విజయవాడ

10వ జాతీయ స్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో గత తొమ్మిదేళ్లుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహితీ రంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతిని చాటుకుంటున్నాయ ‘సోమేపల్లి సాహితీ పురస్కారాలు’. కథా రచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలానే విజయవంతం చేయాలని అవార్డుల కమిటీ చైర్మన్ సోమేపల్లి వెంకటసుబ్బయ్య, రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక సంపాదకులు చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో కోరారు. అత్యుత్తమ కథకు రూ. 2500, ఉత్తమ కథకు రూ. 1500, మంచి కథకు రూ. 1000, ప్రత్యేక బహుమతిగా ఇద్దరికి రూ. 500 చొప్పున అందజేసి సత్కరిస్తారు. పోటీలకు పంపే కథ నిడివి రాతప్రతిలో 2 నుంచి 5 పేజీల్లోపు ఉండాలి. ఒకరు ఎన్ని కథలైనా పంపవచ్చు. కథ పుటలపై రచయిత పేరు, వివరాలు రాయకూడదు. హామీ పత్రంపై మాత్రమే రచయిత వివరాలు ఇవ్వాలి. కథలను సెప్టెంబర్ 30లోపు ‘రమ్యభారతి, పి.బి నెం. 5, 11-57/ 1-32, జెఆర్ కాంప్లెక్స్, రెండో అంతస్తు, రజక వీధి, విజయవాడ- 520001’ చిరునామాకు పంపాలని ప్రకటనలో వారు సూచించారు.
కలిమిశ్రీకి శ్రీకృష్ణదేవరాయలు
జాతీయ పురస్కారం
మల్లెతీగ సాహిత్య వేదిక అధ్యక్షుడు, నవ మల్లెతీగ సంపాదకుడు, రేపటికోసం మాసపత్రిక అసోసియేట్ ఎడిటర్ కలిమిశ్రీకి చిత్తూరుకు చెందిన లలిత కళాసాగర్ సంస్థ ‘శ్రీకృష్ణదేవరాయలు జాతీయ పురస్కారం- 2016’ను ప్రకటించింది. సాహిత్య రంగం, పత్రికా రంగంలో రెండు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సాహితీ కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కోశాధికారిగా కలిమిశ్రీ ఇటీవల బాధ్యతలు చేపట్టి అనేక సాహితీ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటున్నారు. చిత్తూరులోని రేణుక కల్యాణ మండపంలో ఈ నెల 29న ‘శ్రీకృష్ణదేవరాయల వారి సువర్ణపాలన- వైభవం’పై జరిగే జాతీయ సదస్సులో కలిమిశ్రీకి ఈ పురస్కారం అందజేయనున్నట్లు దేవేంద్రరావు వివరించారు.