'క్లాప్' కొట్టు గురూ!
రాజకీయాల్లోకి...!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు, తమిళ చిత్రాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ అంజలి త్వరలో రాజకీయాల్లోకి వెళ్లబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవునా.. ఇది నిజమా? అని అందరూ ప్రశ్నిస్తున్నారట. అదీ..తమిళనాట ఈ పుకారు అత్యంత స్పీడుగా షికారు చేస్తోంది. కథానాయికలు రాజకీయాల్లోకి రావడం తమిళనాట పాత విషయమే. ఖుష్బూ లాంటి తారలు ప్రస్తుతం తమిళనాట పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారు. అదే దారిలో అంజలి కూడా త్వరలోనే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరబోతుందని రూమర్ పుట్టుకొచ్చింది. ఒక వేళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీపెడితే అందులో అంజలి చేరే అవకాశముందంటూ కోలీవుడ్‌లో వరుస కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇలా కొత్త పుకారు పుట్టుకురావడానికి అంజలి తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కారణమవుతుందని ఆమె శ్రేయోభిలాషులు వాపోతున్నారు. ఇటీవల తన కొత్త సినిమాలో ‘బెలూన్’ ప్రమోషన్లో భాగంగా తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని అంజలి ప్రకటించింది. పాలిటిక్స్ అప్డేట్స్ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని, ఈ మధ్య పార్లమెంట్‌ను కూడా సందర్శించినట్లు చెప్పుకొచ్చింది. అదీ..సంగతీ! చూద్దాం.. రాజకీయాల్లో ఎప్పుడు.. ఎలా.. ఏ పార్టీలో చేరుతుందో!!