ఆటాపోటీ

అమర్‌నాథ్ ఆగ్రహం.. (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సెలక్టర్లను ‘జోకర్ల గుంపు’ అని విమర్శించి మహీందర్ అమర్‌నాథ్ బిసిసిఐ అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఒక సిరీస్‌లో ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ, ఆ తర్వాతి సిరీస్‌లోనే ఉద్వాసనకు గురికావడం అతనిని ఆగ్రహానికి గురి చేసింది. ఒకసారికాదు.. రెండుసార్లు కాదు.. ప్రతిసారీ జట్టులోకి తీసుకోవడం, కారణం లేకుండానే తొలగించడం అతని సహనానికి పరీక్ష పెట్టింది. 1983లో భారత జట్టు ప్రపంచ కప్‌ను సాధించడంలో కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆ వెంటనే అతనికి సెలక్టర్లు మొండిచేయి చూపారు. పోస్టింగ్.. ఆ వెంటనే ఊస్టింగ్ కొనసాగడంతో విసిగిపోయిన మహీందర్ అమర్‌నాథ్ సెలక్టర్లను జోకర్లు అంటూ సంబోధించాడు. కడుపు మండితే ఎవరైనా అదే తరహాలో స్పందిస్తారేమో!

ముక్కోపి భజ్జీ!
* హర్భజన్ సింగ్ ముక్కోపి. ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా స్పందిస్తాడు. 2008 ఐపిఎల్‌లో శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన సంఘటనే అందుకు నిదర్శనం. అదే ఏడాది ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు ఆండ్రూ సైమాండ్స్‌ను ‘మాకీ’ అని తిట్టడం, దానిని అతను ‘మంకీ’ అని అర్థం చేసుకోవడం పెద్ద దుమారానే్న రేపాయి. భజ్జీ తనపై జాతి వివక్షతో కూడిన కామెంట్లు చేశాడని సైమాండ్స్ చేసిన ఆరోపణలపై ఐసిసి తీవ్రంగా స్పందించింది. అతనిని మూడు టెస్టుల నుంచి సస్పెండ్ చేసింది. అయితే, సచిన్ తెండూల్కర్ జోక్యం చేసుకొని, భజ్జీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పడంతో సస్పెన్షన్ నిర్ణయాన్ని ఐసిసి వెనక్కు తీసుకుంది.

బ్యాడ్‌బాయ్ కాంబ్లీ
* సచిన్ తెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, అతనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగులేసిన వినోద్ కాంబ్లి క్రమశిక్షణా రాహిత్యానికి మారుపేరు. భారత జట్టులో బ్యాడ్‌బాయ్‌గానే అతను సుపరచితుడు. సామర్థ్యం ఉన్నప్పటికీ, క్రమశిక్షణ లేకపోతే జీవితం చుక్కానిలేని నావలా ఒడిదుడుల మధ్య సాగుతుందన్న పాఠం కాంబ్లీ కెరీర్‌ను చూసి నేర్చుకోవాలి. ఒక టీవీ షోలో పాల్గొని, సచిన్ తెండూల్కర్‌పైనే విమర్శలు చేసి పరువు పోగొట్టుకున్నాడు. సాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ సచిన్ తనకు ఎలాంటి సహకారాన్ని అందించలేదని ఆరోపించాడు. సచిన్ రిటైర్మెంట్ సమయంలో ఒక్కొక్కరినీ పేరుపేరున గుర్తు చేసుకుంటూ, అందరికీ కృతజ్ఞతలు తెలిపినప్పటికీ, చిన్ననాటి స్నేహితుడు కాంబ్లి పేరును ప్రస్తావించ లేదంటే, వారిద్దరి మధ్య మనస్ఫర్థలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. ఈ వివాదాన్ని అందరూ మరచిపోక ముందే, 1996లో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్ ఫిక్సింగ్‌కు గురైందంటూ మరో బాంబు పేల్చాడు. అతని ఆరోపణలను చాలా మంది క్రికెటర్లు ఖండించారు. ఐసిసి ఈ ఆరోపణలను పట్టించుకోలేదు. కాంబ్లీ మాత్రం వివాదాస్పదుడిగా మిగిలిపోయాడు.

- సత్య