మెయిన్ ఫీచర్

అభినవ సత్యభామ.. కళాకృష్ణ (కళాంజలి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర నాట్యం అంటే గుర్తుకువచ్చేది కళాకృష్ణ. పేరులోనే కళను సొంతం చేసుకున్న ఈ అభినవ నృత్యకారుడు పేరిణి నృత్యానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. భామా కలాపం నృత్యరూపకం చూస్తే అభినవ సత్యభామగా మనముందు సాక్షాత్కరించే ఈయనను ఎవరూ కూడా పోల్చోకోలేరు. అంతలా ఆయన వీక్షకులను తన నృత్యాభినయంతో కట్టిపడేస్తారు. దేశ విదేశాలలో వేల నృత్య ప్రదర్శనలిచ్చిన ఈయన ‘నవజనార్దనం’ చేయడానికి ఎంతో ప్రఖ్యాతిగాంచారు. ఈయన స్ర్తి వేషంలో ఉన్నపుడు ఆడవాళ్ళకే అసూయ కలిగేంత అందంగా ఉంటారు. బాహ్యంగా ఎంత అందగా ఉంటారో, వీరి మనస్సు ఇంకా అందమైనది. ఎంతో విశాల హృదయం. కొన్ని దశాబ్దాలుగా నృత్యానికే అంకితమైన గొప్ప కళాకారుడు. కళాకృష్ణ నృత్య ప్రదర్శన చూడటం కన్నుల పండువగా ఉంటుంది.

ప్రస్థానం
కళాకృష్ణ కల్లేపల్లి, కరీంనగర్ లక్ష్మయ్య, గౌరి దంపతులకు 11ఆగస్టు, 1991న జన్మించారు. ప్రఖ్యాత గురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ వద్ద నృత్యం అభ్యసించారు. అలాగే శ్రీమతి మాణిక్యమ్మ, శ్రీమతి అన్నాబత్తుల సత్యభామ, శ్రీమతి జంపా ముత్యం వద్ద కూడా నృత్యం అభ్యసించారు. 1987లో హరిహర నృత్యనికేతన్ స్థాపించి వేలాదిమంది శిష్యులు, ప్రశిష్యుల ద్వారా నృత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది వీరి తపస్సు!
పేరిణి నట్టువాంగానికి ఖ్యాతి
కాకతీయ సామ్రాజ్యంలో పేరిణి చేసేవారు. పేరిణి అంటే ప్రేరణ. పేరిణి భంగిమలు రామప్ప గుడిలో ఉన్నాయి. పేరిణి తాండవం వీర రస ప్రధామైనది. దీనిని మళ్లీ కళాకృష్ణ పేరిణి నట్టువాంగానికి ఎంతో పేరు పొందినవారు. పేరిణి లాస్యం కూడా ఎన్నో కావ్యాలలో రాయబడింది. తంజావూరు రఘునాధ భూపాలుని నిత్యకృత్యంలోని ద్విపదలో, ఆస్థాన నర్తకీమణుల విన్యాసాలను వర్ణిస్తూ చంద్రరేఖ పంచాంగాలతో కూడిన పేరిణిని ప్రదర్శించినట్లు విజయరాఘవ నాయకుడు చెప్పాడు. పేరిణి లాస్యం ప్రదర్శించడానికి శాస్త్రాల ఆధారంగా రూపకల్పన చేశారు కళాకృష్ణ. తంజావూరు కాలంలో ఆనాటి ఆస్థాన నర్తకీమణులు ముద్దు చంద్రరేఖ భాగీరథి, రూపవతి మొదలైనవారు పేరిణి ప్రదర్శించినట్లు ఆధారాలున్నాయి. పేరిణి లాస్యం ఇవాళ చేయబడుతున్నది అంటే అది కళాకృష్ణ దీక్ష, తపస్సు, సాధన.
దేశ విదేశాలలో ప్రదర్శనలు
కళాకృష్ణ కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఖండాంతరాలకు కూచిపూడి గొప్పతనాన్ని వ్యాపింపజేశారు. వివిధ రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా, మారిషస్, యుఎస్‌ఎ, యుకె, ఇండోనీషియా, మలేసియా, సింగపూర్, మస్కట్, జపాను మొదలైన ఎన్నో దేశాలలో ప్రదర్శనలిచ్చి మన కళలను ప్రచారం చేశారు. పలు వీడియోలను రూపకల్పన చేశారు. వివిధ సంస్థలు, ప్రభుత్వం తరపున దేశ విదేశాలలో వర్క్‌షాప్స్ నిర్వహించి ఎందరో కళాకారులకు మార్గనిర్దేశం చేశారు.
లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్
మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ మారిషస్ 1987 ఇండియన్ క్లాసికల్ డాన్స్ గురించి. ఆఫ్రికా 1988, చికాగో 1991.
సంగీత నాటక అకాడమీతో 1995, 1996, 1999, 2000, హైదరాబాద్, చెన్నై ఢిల్లీలో మొ
ప్రకృతి ఫౌండేషన్ చెన్నై 2002
ముంబై కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ 1998
స్పిక్, మాకె ప్రతి సంవత్సరం భారతదేశమంతటా.
వీడియోల రూపకల్పన
నవ జనార్దనం ప్రదర్శన, నవజనార్దన ఆలయం -9 రోజులు- 1995
ప్రైవేటు సంస్థ నవజనార్దనం మీద డాక్యుమెంటరీ 1986.
ఎన్‌సిపిఎ 1985
కేంద్ర సంగీత నాటక అకాడమీ 1982
లివింగ్ పిక్చర్స్ ఎక్సెటసీ 2004
లండన్ టీవీ అర్థనారీశ్వరం - 2001
అర్థనారీశ్వర డాక్యుమెంటరీ- గ్రేట్ డాన్సర్ చంద్రలేఖ
వరించిన అవార్డులు
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 2009
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస (కళారత్న) 2008
ప్రతిభా పురస్కార్, తెలుగు విశ్వవిద్యాలయం 2006
అభివ సత్యభామ - శ్రీ వేంపర్ల సత్యనారాయణ శాస్ర్తీ 1986
మధురలాస్య కళానిధి - సంగీత విద్వత్ సభ, కాకినాతడ 1986
ఆంధ్రప్రదేశ్, తెలుగు విశ్వవిద్యాలయం 1987
బంగారు పతకం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ, హైదరాబాద్ 2004
అక్కినేని నాగేశ్వరరావు బంగారు పతకం, 2005
వేదాంత జగన్నాథ శర్మ బంగారు పతకం, నృత్య కినె్నర 2010
కళా సుబ్బారావు పురస్కారం, హైదరాబాద్ 2010
ఇంటర్నేషనల్ డాన్స్ డే అవార్డు, రసమయి, హైదరాబాద్
ఇంటర్నేషనల్ డాన్స్‌డే కల్చరల్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నంది అవార్డు, నవ జనార్దనం డాక్యుమెంటేషన్, 1987.
స్థానం నరసింహారావు అవార్డు 2007
కెవిఎస్ అవార్డు, ఏలూరు 2007
స్ఫూర్తి అవార్డు, భాగ్యనగర్ ఫైన్ ఆర్ట్స్ 1995
వివేకానంద ఎక్స్‌లెన్సీ అవార్డు, వివేకానంద 150 జయంతి సందర్భంగా.
ఎన్నో అవార్డులు, ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందారు. ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తారు. చాలా సరళంగా మాట్లాడుతారు. వీరి మాట సున్నితం, మనసు నవనీతం.
కొరియోగ్రఫి
ఎన్నో శబ్దాలు, అష్టదిగ్బంధన తరంగం, పల్లవులు మొదలైనవి.
తెలుగు వైభవం- డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ 2000
ఆంధ్రా బాలే, ఎడిబి కాన్ఫరెన్స్ 2006, హైదరాబాద్
తాండవం - 1987
రామకృష్ణ లీలాగీతి, శారదా లీలాగీతి, రామకృష్ణ చాలీసా, రామకృష్ణ మఠం, హైదరాబాద్ 2000
అర్థనారీశ్వరం లండన్ టివి
ఆంధ్ర నాట్య వైభవం మాలే 1998

పరిశోధకుడిగా ప్రస్థానం..
కూచిపూడి భామాకలం- ఆంధ్ర నాట్యం నవ జనార్దనం
తులనాత్మక పరిశీలన- కేంద్ర సంగత నాటక అకాడమీ, 1990
డిపార్టుమెంట్ కల్చర్ వారి ఫెలోషిప్, స్ర్తి వేషం అభినయం 1989
నవజనార్దనం, సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ 1983
గురుశిష్య పరంపర, సంగీత నాటక అకాడమీ 2006
ప్రచురణలు:ఎన్నో వ్యాసాలు ప్రముఖ మ్యాగజైన్లు, సావనీర్లు.
ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ నృత్యరీతులు.
నవజనార్దనం
అభినయం - స్ర్తి వేషం
ఆంధ్ర నాట్యం
పేరిణి మీద పుస్తకం
విజిటింగ్ ఫాకల్టీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎంఎ నృత్యవిభాగం 1990 నుండి
తెలుగు విశ్వవిద్యాలయం, ఎంఎ నృత్య విభాగం, 2002 నుండి.
మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ, ఆంధ్ర నాట్యం లెక్చరరుగా, 1998-2009.

డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి