మెయిన్ ఫీచర్

పనె్నండేళ్ల నరకం.. పడిలేచిన కెరటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొనే్నళ్ల క్రితం ఆమె ఓ సాధారణ దళిత గృహిణి. జీవనయానంలో మొక్కవోని ధైర్యంతో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించారు. ఇప్పుడు మహిళలకు ఆమె ఆదర్శమూర్తిగా నిలిచారు. ఎంతోమందికి ఆమె ఉపాధి కల్పించగలిగింది. చదువులేకపోయినా నేడు ఆ గ్రామంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కోటశిర్లాం గ్రామానికి చెందిన 65 ఏళ్ల దళిత మహిళ పట్నాన లక్ష్మమ్మ (పైడమ్మ). తన మేనమామ గురువులతో 1956లో వివాహం చేసుకున్న తరువాత అత్త, మామలతో కలసి ఉండేవారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త గురువులు మరణించడంతో ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకొని మానసికంగా కుంగిపోయి చివరకు ఆత్మహత్యాయత్నం చేసుకొంది. అలా 12 ఏళ్లు నరకం అనుభవించిన తరువాత 1988 నుంచి చిన్న చిన్న వ్యాపారాలను చేయడం మొదలుపెట్టింది. తనకు చదువులేకపోయినా పిల్లలకు అలాంటి దుర్భర స్థితి రాకూడదని భావించి పిల్లలను కష్టపడి చదివించింది. తన ఇద్దరు పిల్లలు రమేష్, అప్పలకొండను పోస్టు గ్రాడ్యుయేషన్ చదివించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దింది.
అనుమానాలతో గ్రామ బహిష్కరణ
మంత్రగత్తె అన్న అనుమానంతో ఆమెను బంధువులు పట్టించుకోలేదు. గ్రామస్తులు వారికి తోడయ్యారు. నానా ఇబ్బందులు పెట్టారు. ఆ ఊరు నుంచి బయటకు వెళ్లగొట్టాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భయపడకుండా వారిపై పోలీసు కేసులు పెట్టి ఎదిరించి అదే గ్రామంలో జీవనం సాగించింది.
వ్యాపారవేత్తగా మారి...
కుటుంబ పోషణ కోసం గ్రామంలో పందుల పెంపకం నుంచి అనేక రకాల వ్యాపారాలు చేపట్టి వ్యాపార వేత్తగా ఎదిగింది. పందుల పెంపకం, కూరగాయల వ్యాపారం, జనపనార, సీతాఫలం, చింతపండు, మామిడిపళ్లు ఇలా అనేక రకాల సీజనల్ వ్యాపారాలను చేస్తూ తన గ్రామంలో మిగిలిన వారికి ఉపాధి చూపింది. ఆమె జనపనార వ్యాపారం చేసేటపుడు గ్రామంలో దళిత మహిళ వ్యాపారం చేయడమేమిటని ఆ ఊరిలో అగ్ర కులస్తులు ఒక్కటిగా మారి చెరువులో నీటిని ఖాళీ చేసేవారు. ఆ విధంగా చెరువులో రాత్రులు నీటిని తీసేయడం వల్ల గోగు ఎండిపోయేది. అయినప్పటికీ ఆమె పోలీసు కేసులు పెట్టి గ్రామస్థులతో పోరాడి నిలిచారు. గిరిజన ప్రాంతాల్లో పండే పంటలను కొనుగోలు చేసి వాటిని రామభద్రాపురంలో అమ్మకం సాగిస్తూ జీవనం సాగిస్తోంది. ఇదిలా ఉండగా వేరుశనగ పంటలను గుత్తకు తీసుకొని కూలీలతో వాటిని తీయించి హోల్‌సేల్ వ్యాపారులకు అమ్మకాలు సాగిస్తుంటూంది. అదేవిధంగా చింతపండు కొనుగోలు చేసి పిక్కలు తీయించి వాటిని తిరిగి బజారులో అమ్మకం చేయడం ఇలా అన్ని రకాల సీజనల్ వ్యాపారం చేస్తూ తన గ్రామంలో మరో 40 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆ విధంగా ఆమె వ్యాపారవేత్తగా ఎదగడమేగాకుండా గ్రామంలో మిగిలిన వారికి కూడా ఆదర్శంగా నిలిచింది.
అవినీతి గుట్టు రట్టు
గ్రామంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరైతే వాటిని అక్కడ సర్పంచ్ బినామీ రోడ్డు వేయకుండానే నిధులు మింగేశారు. చంద్రన్నబాట కింద ఎస్సీ కాలనీకి సిసి రోడ్డుకు రూ.48 లక్షలు మంజూరు కాగా ఆ నిధులతో గ్రామస్థులు బిసి కాలనీకి రోడ్డు వేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీకి రోడ్డు వేయాలని పట్టుబట్టింది. తమకు జరిగిన అన్యాయాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ దృష్టికి తీసుకెళ్లి తిరిగి తన గ్రామానికి ఆ నిధులతో రోడ్డు వేయించగలిగింది. అలాగే గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఉన్నతి పథకం కింద రూ.3.89 లక్షలు మంజూరుకాగా, ఆ డబ్బులు రాబట్టుకోడానికి పోరాటం చేసి ఎలాగైతేనేమి ఆ నిధులను రాబట్టగలిగింది. ఈ విధంగా చదువు లేకపోయిన, అన్యాయాన్ని ఎదిరిస్తూ ధైర్యంతో ముందుకు సాగుతోంది.

- బొండా రామకృష్ణ