రివ్యూ

బిటెక్‌కి బాగా తక్కువ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * వి.ఐ.పి -2

తారాగణం: ధనుష్, కాజోల్, అమలాపాల్, సముద్రఖని, వివేక్, రీతూవర్మ, బాలాజీ తదితరులు
కథ, మాటలు: ధనుష్
డివోపి: సమీర్ తాహిర్
సంగీతం: సియాన్ రోల్డన్, అనిరుధ్
నిర్మాతలు: ధనుష్, ఎస్ థాను
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్
సీక్వెల్ చిత్రాల జోరు దక్షిణాదిన పెరుగుతోంది. విజయాల శాతం తక్కువే కనిపిస్తున్నా, ట్రెండ్‌ను సక్సెస్ బాట పట్టించేందుకు దర్శక నిర్మాతలు కష్టపడుతూనే ఉన్నారు. ధనుష్ హీరోగా హిట్టుకొట్టిన ‘రఘువరన్ బిటెక్’కు విఐపి -2 సీక్వెల్. అయితే, హిట్టయిన సినిమాకు సీక్వెల్ డిజైన్ చేయడంలో హీరో ఎక్కువ చేయిపెడితే -్ఫలితం రివర్స్ ఉంటుందని పవన్ గబ్బరిసింగ్‌లాంటి చిత్రం రుజువు చేసింది. ఇప్పుడీ సీక్వెల్‌కూ హీరో ధనుష్ పెన్ను పెట్టాడు. కథ, మాటలు అందించాడు. ఆయన మరదలు సౌందర్య రజనీకాంత్ ఆ కథని తెరపైకి తెచ్చింది. ‘రఘువరన్..’ రిజల్ట్ రిపీటైందో, ‘సర్కార్..’ స్కీమ్‌లా ఫెయిలైందో -విశే్లషణలో చూద్దాం.
‘..బీటెక్’కు కొనసాగింపు అన్నట్టే విఐపి -2 కథ మొదలవుతుంది. పట్టుదలతో ఉద్యోగం సంపాదించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటాడు రఘువరన్ (్ధనుష్). అనిత కన్‌స్ట్స్రలో పనిచేస్తూ బెస్ట్ ఇంజనీర్ అవార్డు అందుకునే క్రమంలో -దక్షిణ భారతదేశంలోనే నెంబర్‌వన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అధిపతి వసుంధర పరమేశ్వరన్ (కాజోల్) దృష్టిలో పడతాడు. అన్ని విధాలా నైపుణ్యం కలిగిన ఇంజనీర్ తన కంపెనీలోనే ఉండాలన్న బిజినెస్ ఈగోతో -తన కంపెనీలో చేరమని రఘువరన్‌కు ఆఫరిస్తుంది. కానీ, రఘువరన్ తనకు తొలి అవకాశం ఇచ్చిన కంపెనీని వదలి రావడానికి ఇష్టపడక, వసుంధరకు నో చెప్తాడు. అదై టైంలో ఆమె సొంతం చేసుకోవాలనుకున్న బిజినెస్ డీల్‌ను దక్కించుకుంటాడు. దీంతో అహం దెబ్బతిన్న వసుంధర, రఘువరన్ మీద కక్ష పెంచుకుంటుంది. అలా కోపం పెంచుకున్న వసుంధర, రఘువరన్‌ను ఎలా టార్గెట్ చేసింది. అతన్ని దెబ్బతీయడానికి ఆమె చేసిన ప్రయత్నాలేమిటి? రఘువరన్ ఆమెను ఎలా ఎదుర్కొని నిలబడ్డాడు. ఆమెలో ఎలా మర్పు సాధించాడు.. అన్న పాయింట్లతో కార్పొరేట్ టామ్ అండ్ జెర్రీ షోతో సినిమా ముగుస్తుంది.
కథలో ప్రధానంగా ఆకట్టుకునే విషయం ఫస్టాప్ కథనం. మొదటి భాగంలో నిరుద్యోగిగా, పక్కింటి అమ్మాయిని ప్రేమించే అబ్బాయిగా కనపడిన రఘువరన్, ఇందులో మంచి ఉద్యోగం చేస్తూ, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని భయభక్తులతో బాధ్యతగా నడచుకునే భర్తగా కనిపించాడు. సాధరణ భర్తగా కనిపించే సన్నివేశాల్లో ధనుష్ పెర్ఫార్మెన్స్ బావుంది. భార్య షాలిని (అమలాపాల్)కు మధ్య నడిచే సరదా, చిలిపి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటన, ఆమెను చూపిన విధానం బాగుంది. కాజోల్‌కు వయసొచ్చిందికానీ, ఆమె అందానికి కాదన్నంత అందంగా, ఈగోయిస్టిక్ బిజినెస్ ఉమెన్‌గా స్టయిలిష్ నటనతో ఆకట్టుకుంది. ఆరంభం బాగున్నా పోను పోను కథనం మరీ చప్పగా తయారవడంతో సెకెండాఫ్‌లో ఆడియన్స్ ఆసక్తి చూపించలేకపోయారు. రఘువరన్ వసుంధరను ఎదిరించే సన్నివేశాలు, హీరో ఎలివేషన్ సీన్లలో కొత్తదనం కనబడలేదు. పైగా చాలా సన్నివేశాలు మొదటి పార్ట్‌ను తలపించేలా ఉండటంతో -కథ రోటీన్ అన్న భావన కలిగింది. రఘువరన్ వర్సెస్ వసుంధర అన్నట్టు చూపించి, చివర్లో చిన్న సంఘటనలతో ముగించడం నిరాశకు గురి చేస్తుంది. వారిద్దరి మధ్య చెప్పుకోతగ్గ రీతిలో ఘర్షణ, కుట్రలు, ఎత్తుకు పైఎత్తులు, కదిలించే గెలుపోటములు వంటివి ఎక్కడా కనబడలేదు. రీతు వర్మ పాత్ర కూడా కథకు పెద్దగా ఉపయోగపడలేదు.
సీక్వెల్ తీయాలన్న ఉద్దేశంతో ధనుష్ రాసుకున్న కథలో కేవలం కాజోల్ పాత్ర తప్ప వేరే కొత్తదనం లేదు. కథనంలోనూ ఫస్ట్ఫాలో కనిపించే బిగింపు సెకెండాఫ్‌లో లేక చప్పగా సాగిపోయింది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ఎలాంటి మెరుపులూ కనిపించవు. సీన్ రోల్డన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంతమేర బాగున్నా, పాటల సంగీతం మాత్రం ఆకట్టుకోలేదు. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మొత్తంగా ‘..బిటెక్’లో ఉన్న దమ్ము, వేగం, ఎమోషన్ విఐపి-2లో కనిపించకపోవడం నిరుత్సాహపర్చింది. కేవలం ఫస్ట్ఫా కథనం, ధనుష్, కాజోల్ పెర్ఫార్మెన్స్ మాత్రమే అంతంత మాత్రం ఆకట్టుకోగా.. సెకెండాఫ్ కథనం, ముగింపు, ప్రధాన పాత్రల మధ్య వైరంవంటివి నిరుత్సాహపర్చాయి.

-త్రివేది