బిజినెస్

గిట్టుబాటు ధర లేక నిమ్మ రైతు దిగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 4: గిట్టుబాటు ధర లేకపోవడంతో నిమ్మ రైతులు కుదేలవుతున్నారు. బస్తా నిమ్మకాయలను కేవలం 100 రూపాలయకే దళారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. వరుసగా రెండేళ్లుగా మద్దతు ధర లేక నిమ్మ రైతులు తమ దిగుబడులను రోడ్లపై పారవేసి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం నిమ్మ రైతులను నిరాశ పరుస్తోంది. రెండేళ్ల క్రితం బస్తా నిమ్మకాయలు 1600 రూపాయలు పలుకగా, దళారులు ఇతర రాష్ట్రాల నుంచి నిమ్మ అధికంగా వస్తుందంటూ ధరను 100 రూపాయలుగా నిర్ణయించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అధిక ధరలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ లాభపడుతూ నిమ్మ రైతును మాత్రం నిండా ముంచుతున్నారు. 100 రూపాయలకు బస్తా అమ్మితే కూలీల కూలి సైతం రావడం లేదంటూ రైతులు తోటల్లో చెట్లపై నిమ్మకాయలు కోయకుండా వదిలివేస్తుండగా పండ్లు పండి వృథాగా రాలిపోతు కన్నబిడ్డలా తోటలను సాదిన రైతులకు నష్టాలు మిగిలిస్తున్నాయి.
ఒక్క కూలీకి 250 రూపాయలు చెల్లిస్తుంటే.. బస్తా నిమ్మకాయలు 100 నుంచి 150 రూపాయల ధర పలుకుతుండడం, రవాణా చార్జీలతో కలిపి రైతులకు అదనంగా 200 రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా అమలుకావడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా నిమ్మ మార్కెట్ లేకపోవడంతో ఇదే అదనుగా దళారులు ఊరూరా తిరుగుతూ రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకే నిమ్మకాయలను కొనుగోలు చేస్తూ బయట రాష్ట్రాలకు విక్రయిస్తూ పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. నిమ్మ పండించిన రైతుకు మాత్రం పెట్టుబడులు సైతం రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
అధిక కమీషన్లతో రైతుకు టోకరా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిమ్మ కొనుగోలు కేంద్రాల్లో 4 శాతం కమీషన్‌ను తీసుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా దళారులు 13 శాతం వరకు వసూలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామంటున్న అధికారులు, అధికార పార్టీ నాయకులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి చోద్యం చూస్తుండడంతో నిమ్మ రైతులను ఆదుకునేవారే కరువయ్యారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుండడంతో రైతుల పాలిట శాపంగా మారింది. నల్లగొండ, నకిరేకల్‌లో పదుల సంఖ్యలో ఉన్న ప్రైవేటు మార్కెట్లలో నిమ్మకాయలను విక్రయించిన రైతులకు దళారులు సకాలంలో డబ్బులు చెల్లించకుండా నెలల తరబడి తిప్పించుకుంటున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతులు పలు రూపాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా రైతుల కష్టాలను తీర్చడంలో విఫలమవుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిమ్మ మార్కెట్ నిర్మాణ పనులు నకిరేకల్ పట్టణంలో నత్తనడకన సాగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. దళారుల ప్రలోభాలకు తలొగ్గిన కొంతమంది ప్రజాప్రతినిధులు నిమ్మ మార్కెట్ పనులను జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నిమ్మ మార్కెట్ యార్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా బస్తాకు 600 నుంచి 800 రూపాయల గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని నిమ్మ రైతులు కోరుతున్నారు.

చిత్రం..సరైన ధర రాకపోవడంతో రోడ్లపై నిమ్మకాయలను పారబోసి నిరసన తెలుపుతున్నరైతులు