విజయవాడ

అడ్డగోలు కట్టడాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, డిసెంబర్ 21: కాళేశ్వరరావు మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వైపు అడ్డగోలు కట్టడాలపై వీఎంసీ అధికారులు గురువారం ఉదయం నిర్మాణాలు, ఆక్రమణలను కూల్చేశారు. సుమారు 30 ఏళ్ల ఆక్రమణలు 3గంటల్లో నామరూపాలు లేకుండా కుప్పకూలాయి. ఇటీవల గద్దబొమ్మ సెంటర్‌లో వీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో కూరగాయల వ్యర్థాల నుండి వర్మికంపోస్టు తయారీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మిషన్‌ని ప్రారంభించడానికి వీఎంసీ కమిషనర్ జే నివాస్ గద్దబొమ్మ సెంటర్‌కి వచ్చారు. కేవలం 200ల మీటర్ల దూరానికి ఆయన వాహనం చేరుకోడానికి చాలా సమయం పట్టింది. దాంతో కాళేశ్వరరావు మార్కెట్ వ్యాపారులు గద్దబొమ్మ వైపు ఉన్న వారంతా తమ పరిధులు దాటి ఆక్రమించుకున్నారని ఆయన గ్రహించారు. ఈలోగా వ్యాపారుల్లో ఆక్రమణల విషయంలో విబేధాలు రావడం, యూనియన్‌లు, రాజకీయాల ప్రభావంతో ఒకరిపై ఒకరు వీఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసుకోవడంతో ఆక్రమణదారులను తొలగించడం అధికారులకు సులువైన మార్గమైంది. దాంతో గురువారం వీఎంసీ కమిషనర్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ఆక్రమణలను కూల్చేశారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఐరన్‌మెస్‌లు, వరండాలు, పక్కా కట్టడాలు తొలగించారు. సుమారు 3గంటల్లో ఆక్రమణలు మొత్తం నేలమట్టమయ్యాయి. రాజకీయ నాయకుల ఒత్తిడులు, వ్యాపార సంఘాల అభ్యర్థనలు తుంగలో తొక్కిన వీఎంసీ అధికారులు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఆక్రమణలు నిర్మూలించడాన్ని పాతబస్తీ వాసులు అభినందించారు. అధికారులకు తోడుగా శాంతిభద్రతల విభాగం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు నిలబడ్డారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యాపారుల్లో గురువారం అంతరమథనం మొదలైంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ఎవరి వ్యాపారం వారు సర్దుకుపోయి చేసుకుంటే ఇదంతా జరిగేదికాదని తలలు పట్టుకున్నారు. ఈ ఆక్రమణల తొలగింపును సిటీ ప్లానర్ లక్ష్మణరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎం జగదీష్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్స్ ప్రసాదరావు, మహాలక్ష్మిలు పర్యవేక్షించగా ట్రాఫిక్ సీఐలు మహేంద్ర, రేలంగి రాజేంద్రప్రసాద్‌లు తమ సిబ్బందితో ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు.

బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ రీయంబర్స్ చేయండి
* కలెక్టర్ లక్ష్మీకాంతంను కోరిన మేయర్ శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 21: నగరంలోని పాత ప్రభుత్వ హాస్పటల్ ఎదురుగా గల రైవస్ కాల్వ గట్టుపై నివాసముంటున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పక్కాగృహాలకు సంబంధించి బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ రీయంబర్స్‌మెంట్ తక్షణమే చెల్లించాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ కలెక్టర్ బి లక్ష్మీకాంతంను కోరారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఆయనను కలిసిన శ్రీ్ధర్ పునరావాసం కింద మొత్తం 54 ఇళ్లను తొలగించి వారికి పక్కాగృహం చెల్లించడం జరిగిందని, ఇందుకు ఒకొక్క గృహానికి లబ్ధిదారుని వాటా కింద 66వేల రూపాయల చొప్పున మొత్తం 35.64 లక్షల రూపాయలను రీఎంబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే రామవరప్పాడు ఫ్లై ఓవర్ దగ్గర రైవస్ కాల్వ గట్టు, రాజీవ్ గాంధీ పార్కు పక్కన పూల మార్కెట్ దగ్గర ఇళ్లను తొలగించి పునరావాసం కల్పించిన వారిలో అర్హులైన వారిని గుర్తించి, మిగిలిన అనర్హుల గృహాలను ఖాళీ చేయించే విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవిషయాలతోపాటు నగరానికి చెందిన వివిధ సమస్యల పరిష్కారంపై చర్చించిన మేయర్ వీఎంసీ సహకరించాలని కోరారు.