బిజినెస్

బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా పివి సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టైర్ల తయారీ దిగ్గజం బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా.. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధును తమ తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ మేరకు బ్రిడ్జ్‌స్టోన్ కార్పొరేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాంకో అన్నుంజిటో స్పష్టం చేశారు. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా ఇకపై సింధు బ్రిడ్జ్‌స్టోన్ కార్యకలాపాల్లో పాలుపంచుకోనుంది. నిరుడు రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించినది తెలిసిందే. గ్లాస్గోలో జరిగిన ఇటీవలి ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ రజత పతకాన్ని సాధించి అందరినీ ఆకర్షించిన సింధు కోసం కార్పొరేట్ వర్గాలు ఇప్పుడు అమితాసక్తిని కనబరుస్తున్నాయి. కాగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ఉన్న రెండు తయారీ కేంద్రాలను విస్తరించడానికి రాబోయే ఐదేళ్లలో 1,940 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు జపాన్‌కు చెందిన బ్రిడ్జ్‌స్టోన్ ఈ సందర్భంగా తెలిపింది. మహారాష్టల్రోని పుణె, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లలో బ్రిడ్జ్‌స్టోన్‌కు ప్లాంట్లున్నాయి. విస్తరణ తర్వాత ఈ ప్లాంట్ల ఉత్పాదక సామర్థ్యం రోజుకు 25,000 టైర్ల నుంచి 40,000 టైర్లకు పెరుగుతుందని అన్నుంజిటో చెప్పారు. ఇక ఒలింపిక్ క్రీడలకు గ్లోబల్ అసోసియేట్‌గా ఉన్న బ్రిడ్జ్‌స్టోన్‌కు భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా, అదికూడా తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం కావడంపట్ల చాలా సంతోషంగా ఉందని పివి సింధు ఈ సందర్భంగా అన్నారు.