మెయిన్ ఫీచర్

రాగాల పల్లకిలో కోయిలమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావ్యమైన శాస్ర్తియ సంగీతం చెవినపడితే చేస్తున్న పని కూడా ఆపేసి వినేవారు ఈ కళల కాణాచిలో ఎంతో మంది ఉన్నారు. స్వరాలే జీవితం అనుకుని సాధన చేసే సంగీత సరస్వతులు వీరు. రాగాల పల్లకిలో సరికొత్త రాగాలను పలికిస్తున్న ఈ కోయిలమ్మలు సరిగమలతో సావాసం చేస్తుంటారు. శాస్ర్తియ సంగీతంలో సాహసంతో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆ సంగీత కళామతల్లికి తమ సేవలు అందిస్తున్నారు. తమ సంగీతంతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న వీరు పంచుకున్న ముచ్చట్లు.
వేణగాన వినోదిని
డాక్టర్ జయప్రద రామ్మూర్తి భారతీయ సంగీతంలో పరిచయం అక్కర్లేని పేరు. వేణుగానంతో ఆ చిన్ని కృష్ణుడు గోపికలను అలరించినట్లు జయప్రద రామ్మూర్తి కూడా తెలుగువారి వేణుగాన వినోదినిగా మారారు. శాస్ర్తియ సంగీతంలో తనదైన ముద్ర వేసుకున్న జయప్రద రామ్మూర్తి పసిప్రాయం నుంచే సంగీతం పట్ల ఆసక్తి కనబరిచారు. ఈ రోజు వేణుగాన వినోదినిగా ఆమెకు హైదరాబాద్ నగరంతోనే కాదు ప్రపంచంతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. కర్నాటక సంగీత గాన గాంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అడుగుజాడలను అనుసరిస్తూ.. ఆయన ఆశ్వీరాద బలంతో రాణిస్తున్నారు. మహిళలు సంగీతంలో చెరగని ముద్ర వేసుకోవటం అసాధారణ విషయం అంటారు. ఎందుకంటే సంగీత సాధన కోసం ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, ఇంట్లో పెద్దవారు ఉంటే వారి ఆలనాపాలనా చూడాల్సి ఉంటుంది. పారితోషికం ఇచ్చే విషయంలోనూ మహిళా కళాకారుల పట్ల చిన్నచూపు చూస్తుంటారు. కొన్ని కార్యక్రమాలలో తాను కూడా పారితోషికం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇలాంటి ఇబ్బందులను శ్రోతలు చూపించే ఆదరాభిమానలతో మనసు నుంచి తుడిచేస్తుంటాం అని అంటారు. వేణుగానంలో చేసే ప్రయోగాలు పలు సందర్భాల్లో శ్రోతల ప్రశంసలు అందుకున్నాయని, అది తనకు ఎంతో గౌరవమని ఆమె అంటారు. ఎక్కువసార్లు రాత్రివేళల్లో కచ్చేరీలు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మహిళా కళాకారిణులకు కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందంటారు. రాత్రివేళల్లో ప్రయాణించటానికి ఇష్టపడనంటారు. శాస్ర్తియ సంగీత కచ్చేరీలు ఏర్పాటుచేయటం మంచి ఉద్దేశ్యంతో కూడుకున్నదైనప్పటికీ మాస్‌ను ఆకర్షించే ప్రయత్నం దాగి ఉంటుందని, ప్రభుత్వ సంస్థలు సైతం ఇదే దృక్పథంతో వ్యవహరించటం ఒకింత బాధాకరమని యువతరంలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెబుతున్నారు.
‘యువత సినిమా సంగీతం పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాస్ర్తియ సంగీతాన్ని ప్రోత్సహించటానికి స్థిరమైన ప్రయత్నం ఉండాలి. అపుడే అది ప్రజాదరణ పొందుతుంది. సంగీతంలో రానురాను ఆలోచనలు మారిపోతున్నాయి. మూడు గంటల పాటు శ్రోతలను కదలకుండా కూర్చోబెట్టడం మంచి సంగీతానికే సాధ్యం. నేటి యువత శాస్ర్తియ సంగీతం పట్ల మరింత విశ్వాసంతో ముందుకు వచ్చినపుడే అవకాశాలు వస్తాయి. ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను’ అని అంటారామె.
సంగీతం దైవ ప్రార్థన వంటిదే..
సంగీత ప్రపంచంలో స్వరఝరి డాక్టర్ యర్రవల్లి రమాప్రభ. సంగీతమే శ్వాసగా చేసుకుని సాగుతున్న రమాప్రభ హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ చేశారు. పదమూడేళ్ల క్రితం సంగీత లెక్చరర్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించారు. సంగీతంపైన ఉండే మక్కువ, సాధన ఆమెను ఆ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపాల్‌ను చేసింది. తల్లి దగ్గరే సరిగమలు నేర్చుకున్నారు. ఐదేళ్ల వయసులో అమ్మ శేషమణి చెప్పే సంగీత పాఠాలను వినేవారు. ఆమె గొప్ప వయోలినిస్ట్. సంగీతం పట్ల కనబరచిన ఆసక్తిని గమనించి ఆమె ప్రోత్సహించారు. నేతి శ్రీరామశర్మ వంటి సంగీత టీచర్ల వద్దకు తీసుకువెళ్లారు. అంతేకాదు సంగీత కచ్చేరీలను చిన్నప్పటి నుంచి వినే అలవాటు చేశారు. సంగీత ప్రొఫెషన్‌లో మహిళలు రాణించటం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా సాధన కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. అలాంటి సదుపాయాలను పిల్లలకు తల్లిదండ్రులు కల్పించాల్సిన అవసరం ఉంది.
సంగీతం పట్ల అభిరుచి కనబరచే పిల్లలను కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి. సంగీతం జీవితంలో ఓ ప్రార్ధన వంటిదే. సంగీతానికి ఉన్న విలువలను గుర్తెరిగి కష్టపడాలి. సంగీత కచ్చేరీలను నిర్వహించే ఆర్గనైజర్లతో మాట్లాడటం మహిళాకళాకారులకు అంత సులభం కాదు. మహిళల కోసం సంఘహిత అనే సంస్థను స్థాపించారు. అంతేకదా సైకాలజీకి సంబంధించిన అనేక అంశాలను బోధిస్తుంటారు. దీనిపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆధునిక సమాజంలో సంగీత గురువుకి, శిష్యులకు మధ్య సరైన అవగాహన ఉండాల్సిన అవసరం కూడా ఉందనేది ఆమె నిశ్చితాభిప్రాయం.
చిత్రం.. డాక్టర్ యర్రవల్లి రమాప్రభ

-టి.ఆశాలత