మెయిన్ ఫీచర్

పైకప్పుపై పంట పండిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని అందించే గార్డెన్ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు.ఇంటి పైకప్పుపై పచ్చటి వనాన్ని సృష్టించాలనే ఆసక్తి ఉన్నవారికి ఇదే సరైన సమయం. నలుగురు కుటుంబ సభ్యులకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవటం చాలా ఈజీ. వీటితో పాటు పండ్ల మొక్కలను కూడా పండించుకోవటం నేడు సులువే. నగరంలో ఇంటి పంటలు పండించేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కుండీలు, ప్లాస్టిక్ కంటెనయిర్లలో ఇంటికి కావల్సిన ఆకుకూరలు, కాయగూరలు పండించుకుంటూ తాజా కూరలతో కమ్మటి భోజనం తినవచ్చు. చాలామంది రెండో మూడో కుండీలు పెట్టేసి గార్డెన్‌ను పెంచుతున్నామని సంబరపడిపోతారు. కాని అంగుళం ఖాళీ లేకుండా పచ్చటి మొక్కలు పెంచితేనే గార్డెన్ అని అంటారు. అయితే గార్డెన్ పెంచుకోవాలనే అభిలాష ఉన్నవారు ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పై అంతస్తును పటిష్టంగా నిర్మించుకోవాలి. పిల్లర్లను కూడా రూఫ్ గార్డెన్‌కు అనుగుణంగా నిర్మించుకోవాలి. బరువు ఎక్కువైతే భవనానికి ముప్పు. మొక్కలకు పోసే నీరు ఇంకకుండా వాటర్‌ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను ఏర్పాటుచేసుకుంటే మంచిది. రోజుకు గంట కేటాయిస్తే చాలు ఇంటికి కావల్సిన తాజా కూరగాయలు మీ సొంతమవుతాయి. ఉరుకుల పరుగుల జీవనంలో మార్కెట్‌కు వెళ్లి ఎపుడో పండిన కూరగాయలు, పండ్లు తెచ్చుకొని, వాటిని ఫ్రిజ్‌లో ఉంచి రోజులు తరబడి తినే బదులు ఎపుడవసరమైతే అపుడు మొక్క నుంచి తెంచుకుని కూరలు వండుకుంటే ఆ మజానే వేరు. రసాయనిక ఎరువులు చల్లి పండిన కూరగాయలు తినటం వల్ల డబ్బులు పోవటమేకాదు జబ్బులు కూడా కొనితెచ్చుకోవాల్సి వస్తోంది. మేడపైన ఉండే స్థలాన్ని బట్టి ఎన్ని సిమెంట్ తొట్టెలు, కుండీలు ఏర్పాటు చేసుకోవాలో అంచనా వేసుకుంటే మంచిది.
ఎలాంటివి పండించుకోవచ్చు
టమాట, బెండకాయ, చిక్కుడు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, మునగ, సొర వంటి కాయగూరలతో పాటు అడుగు లోతు స్థలం ముంటే క్యారెట్, ర్యాడిష్, బంగాళాదుంప, క్యాబేజీ వంటి దుంప జాతి కాయగూరలు, క్వాలీఫ్లవర్‌ను కూడా చక్కగా పెంచుకోవచ్చు. నాణ్యమైన విత్తనాలు విత్తుకుంటే ఒక్కొక్క మొక్క నుంచి కనీసం రెండు కిలోల టమాటలు వస్తాయి. కూరగాయలతోపాటు ఆకు కూరలు, నిమ్మ, సపోటా,సీతాఫలం వంటి పండ్ల మొక్కలను పెంచవచ్చు. కనీసం 400 స్కేర్‌ఫీట్ స్థలం ఉంటే చాలు ఈ టెర్రస్ గార్టెన్ పెంచుకోవచ్చు. కొంతమంది జామచెట్లను కూడా పెంచుతారు. కాకర, బీర వంటి తీగజాతి పాదుల కోసం కర్రలతో పందిళ్లు వేసుకోవచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ఏపుగా పెరిగిన మొక్కలను కాపాడుకునేందుకు పొలిఫిలిమ్ కప్పితే అధిక ఎండ మొక్కలపై పడదు. అంతేకాదు కోతులు తదితర జంతువులు మొక్కలను పాడుచేయకుండా చేప వలలు కడితే సరిపోతుంది. వేప పిండి, టీ డికాషన్, వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, కొద్దిపాటి ఆవుపేడను కలిపి కుళ్లబెట్టి మొక్కలకు ఎరువుగా వాడితే ఎంతో మంచిది. వేపనూనెను నీటిలో కలిపి చల్లితే పేనుబంక, పిండినల్లి పట్టదు. వంటనూనె రాసిన అట్టలను మొక్కల వద్ద వేలాడదీస్తే రసం పీల్చే పురుగుల బెడదను నివారించుకోవచ్చు. ప్రతి నాలుగు నెలలకొకసారి కుండీల్లోని పావు వంతు మట్టిని తీసి కొత్త మట్టి మిశ్రమాన్ని కలిపితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. రోజుకు ఒక గంట కేటాయిస్తే చాలు పెరుగుతున్న ఖర్చును నివారించుకోవటమే కాకుండా కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన కూరగాయలను, పండ్లను సమృద్ధిగా అందించవచ్చు.

బోన్సాయ్ మొక్కలు

బోన్సాయ్ మొక్కలు చూడముచ్చటగా ఉంటాయి. మహా వృక్షజాతులను వామన వృక్షాలుగా మార్చి కుండీల్లో పెంచుకోవటం కొత్తేమికాదు. పిల్లలు కూడా వీటిని పెంచటానికి ఇష్టపడతారు. ఈ మధ్య నగరాల్లో జరిగే పిల్లల ఫంక్షన్లలో బహుమతులుగా బోన్సాయ్ మొక్కలను అందజేస్తున్నారు. ఎందుకంటే పిల్లల్లో మొక్కల పెంపకం పట్ల అవగాహన పెంచటానికి ఇలా చేస్తున్నారు. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా పల్లెంలో పెంచుకునే చెట్లు ఇవి. మిగిలిన చెట్ల వలే పూలు పూస్తాయి, పండ్లు కాస్తాయి. కావల్సిన పండ్లు తినటమే కాదు నగర కాలుష్యం నుంచి ఉపశమనం పొందవచ్చు. నోరూరించే చెర్రి పండ్ల బోన్సాయ్‌ను కూడా పెంచుకోవటం ఈజీ. ఇసుకలో వీటి విత్తనాలు నాటాలి. ఓ పదిహేను రోజులు పాటు పరిశీలించాలి. చెర్రి బోన్సాయ్ మొక్కలు వస్తాయి. అలాగే పీచ్ పండ్లను, నిమ్మ పండ్లను కూడా పండించుకోవచ్చు. చాలామంది బోన్సాయ్ మొక్కలంటే మర్రి, రావి, జమ్మి చెట్లను మాత్రమే పెంచుతారు. ఆధ్యాత్మికంగా జాగృతం చేస్తాయని వీరి నమ్మకం. కాని పండ్ల చెట్లను పెంచుకోవటం వల్ల కుటుంబానికి అవసరమైన పండ్లను బోన్సాయ్ మొక్కల నుంచి పొందటానికి అవకాశం ఉంది. బోన్సాయ్ మొక్క ధర రూ.250 నుంచి ఉంటుంది.