రివ్యూ

నవరసాల నీరసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * యుద్ధం శరణం

తారాగణం: నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, రేవతి, రావు రమేష్, శ్రీకాంత్, మురళీశర్మ, వినోద్‌కుమార్, ప్రియదర్శి, సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్: కృపాకరన్
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: రజనీ కొర్రపాటి
దర్శకత్వం: కృష్ణ.ఆర్.వి.మారిముత్తు

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తరువాత నాగచైతన్య నటించిన చిత్రం యుద్ధం శరణం. నూతన దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా ఇది. శ్రీకాంత్ చాలా ఏళ్ళ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని చేసిన ఈ సినిమా టైటిల్‌లో చెప్పినట్టు విలన్‌తో యుద్ధం.. మరి ఎవరికి శరణమన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిదే.
హీరో అర్జున్ (నాగచైతన్య) డ్రోన్ మేకర్. అతని తల్లిదండ్రులు.. సీత (రేవతి), మురళీకృష్ణ (రావు రమేష్). హ్యాపీ ఫ్యామిలీ. అర్జున్‌కు అప్పటికే లవర్ అంజలి (లావణ్య త్రిపాఠి)తో ఎంజాయ్‌గా ఉంటూ.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే పనిలో ఉంటాడు. మినిస్టర్ వినోద్‌కుమార్ ఓ భారీ కుంభకోణం కేసులో ఇరుక్కుంటాడు. దానివల్ల అతని రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. దీని నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు అల్లర్లు క్రియేట్ చేసి విషయాన్ని డైవర్ట్ చేయాలని ప్లాన్‌లో భాగంగా.. సిటీలో మూడు చోట్ల బాంబ్ బ్లాస్ట్ చెయ్యలని ప్లాన్ చేస్తాడు. హైదరాబాద్‌కి పెద్ద రౌడీగా చెలామణి అవుతున్న నాయక్ (శ్రీకాంత్)కి ఈ పని అప్పగిస్తారు. అనుకున్నట్టుగానే భారీ బాంబు పేలుళ్ళు జరిగి.. చాలామంది ప్రాణాలు కోల్పోతారు. బ్లాస్ట్ జరిగిన మూడు రోజుల తర్వాత హీరో అర్జున్ తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. వారిని వెతుక్కుంటూ సిటీ అంతా తిరుగుతుంటాడు అర్జున్. అతని తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారని తెలుస్తుంది. అయితే అది యాక్సిడెంట్ కాదని, వాళ్ళని నాయక్ చంపాడని తెలుసుకుంటాడు అర్జున్. బ్లాస్ట్ జరిగిన తర్వాత అర్జున్ తల్లిదండ్రులు హత్యకు గురికావడం వెనుక రీజన్ ఏమిటి? ఆ బ్లాస్ట్‌కి, వారికి ఏదైనా సంబంధం వుందా? నాయక్ వాళ్ళని ఎందుకు చంపాడు? తన తల్లిదండ్రుల్ని చంపిన నాయక్‌పై అర్జున్ ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది మిగతా కథ.
హ్యపీగా వెళ్లిపోతున్న ఒక మామూలు కుర్రాడి ఫ్యామిలీ లైఫ్‌లోకి సంబంధం లేకుండా ఒక రౌడీ ఎంటర్ అయ్యి మొత్తం వారి సంతోషాన్ని దూరం చేస్తే, ఆ కుర్రాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని దర్శకుడు యుద్ధం శరణం స్టయల్‌తో చెప్పాడు.
ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ రొటీన్. దానికి తగ్గట్టుగానే నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్ చెప్పుకోదగ్గదిగా లేదు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్యారెక్టర్‌కి సినిమాలో ప్రాధాన్యం తక్కువ. హీరో, హీరోయిన్ మధ్య వుండాల్సిన కెమిస్ట్రీ కూడా వర్కవుట్ అవ్వలేదు. హీరో తల్లిదండ్రులు రేవతి, రావు రమేష్ ప్రతి విషయానికి ఓవర్‌గా రియాక్ట్ అవుతూంటారు. నాగచైతన్య కాంబినేషన్‌లో వాళ్ళు చేసిన సీన్స్ అన్నీ అసహజం అనిపిస్తాయ. విలన్ నుంచి హీరోగా టర్న్ అయిన తర్వాత ఫస్ట్‌టైం విలన్‌గా నటించిన శ్రీకాంత్ ఈ క్యారెక్టర్‌ని ఎంచుకోవడమే పెద్ద మిస్టేక్. మిగతా క్యారెక్టర్స్‌లో వినోద్‌కుమార్, మురళీశర్మ, రవివర్మ ఓకే అనిపించారు.
టెక్నికల్‌గా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అంశాలు ఏమీ లేవు. కెమెరా వర్క్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఏ సన్నివేశమూ ఎంజాయ్ చేయతగ్గదిగా ఎంచలేం. వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాల గాఢత పెంచలేకపోయంది. పాటలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. ఎడిటింగ్ కూడా ఆ స్థాయిలోనే వుంది. అబ్బూరి రవి రాసిన మాటలు చాలా సాదా సీదా. కొన్ని రిపీటెడ్ డైలాగ్స్ ఆడియెన్స్‌కి చిరాకు తెప్పిస్తాయి. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే సినిమాలో రిచ్‌గా వుండే సన్నివేశం ఒక్కటీ లేదు. నిర్మాణ విలువలు సాధారణంగా వున్నాయి. దర్శకుడు కృష్ణ మారిముత్తు గురించి చెప్పాల్సి వస్తే ఏ మాత్రం కొత్తదనం లేని కథతో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడో అర్థంకాదు. సినిమా ప్రారంభంలోనే బాంబ్ బ్లాస్ట్ చాలా ఆషామాషీగా చూపించేశాడు. హీరో తన తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ తిరిగే టైమ్‌లో మధ్య మధ్య ఫ్లాష్‌బ్యాక్‌లో వారితో హీరో గడిపిన సీన్స్, హీరోయిన్‌తో లవ్‌లో పడే సీన్స్ చూపించేశాడు. ఆ సీన్స్ అన్నీ సాధారణంగా వున్నాయి. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు స్లో నేరేషన్‌తో నడుస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అస్సలు లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. ఇందులో డ్రోన్ అనే పరికరాన్ని చూపించారు. అది కథకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. యువ హీరోలు కాస్త కొత్తదనం వున్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపే సమయంలో చైతూ ఏ మాత్రం కొత్తదనం లేని సినిమా చేశాడు. నటన పరంగా యావరేజ్.. ఇక శ్రీకాంత్ విలన్‌గా ఓకె అనిపించుకున్నా ఇది అతనికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పలేం. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌తో ఆద్యంతం ఆకట్టుకున్నా, అసలైన హీరో, విలన్ రివెంజ్ డ్రామాలో అనుకున్నంత స్థాయి తీవ్రత లేక రొటీన్ రివెంజ్ డ్రామాగా సినిమా మిగిలింది. అలాగే కథలో లవ్‌స్టోరీ, కామెడీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.

-త్రివేది