నిజామాబాద్

హిందూ సమాజం శక్తివంతంగా లేనందునే దేశంపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, డిసెంబర్ 26: దేశంలో హిందూ సమాజం శక్తివంతంగా లేనందువల్లే ఇతర దేశాల(పాకిస్తాన్, చైనా)కు చెందిన విద్రోహులు భారత్‌లోకి చొచ్చుకొచ్చి దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా హిందువులు మేల్కొనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ తెలంగాణ ప్రచారక్ దేవేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్ సార్వజనికోత్సవం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ఏర్పడి 93సంవత్సరాలు గడుస్తున్నాయని, కాబట్టి దేశం కోసం ప్రస్తుతం ఎలాంటి వ్యక్తులను తయారు చేయాలో అలా తయారు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఒక హిందువు, హిందూ సమాజంలో తిరిగే విధంగా వ్యక్తులను తీర్చి దిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్రోహ శక్తులతో పోరాటం చేసేందుకు హిందూ యువకుల్లో అవసరమైన చైతన్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నింపుతోందని పేర్కొన్నారు. ఇందుకు కారణం విదేశీలు భారత్‌పై దాడులకు పాల్పడటమేనని అన్నారు. జాతిని ఐక్యం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ రాజీలేని కృషి చేస్తోందని, ఇందుకోసం ఒక ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర చరిత్రలో హిందూ సమాజం అయోమయంలో ఉందన్నారు. హిందువుల సంఖ్య తగ్గిపోతోందని, రోజురోజుకీ ముస్లింల సంఖ్య పెరిగిపోతుండటంతో దేశంపై దాడులకు పరాయి దేశస్థులు తెరలేపుతున్నారని అన్నారు. ఇందుకు ఉదాహరణ పార్లమెంట్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులే నిదర్శనమన్నారు. అలాగే ఢిల్లీలో జేఎన్‌యు నేత కన్వయ్యకుమార్‌ను అరెస్ట్ చేస్తే, కొన్ని రాజకీయ పార్టీలు విద్రోహులకు అండగా నిలిచారని, ఫలితంగా కన్వయ్యకుమార్ జైలు నుండి విడుదల కావడం జరిగిందన్నారు. విద్యార్థులు సమాజ అభివృద్ధికి పాటుపడాలే కానీ, విద్రోహానికి తావివ్వరాదన్నారు. అలాగే దేశాన్ని ముక్కలు చేసేందుకు కాశ్మీర్‌లో విద్యార్థుల ముసుగులో, విద్రోహులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారతదేశంలో అంతర్భాగమైన జమ్ము కాశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందన్నారు. భారతదేశ ఉన్నతి కోసం ప్రయత్నించాల్సిన వ్యక్తుల్లో కొంతమంది, దేశ విచ్ఛిన్నం కోసం కుట్రలు చేస్తున్నారని, అలాంటి కుట్రలను తిప్పి కొట్టేందుకు దేశ ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే విధంగా చైనా దేశం సైతం భారత్‌పై దాడులకు కాలు దువ్వుతోందని, భారతదేశ నాయకత్వం, సైనిక వ్యవస్థ బలంగా ఉండటంతో చైనా తోక ముడిచిందన్నారు. తెలంగాణ పండుగలను హిందువులు ప్రకృతి రూపంలో ప్రేమించడం జరుగుతుందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నిజాం నవాబులను పొగుడుతున్నారని, వారే అభివృద్ధికి బాటలు వేశారంటూ పొగడ్తల వర్షం గుప్తించడాన్ని హిందు సమాజం గమనించాలన్నారు. అలాగే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారని, స్వార్థ రాజకీయల కోసం పాకులాడే వారికి తగిన బుద్ధి చెప్పేందుకు హిందువులంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజాన్ని జాగృతం చేయడంతో పాటు అవసరమైతే దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించేది ఆర్‌ఎస్‌ఎస్ అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఫూలాంగ్ నుండి పాలిటెక్నిక్ మైదానం వరకు స్వయం సేవక్‌లు భారీ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజారాం, గోపాల్‌సింగ్, జ్ఞానేందర్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.