బిజినెస్

రూ.910 కోట్లతో సబ్‌స్టేషన్లు, కొత్త లైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకాల ద్వారా దాదాపు రూ.910కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు తెలంగాణ సదరన్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి చెప్పారు. ఈ పథకాల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో 17, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 13, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 15, మెదక్ జిల్లాలో 33/11 కెవి సబ్‌స్టేషన్లు 8 వరకు నిర్మాణం చేపడుతున్నామన్నారు. దీంతో పాటు నూతన లైన్ల నిర్మాణం, నూతన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనులను టెడర్ల ద్వారా ప్రైవేట్ సంస్ధలు, కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. నూతన పన్ను జిఎస్‌టి వల్ల ఎదురవుతున్న సమస్యలపై సిఎండి రఘుమారెడ్డి ఏజన్సీలతో చర్చించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ జిఎస్‌టి పన్ను విధానం వల్ల క్షేత్ర స్ధాయిలో మెటీరియల్ ఇంతకు ముందు ఉన్నంత స్ధాయిలో అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ నూతన పన్ను విధానం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. విద్యుత్ సంస్ధలేదా ప్రభుత్వం పన్ను విషయంలో, ఎక్సైజ్ డ్యూటీలో రాయితీలు ఇవ్వాలని కోరారు. జిఎస్‌టి పన్ను విధానం అమలులోకి రానప్పుడు పాత పన్నుల ప్రకారం రేట్స్ కోట్ చేశామన్నారు. ఇలా నూతన పన్ను విధానంలో కొంత అస్పష్టతతో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల మీద భారం పడలేదని కాకుండా కొన్ని విషయంలో వ్యాట్ ఎక్కువగా ఉంటే, కొన్నింటిలో జిఎస్‌టి తక్కువగా ఉందన్నారు. కాంట్రాక్టర్లు తాము ఎదుర్కొన్నప్పుడు సమస్యలను రాత పూర్వకంగా తమకు తెలియచేయాలన్నారు. తాము టాక్స్ కన్సల్టెంట్‌తో సంప్రదించి తగిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఐపిడిఎస్, డిడియుజివై, హెచ్‌విడి పథకాల కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను పరిశీలించి వాటిపై తగు నివేదికను రూపొందించాలని సంస్ధ డైరెక్టర్ ప్రాజెక్టు టి.శ్రీనివాస్‌ను సిఎండి ఆదేశించారు. కాంట్రాక్టర్లు తాము చేపట్టిన పనులను నిర్ణయించిన తేదీ లోపుగా పరిష్కరించాలన్నారు.

చిత్రం..గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రసంగిస్తున్న సదరన్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి