ఉత్తర తెలంగాణ

ఏదీ నిషిద్ధం కాదు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం వాడకంలో ఉన్న వస్తువులపట్ల
నలుగురికి ఉపయోగపడే మనుషులపట్ల
అసభ్రంశం లేని సాహిత్యం పట్ల
సాన్నిహిత్యం నా సొంతం..
సమాజంలో మనసుల్లో
కొరవడిన సంస్కారం నింపి
పేరుకుపోయిన చిలుంని శుభ్రం చేసే
భావాలు అనుభవాల పట్ల
నాకు నిషిద్ధం లేదు
పైగా అనురక్తి మెండు..
కాస్మిక్‌లో కాల నుంచి దూసుకొచ్చి
అలుముకున్న చిమ్మ చీకట్లనిదునుమాడి
ప్రకాశం నింపే కిరణద్యుయల పట్ల
నాకు సదవగాహన ఉంది
మీదు మిక్కిలి ప్రశంస ఉంది
ఎన్నో యోజనాల నుంచి
పిడికెడు దాణా కోసం
అందమైన సరసజీలాల
ఆహ్లాదాల అణువు కోసం
రేయనక పగలనక
దీర్ఘ తెరువులు సాగిపోయే
పక్షిలోకం పట్ల నాకు
పట్టరాని అభిమానం ఉంది
తరగని అభినివేశం ఉంది..
శుష్క ఛాందస చింతనల
బ్రహ్మ జెముళ్లనీ చెదలునీ
తుదకంటూ ధ్వంసం చేసే
నయా ప్రజాళికల్తో పనుల్తో
భావితరాల్ని తీర్చిదిద్దే
తాత్విక దర్శనాల పట్ల నాకు
నిరంతరం ఆసక్తి ఉంది
ఎనలేని ఆదరణ ఉంది..
తెరపిలేని ఆచరణ ఉంది..!
- డా. దామెర రాములు, నిర్మల్,

సెల్.నం.9866422494

నిజం!
కారు చీకట్లు కమ్మినప్పుడు
కాని వారవుతారు అందరు!
కాటికి పోయేటప్పుడు
ఆప్తులై వస్తారందరు
కాటిదాక సాగనంపి
కన్నీరు కార్చి పోతారు!
కటిక దారిద్య్రంలో ఉన్ననాడు
కనికరించని వారు
కాటిదాక ఎందుకస్తారోమరి?
కన్నీరు కారుస్తారెందుకోమరి?
వింతమాలోకంలో
పొంతన లేని బంధాలు
పెంచుకుంటే ఫలమే ముందనకు
కాటి దాక సాగనంపె ఫలముందని

మరువకు
మోసేవారు నలుగురైనా
సాగనంపే వారు పదిమందుండాలి
ఎంత మంది ఎక్కువ సాగనంపుతే
అంత గొప్పవాడివి నీవంట!
లేకుంటే నీ బ్రతుకు వ్యర్థమంట!
స్వార్థం పెరిగిన లోకంలో
అంతా వ్యర్థమంట!
మంటల్లో కాలి బూడిదైన నాడు
పాప పుణ్యములే మిగులుట నిజమన్నా!
- జాధవ్ పుండలిక్ రావు పాటిల్
భైంసా, నిర్మల్ జిల్లా, సెల్.నం.9441333315

చలీ! ఓ నా చెలీ!
వేడిమి - అనే లేడి పిల్లని
‘చలి’ అనే పులిపిల్ల
మీదపడి కొరుకుతు, కొరుకుతు
చివరకు చిద్విలాసంగ మింగివేసింది
ఇక ఇపుడంతా!
పల్లెల సీమలో కొలువయినది
తెల్లని మంచు ముత్యాలు
చెట్లమీది ఆకులపై
ఆరబోసినట్లుగా వున్నాయి
తెల్లవారిందని బయటకెళితే
చల్లగా తడిసిపోయినట్లవుతుంది
వొంటికి తొడిగిన గుడ్డలు
అతుక్కుపోతు
ఎముకలు కొరికే
చలి చెలి దయతో
పెదవుల కొనలు
చీలి మండుతున్నాయి
ముక్కు చీదడం, తెమడరావడం
అనివార్యమయింది
ఎంత సరసం.. ఎంత సరసం
చలికి నా చెలికి
- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్, సెల్.నం.7702261037

మనసు ముసుగు

మనసు ఒక కనిపించని అగాధం..
తడి ఆరని గాయాలెన్నో
మది దాటని భావాలెన్నో
భయపెట్టే నీడలెన్నో
చేసిన బాసలెన్నో
ఆడిన అబద్దాలెన్నో..
మనసు ఎగిసిపడే
అలల కలవరం..
కన్న కలలెన్నో
నెరవేరని ఆశలెన్నో
మధుర క్షణాలెన్నో
తుంటరి తలపులెన్నో
విడిపోని బంధాలెన్నో
దరి చేరని దారులెన్నో..
మనసు ఓ కానరాని పాతాళం..
కోరుకున్న చెలిమి లెన్నో
నొప్పించిన మాటలెన్నో
నమ్మించిన నాటకాలెన్నో
గుచ్చుకున్న శూలాలెన్నో
వంచించిన వంచనలెన్నో..
మనసు ఓ తిమిర సామ్రాజ్యం
నిశీథి రేఖలెన్నో
లిఖించని రాతలెన్నో!
మనసు ముసుగు చాటున
కనిపించి కనిపించక
తెరచాటున దాగిన
జీవిత నాటకాలెన్నో..
ఇదే జీవితం..!
- గంజి భాగ్యలక్ష్మి, హన్మకొండ,

సెల్.నం.9441993044
కల!
ఎంత గొప్పది కల!
ఒక్కోసారి జీవితాన్ని ఫణంగా పెట్టేంత

గొప్పది!
కల ఓ తీరని ఆకలి!
ఊహా లోకాల్లో విహరింపజేసినా..
లోలోపల నిప్పు కణికలను ఎగదోసి
మనసును కకావికలం చేసినా..
కల ఫలవంతమవుతుందన్న భరోసా లేదు!
కల తీరే అంత!
అది నెరవేరే వరకు చింత!
కసితో పోరాడటం
కల కొమ్ములు వంచి
దాన్ని అదుపులోకి తెచ్చుకోవడం ఓ కళ!
ఆ కళ తెలిసినవాడు.
లక్ష నక్షత్రాల మధ్యన కూడా
తన అస్తిత్వాన్ని కోల్పోడు!
కలలు సాకారం చేసుకునేందుకు
ఆత్మ విశ్వాసమే ఆలంబనగా
ముందడుగు వేస్తే..
భవిష్యత్తును బంగారు మయం చేస్తుంది!
- ఇషత్ సుల్తానా, కరీంనగర్,

సెల్.నం.9440739159

ఇంతకూ నేనెవర్ని..??
ఇది నా మరో ప్రపంచం
ఇక్కడంతా నాదే పెత్తనం
రాజును నేనే బంటునూ నేనే
వెలుతురు చీకటి రెండూ నేనే
వేకువలోంచి చీకటిలోకి
చీకటిలోంచి వెలుతురులోకి
ప్రతి నిత్యం పరుగులు తీసే
దేహానికి విశ్రాంతినిచ్చేది నేనే
విసుగు తెప్పించేదీ నేనే..
నిగ్గదీసి అడిగేది నేనే
రెప్పల మాటున దాచుకున్న
జ్ఞాపకాలను
తట్టి లేపేది నేనే
రేపటి ఆనందాలను
ఊహల పల్లకీలో
ఊరేగించేది నేనే
సంతోషాలకు రెక్కలు కట్టి
హద్దులు దాటించేదీ నేనే
విషాదాల చేయిపట్టి
వేదనల వాకిట్లో నిలిపి
కన్నీటి వర్షం కురిపించేది నేనే
బాధ్యతను నేనే
బద్ధకాన్నీ నేనే
శక్తిని నేనే విరక్తిని నేనే
వెలుతురులో చీకటి గురించి
ఆలోచిస్తుంటాను
చీకటిలో వెలుతురుకై
తండ్లాడుతుంటాను
అందివచ్చిన సుఖాలను
వదిలి వేస్తుంటాను
అందరాని వాటికై
అర్రులు చాస్తుంటాను
నేనో వింతను
నేనో భ్రాంతిని
నేనో కాంతిని నేనో శాంతిని
బలహీన వ్యక్తిత్వాన్ని
చులకన చేస్తుంటాను
బలమైన వ్యక్తిత్వానికి
గులామునవుతుంటాను..
ఇంతకు నేనెవర్నీ..?
అందరిలో ఉండే మనసును
రౌతుకొద్ది పరుగులు తీసే
కోరికల గుర్రాన్ని..
- పురిమళ్ల సునంద, బుర్హాన్‌పురం,

ఖమ్మం, సెల్.నం.9441815722

తీవ్రవాదం
అటు చూస్తే తీవ్రవాదం
ఇటు చూస్తే ఉగ్రవాదం
ఎటు చూసినా నరమేధం
బిక్కు బిక్కు బతుకులు
అమాయకుల ఆర్తనాదాలు
అభాగ్యుల హృదయ ఘోషలు
తీవ్రవాద తూటాలకు
తనువులను బాసిన
భారతమాత సోదరులారా..!
మిమ్ము గన్న మీ తల్లి
రక్తాశ్రువులను
కురియించుచున్నది..!
తల్లి వేదన రోదన
గాథలు నే చూసానులే..!
నా రక్తం మరిగినది
నా మది పగిలినది
మాటిస్తున్నా ఓ సోదర
నా అభిలాష లిఖించే
ఉగ్ర కవితాక్షరాలతో
తీవ్రవాదాన్ని ఉరిమి ఉరిమి..
తరిమి తరిమి కొడుతాను
తీవ్రవాద రహిత దేశంగా
మారుస్తా మారుస్తా..!!
- అఖిలాశ, జాని తక్కెడల సెల్.నం.9491977190