అలవాటు పడడం, దుర్మార్గాలు చేయడం, అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎవరో చేశారని మనమూ చేయడం అవివేకం అనవచ్చు. పైగా చేసినవారు ఎందుకు ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో కూడా తెలుసుకోకుండా మనం దాన్ని వారు చేసారని మనం చేస్తే దాని వల్ల చె డు ఏదైనా జరిగితే అది మన వరకు సంబంధించినదే అయతే మనమే దుఃఖపడుతాం. ఎందుకిలా చేశామని తలపోస్తాం. ఇంకా ఆలోచించి ఇంకెప్పుడూ ఇలాంటివి జరగకుండా చూడాలని అనుకొని వదిలేస్తాం. ఇది కేవలం మనవరకు అందులో ఎక్కువ నష్టం జరగకుండా ఉంటేనే.
అదే నలుగురితో కూడుకున్నది అయతే, ఆ జరిగిన చెడు నలుగురిపై పడితే నాలుగు మాటలు పడవలసి ఉంటుంది. పైగా దానివల్ల ఎక్కువ నష్టం వాటిల్లితే ధానికి బాధ్యత ఎవరు వహిస్తారు. అందుకే ఎంతమంది పెద్దలు ఆచరించిన పనినైనా సరే ఒక్కసారి కూలంకషంగా తెలుసుకోవాలి. ఇపుడున్న పరిస్థితుల్లో ఆ పనిని చేపట్టితే అది జరిపితే దానిఫలితం ఎట్లా ఉంటుందనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఆ పనిని నిర్వహిస్తామని ముందుకు వచ్చిన వారిపైన అధికంగా ఉంటుంది.
జయాపజయాలు భగవంతుని నిర్ణయాలు. ఒకవేళ మంచి పని చేసినా ఫలితం అనుకూలంగా ఉండకపోవచ్చు. నేను మంచి చేసినా అది మంచి ఫలితం ఇవ్వలేదని వాపోనక్కర్లేదు. చేయాల్సింది చేసాము. ఫలితం భగవంతునిది అని అనుకొనే మనస్త్తత్వం వృద్ధి చేసుకోవాలి. జయం కలిగినా అపజయం కలిగినా ఒకే విధంగా ఉంటే నలుగురి మెప్పు నే కాదు తర్వాతి పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. జయమో అపజయమో వీటిలో ఏఒక్కదాని వల్ల కలిగిన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ ఇతరాలను పట్టించుకోకపోతే అక్కడే ప్రగతి ఆగిపోతుంది. కనుక ఇట్లాంటివన్నీ ఆలోచించడానికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు.
ఉదాహరణకి ఒక కార్యం చేయాలన్న సంకల్పాన్ని ఆచరణ రూపంలో కి తెచ్చేసరికి అన్ని చోట్ల అది విజయంఅందించకపోవచ్చు. అంతేకాక పలు ఆటంకాలూ ఎదురవ్వొచ్చు. అయనప్పటికీ లక్ష్యసాధన మాత్రం ఆగిపోకూడదు.దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. సంకల్పాన్ని గుర్తుచేసుకొంటూ ముందుకు సాగితే సంకల్పబలం గట్టిగా ఏర్పడుతుంది. ఈ బలం వల్ల కొండలను కూడా పిండి చెయ్యొచ్చు. ఈ విషయం మాత్రం అన్ని చోట్ల నిరూపితం అవుతుంది.
అందుకే శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాంటి వాళ్లు మొదలెట్టిన పని కూడా అతి ప్రయాసతో విడవకుండా చివరివరకు సాగించడానికి ప్రయత్నించేవారు. అది సఫలం కావడానికి ఎన్నో తంటాలు పడ్డారు. దానికోసం వారు భగవంతుడిని ప్రార్థించారు. పెద్దల సలహాను తీసుకొన్నారు. రావణుని నిర్జించేటపుడైనా, కంసుని నిర్జించేటపుడైనా సరే ఈ విధంగానే వారిద్దరూ ఆచరించారు. శ్రేష్ఠులు చేసిన దానిని సామాన్యులు కూడా ఆ పథంలోనే నడుస్తారు కనుక నేడు కూడా వారి మార్గాన్ని మార్గదర్శిగా పెట్టుకుని జయాపజయాలకు కుంగిపోకుండా సంకల్పబలంతోటి పనులను చేయడం ఆరంభించాలి. ఇటువంటి అనుభవాలు ఉత్తరోత్తరా పలువురికి మార్గదర్శకాలు అవుతాయ.
కాలం అతి వేగవంతమైనది. గడిచినకాలాన్ని వెనక్కు తీసుకొని రాలేము. అందుకనే ఆచి తూచి బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. అపుడు జీవన ప్రవాహంలో వేసిన ప్రతి అడుగు ఒక విజయ రహస్యానికి సంకేతంగా నిలుస్తుంది.ఇంతేకాదు మనం చేసే ప్రతి పని వెనుక భగవంతుడు అంతర్లీనంగా ఉన్నాడని ఆయనే సర్వానికి కారణమనుకొంటే కూడా చేసే పని పట్ల నిబద్ధత, నియమపాలన పాటించడం సులువు అవుతుంది. ఇందులో కర్త, కర్మ, క్రియ సర్వమూ భగవంతుని ప్రసాదితమే అని గట్టిగా నమ్మాలి.
ఓర్పు, సహనం, వివేకం లాంటి లక్షణాలు పుట్టుకతో వస్తే లేకుంటే చూసి అయనా నేర్చుకుంటే మనిషిలోని గొప్పతనం వ్యక్తీకరించబడుతుంది. ఈ లక్షణాలను సంకల్పంగా భావించి కృతనిశ్చయంతో ఆచరణలో చూపేవారికి తప్పక ఆ భగవంతుని కృపతో పాటు అన్నింటా ఘనవిజయం వస్తుందనే భావించవచ్చు. ఇలాంటి దృక్పథాలు నవ సమాజ ఆవిష్కరణకు చైతన్య జ్యోతులుగా నిలుస్తాయ. ఏ పనినైనా తార్కిక దృష్టితో దర్శించి తర్కించి చూస్తే మానవ మేధస్సు ప్రకాశవంతం అవుతుంది. దానివలన లోకకల్యాణాలు జరుగుతాయ. ‘గీత’లో కృష్ణ్భగవానుడు - ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే ఎవరికివ్వవలసిన ఫలితాలను వారికిస్తాను అనే ఉపదేశానే్న ఇచ్చిఉన్నాడు.

- హనుమాయమ్మ