విశాఖపట్నం

రత్తాలు దిద్దిన కాపురం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను చెప్పినట్లే నువ్వు వినాలి’’2
‘‘అలా జరగనే జరగదు’’2
‘‘నీకు పొగరెక్కువ’’
‘‘తెలుసు కదా! పద్ధతిగా వుండండి’’
‘‘పద్దతి గురించి నిన్ను చూసి నేర్చుకోవలసిన అవసరం లేదు’’
‘‘పద్ధతి తెలీదు నేర్చుకునే ఓపికా లేదు’’
‘‘నువ్వు యిలాంటి దానివని తెలిస్తే....’’2
‘‘తెలిస్తే ఏమయ్యేది’’
‘‘నిన్ను చచ్చినా పెళ్లి చేసుకోకపోదును’’
‘‘పీడా విరగడయ్యేది’’
‘‘అదే పొగరు’’
‘‘పొగరు కాదు... ఆత్మాభిమానం’’
‘‘నిన్ను కాదు... మీ బాబుననాలి’’
‘‘మధ్యలో మా బాబు ఏమి చేశాడు?’’
‘‘మంచిగా మాట్లాడి నిన్ను నాకు అంటగట్టాడు’’
‘‘మీ బాబేమీ తక్కువ తిన్నాడా!’’
‘‘మా బాబు మీ బాబంత పనికిమాలినవాడు కాదు’’
‘‘కాదు గానీ అబద్ధాల పుట్ట’’
‘‘ఏం అబద్దమాడేశాడు?’’
‘‘సాప్ట్‌వేర్ ఇంజనీరు... నెలకు 80 వేలు జీతమన్నాడు’’2
‘‘పెళ్ళి చూపులప్పుడు అంతే వుండేది’’
‘‘ఇప్పుడేమైంది కాకి ఎత్తుకు పోయిందా’’
‘‘సాఫ్ట్‌వేర్ బూమ్ తగ్గింది’’
‘‘సాప్ట్‌వేర్ బూం తగ్గలేదు తమరే సాప్ట్‌గా వుండకుండా మూడు నెలలకొకసారి కంపెనీ మారి పోతున్నారు’’
‘‘ఇంతకీ ఏమంటావ్’’
‘‘రోలింగ్ స్టోన్ గౌథర్స్ నోమాస్’’
‘‘పెద్ద చెప్పొచ్చావులే.... నువ్వు బియడ్ పూర్తి చేసి పెద్ద కాలేజీలో లెక్చరర్‌వి అన్నాడు మీబాబు’’2
‘‘అవును... నేను ఎంఎస్సీ, ఎంఎడ్ పూర్తి చేశాను. నేను విద్యోదయా కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా చేసేదాన్ని’’
‘‘ఇప్పుడెందుకు పనికొచ్చింది! ఆ చదువు’’
‘‘తమరేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నారని నన్ను రిజైన్ చేసేయమన్నాడు మీ బాబు. తీరా చూస్తే మీ జీతం 50 వేలే . గొర్రెకు బెత్తెడు తోక’’2
‘‘మనకి సరిపోతుంది కదా’’
‘‘మధ్యలో మీ బాబు దూరి నెలకి 20 వేలు పంపమంట్నుడు కదా’’
‘‘అవసరం అలాంటిది నాన్న మెడికల్ లీవ్‌లో వున్నారు. అందుకే నాలుగైదు నెలలు మనం డబ్బులు పంపాలి’’
‘‘పెళ్లికి ముందు ఈ సోది చెప్పలేదు కదా’’
‘‘సోదీ గీదీ అనకు నేను కంట్రోలు తప్పిపోతాను’’
‘‘అదీ చూస్తాను... నేను తలచుకుంటే’ మా నాన్నని పిలిచి యిప్పుడే మా యింటికి పోగలను’’
‘‘అప్పుడైనా నేను ప్రశాంతంగా వుంటాను’’
ఇంతలో వంటగది నుండి పని మనిషి రత్తాలు వచ్చి ‘‘అమ్మగారూ నాను ఎలిపోతానండి’’ అంది.2
‘‘సరే... రేపటి నుండి రాకు. రెండు రోజులు తరువాత కనిపించు పైసలు యిచ్చేస్తాను’’
‘‘అదేంటమ్మ నాను డబ్బులు అడగలేదు కదా’’2
‘‘అయినా నీకు డబ్బులు యిచ్చుకోలేము మేము’’2
‘‘్ఫర్వాలేదమ్మా! ఎప్పుడుంటే అప్పుడే యివ్వండి’’
‘‘సరే అతన్ని అడుగు, రేపటి నుండి రావాలో వద్దో’’
‘‘అయ్యగారూ తమరేమంటారు’’
‘‘్ఫర్వాలేదు రత్తాలు... నువ్వు మామూలుగా వస్తుండు. నీకు డబ్బులు యివ్వడానికి సమస్య లేదులే’’
‘‘సరే వత్తానండయ్యా! వత్తానమ్మా’’
భార్యా భర్తల మధ్య వౌనం. ఆరోజు టిఫిన్ లేదు. మధ్యాహ్నం లంచ్‌లేదు, సాయంత్రం వరకు ఎడమొహం పెడమోహం. కలతల కాపురం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
** ** ** **
సుమంత్, సరళ వివాహం పెద్దలు కుదిర్చింది, యిద్దరూ దూరపు బంధువులు, రుూమధ్యే ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. ఈ ఆరు నెలల్లో సరళ మూడు నెలలు అత్తవారింటి దగ్గర, మూడు నెలలు కన్నవారింటి దగ్గర వుంది. ఈ మధ్యనే సుమంత్ కొత్తగా యిల్లు అద్దెకు తీసుకొని కొత్త కాపురం మొదలుపెట్టాడు. అంత వరకూ అతడు హాస్టల్ పక్షి. సరళ ఎగువ మధ్య తరగతి కుటుంబంలో గారాలపట్టి, సుమంత్ తల్లిదండ్రులు దిగువ మధ్య తరగతి కుటుంబీకులు. అందుకే కాబోలు యిద్దరి మధ్యా ఈ తారతమ్యాలు, అభిప్రాయభేదాలు సహజంగా.
** ** ** **
‘‘రత్తాలు లేటుగా వచ్చావు... ఏమైంది?’’
‘‘ఇంట్లో సమస్యలు అమ్మగారూ’’2
‘‘నీకు సమస్యలేంటి! మీ యింట్లో సాప్ట్‌వేర్ మగాడు లేడు కదా! సమస్యలు రాడానికి’’
‘‘అదేంటమ్మా! అలాగంటారు నా మొగుడు రాజిగాడు పచ్చి తాగుబోతు. నిన్నరాత్రి తాగి రోడ్డుమీద పడిపోతే ఎవరో మోసుకొచ్చారు. నిన్న ఆసుపత్రికి తీసుకుపోయాము, అందుకే రాత్రంతా నిద్రలేదు’’
‘‘అంత తాగుబోతుతో ఎలా వేగుతున్నావు?’’
‘‘ఎంతైనా మొగుడు కదమ్మా! చావైనా, రేవైనా ఆడితోనే’’
‘‘ఏ పనీ చెయ్యడా’’
‘‘నాకు పెళ్లైన మొదట్లో, తాపీ పని చేసేవాడు. తాగుడెక్కువైపోయి యిప్పడు ఏ పనీ లేదు. తాగడం, తిరగడం, తొంగోడం అంతే’’
‘‘అదేంటి, నిన్ను, నీ పిల్లల్ని పోషించడా’’
‘‘ఆడు బతికి బాగుంటే చాలు అమ్మగారూ... నా పిల్లల్ని, ఆడినీ నాను పోషించుకుంతాను’’
‘‘అలాగంటావేంటి, భార్యా పిల్లల్ని పోషించడం భర్త బాధ్యతగదా!’’
‘‘ఏమోనమ్మా! ఎవరి బాధ్యతేదో మీ బోటి చదువుకున్నోళ్లు, పెద్దింటోళ్లు లెక్కలేసుకోగలరు. మాలాంటి వోళ్లు ఎవలకి అవకాశముంటే ఆలు పని చేసి తెత్తారు. మిగతా వాళ్లు తింటారు’’
‘‘నీ భర్తమీద నీకు కోపం లేదా!’’
‘‘కోపముంది... కానీ ఆడంటే నాకు యిష్టం, నానంటే ఆడికి పేనము అందుకే ఆడిని నాను ఏమీ అనలేను’’
‘‘నువ్వంటే నీభర్తకి అంత ప్రేమ వుందా’’
‘‘వుందమ్మా, ఆడు ఎంత తాగినా యింటికొచ్చినప్పుడు మూరెడు మల్లెపూలు, ఒక పకోడీ పొట్లాం తెత్తాడమ్మా’’2
‘‘మధ్యలో పకోడీ పొట్లాం ఏంటీ’’
‘‘పకోడీ అంటే నాకు చచ్చినంత యిట్టమమ్మ అందుకే ఆడు నాకోసం పకోడీ తెత్తాడు’’
‘‘బాగుంది పకోడీకి పడిపోయావన్నమాట’’
‘‘కాదమ్మ ఆడు నా భర్త, మంచోడు, నాలుగు మంచిమాటలు చెబితే తాగుడు మానెత్తాడు. నాకు ఆ నమ్మకం వుంది. ఎప్పటికైనా మంచితనంతో ఆడిని మార్చుకుంతాను’’
‘‘నీకు కన్నవారి బలం లేదా’’
‘‘ఎందుకు లేదమ్మా మా పల్లెలో నా తండ్రికి ఆరు ఎకరాల పొలముంది. నాను పోతే బంగారు బొమ్మలా అపురూపంగా చూత్తాడు’’
‘‘మరి ....రుూ తాగుబోతు మొగుడితో ఎందుకు వీడేమైనా డబ్బున్న వాడా’’
‘‘ఈడికి మా పల్లెలో చిల్లి గవ్వకూడా నేదు. బికారోడు, అయినా ఆడు నా మొగుడమ్మా, జీవితాంతం ఆడికి నాను, నాకు ఆడు... అదేనమ్మా సంసారం’’
సరళ ఆలోచనలో పడింది, సుమంత్ రత్తాలు మొగుడులా కాదు, ఒక సాప్ట్‌వేర్ ఇంజనీర్, సాప్ట్‌వేర్ రంగంలో ఒడుదుడుకులు వల్ల జీతం అటూ యిటూ అవుతుంది. అంతకి మించి సుమంత్‌తో సమస్య లేదు.
3‘రత్తాలుకున్న జ్ఞానం నాకు లేకపోయింది. రత్తాలు ఓర్పు, సహనం నాకూ వుండాలి’2 అనుకుంది
రత్తాలు, సరళ సంభాషణ అంతా విన్నాడు సుమంత్. ఎందుకో వేకువ జాము నుండి నిద్ర పట్టలేదు. రత్తాలు మాటలు అతనిలో కూడా ఆలోచనలు తెచ్చాయి.
‘సరళ పెద్దింటి బిడ్డ. ఉమ్మడి కుటుంబంలో గారాలపట్టి. ఆమె మనసు నొప్పించకుండా అపురూపంగా చూసుకుంటే ఆమె తనని అర్థం చేసుకోగలదు. రత్తాలు మొగుడు ఫుల్‌గా తాగేసినా కూడా మల్లెపూలు, పకోడీ తెస్తూ భార్య మనసు మెప్పించగలుగుతున్నడు. సుమంత్ ఆలోచనలో పడ్డాడు. సరళకు ప్రభాష్ సినిమాలంటే మహా యిష్టం, థమ్ బర్యానీ, కోక్ డ్రింక్, మల్లెపూలు, రోడ్‌సైడ్ బండిలో చాట్, పానీపూరీ, ఐస్‌క్రీం యివన్నీ యిష్టం. ఈరోజు సెలవు కాబట్టి ఆమెకు యిష్టమైనవి ఆమెకు అందించాలి’ అనుకున్నాడు.
‘సుమంత్‌కి వేడి వేడి కాఫీ యిష్టం. మసాలా దోసెలు యిష్టం. నాటుకోడి పులుసు యిష్టం. యింట్లో టివి చూస్తూ కబుర్లు చెప్పుకోవడం యిష్టం. ఈ రోజు సెలవు కాబట్టి అతనికి యిష్టమైన పనులు చేయాలి’ అనుకుంది సరళ.
** ** **
‘‘సుమంత్ డార్లింగ్ కాఫీ తీసుకోండి’’ అంది సరళ సుమంత్ కప్పుకున్న దుప్పటి తొలగిస్తూ. సుమంత్ కాఫీ తాగుతూ ‘‘సరళా ఈ రోజు బాహుబలి సినిమాకి వెళ్దాం. లంచ్ ధమ్ బార్యానీ ఓకేనా’’ అన్నాడు సుమంత్ సరళ బుగ్గమీద గిల్లుతూ-
3రత్తాలు నవ్వుకుంటూ బయటికి నడిచింది. 3‘్భగవంతుడా రుూ పిల్లల కాపురం యిలాగే చల్లగా వుండాలి’2 అనుకుంటూ.

- మీగడ వీరభద్రస్వామి సెల్ : 9441571505.