యువ

వీరిదే హవా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో రెండురోజుల్లో అదృశ్యం కాబోతున్న 2017లో వివిధ రంగాల్లో కొంతమంది తమ హవా నిరూపించుకుని యువతను విశేషంగా ఆకట్టుకున్నారు. సినిమాలు, క్రీడలు, ఫ్యాషన్, స్మార్ట్ఫోన్లు, అందాల పోటీలు, సామాజిక మీడియా.. ఇలా అనేకానేక అంశాల్లో కొత్త పోకడలు యువతరాన్ని అలరించాయి.. కొందరు సెలబ్రిటీలు, కొన్ని ట్రెండ్స్ పట్ల యువతలో మోజు కనిపించింది.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లు సాక్షాత్కరిస్తాయి.. ప్రముఖ సర్వేల్లోనూ, గూగుల్ శోధనలోనూ ఎంతోమంది యువ సెలబ్రిటీలు ట్రెండ్ సెట్టర్లుగా సత్తా చాటుకున్నారు.. ‘స్వేచ్ఛ కన్నా మిన్న అయినది ఏముంది?’ అంటూ యువతరం కూడా కొత్తదనం వైపు దృష్టి సారించింది..

వనె్న తెచ్చిన మానుషి

హర్యానాకు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థిని మానుషి చిల్లర్ ఈ ఏడాది ‘ప్రపంచ సుందరి’ కిరీటాన్ని కైవసం చేసుకుని అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ప్రపంచ సుందరిగా గతంలో ఒకసారి ఎన్నిక కాగా, 17 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ఈ ఘనతను మానుషి సాధించింది. నేటి తరం యువతులకు స్ఫూర్తిగా నిలిచిన ఆమె, ఫెమినా మిస్ ఇండియాగాను ఈ ఏడాది ఎంపికై సత్తా చాటుకుంది.

వినోదం పంచిన సన్నీ

ఈ ఏడాది అంతర్జాలంలో విహరించిన భారతీయులను అలరించిన ప్రముఖ వ్యక్తిగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తొలి స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాలు మహిళలు దక్కించుకోగా, దగ్గుబాటి రానా, సునీల్ గ్రోవర్ పురుషుల కేటగిరిలో నిలిచారు.

శోధనలో ‘బాహుబలి’ టాప్

ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ గూగుల్‌లో అత్యధిక సంఖ్యలో నెటిజన్లు సెర్చ్ చేసిన పదంగా ‘బాహుబలి’ నిలిచింది. సినిమాలు, రాజకీయాలు, క్రీడలు, ప్యాషన్‌లు, పర్యాటకం వంటి రంగాల్లో శోధన తీరుతెన్నులు పరిశీలిస్తే, టాప్-10లో ‘బాహుబలి’ ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో మూడవ స్థానంలో క్రికెట్, ఏడవ స్థానంలో బాలీవుడ్ నిలిచాయి.

బిట్ కాయిన్స్‌పైనా ఆసక్తి

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిట్ కాయిన్స్‌పై భారతీయ యువత కూడా ఆసక్తి చూపారు. ఈ ఏడాది బిట్ కాయిన్స్ (డిజిటల్ నాణాలు) హల్‌చల్ చేశాయి. స్టాక్ మార్కెట్‌లో ఒక్కో బిట్ కాయిన్ మారకం విలువ లక్షల రూపాయల్లో ఉండడంతో వీటి పట్ల ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. గూగుల్ సెర్చ్‌లో ‘హౌ టు బై బిట్ కాయిన్స్ ఇన్ ఇండియా?’ అని శోధించిన యువకుల సంఖ్య అధికంగానే వుంది.

యాపిల్ ఐఫోన్-ఎక్స్

స్మార్ట్ఫోన్‌లో ‘తెర’పై ఎటువైపు మనం మునివేళ్లతో తాకినా పనిచేస్తే అది అద్భుతంగానే ఉంటుంది. ‘తెర’పై ఎక్కడ తాకినా టచ్‌స్క్రీన్ పనిచేసేలా విభిన్నమైన స్మార్ట్ఫోన్ ‘యాపిల్ ఐఫోన్ ఎక్స్’ పేరిట ఇపుడు అందుబాటులోకి వచ్చింది. 5.8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇందులో ప్రధానంగా అలరిస్తుంది. మన ముఖాన్ని గుర్తించి అన్‌లాక్ కావడం ఇందులో మరో ప్రత్యేకత. ట్రూడెప్త్ కెమెరా, ఓఎల్‌ఈడీ మల్టీ టచ్ డిస్‌ప్లే, 3డీ టచ్ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణలుగా ఉన్న ఈ ఫోన్ ధరను 89,000లుగా ‘యాపిల్’ సంస్థ నిర్ణయించింది.

శక్తిమంతమైన మహిళ

అత్యంత శక్తిమంతమైన తొలి వందమంది - మహిళల జాబితాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. హిందీ చలనచిత్రసీమతోపాటు హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక ఫోర్బ్స్ మహిళల టాప్-100 జాబితాలో 97వ స్థానంలో నిలిచింది.

‘టాప్ 25’లో యువత జయభేరి

2017 సంవత్సరానికి సంబంధించి ఫోర్బ్స్ ప్రకటించిన ‘టాప్ 100 భారతీయ సెలబ్రిటీల జాబితా’లో యువతరం ప్రతినిధులు గణనీయ స్థానాలను దక్కించుకున్నారు. ఈ జాబితాలోని మొదటి 25 మందిలో ఏడుగురు యువ సెలబ్రిటీలు ఉండడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తరువాత మూడో స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లి, 13వ స్థానంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, 17వ స్థానంలో సంగీత దర్శకుడు అర్జిత్‌సింగ్, 19వ స్థానంలో హిందీ నటుడు వరుణ్ ధావన్, 21వ స్థానంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్, 24వ స్థానంలో క్రికెట్ క్రీడాకారుడు రవీంద్ర జడేజా నిలిచారు.

‘పద్మావతి’కి బెదిరింపులు

హిందీ చలనచిత్రం ‘పద్మావతి’లో కీలక పాత్రలో నటించిన బాలివుడ్ నటి దీపికా పదుకొనెకు కొన్ని వర్గాల నుంచి బెదిరింపులు రావడం, ఆ సినిమా విడుదలకు నోచుకోకపోవడం హిందీ చలనచిత్రరంగానికి చేదుగురుతుగా నిలిచింది. ఓ సామాజిక వర్గానికి సంబంధించి చారిత్రక అంశాలను వక్రీకరించి ‘పద్మావతి’ని రూపొందించారని ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఆందోళన సెగలు చెలరేగాయి. ఈ చిత్రంలో రాణి పద్మావతి పాత్ర కల్పనలతో కూడుకున్నదని రాజ్‌పుత్ వర్గాలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపాయి.

స్ఫూర్తినిచ్చిన ఇవాంకా ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, శే్వతసౌధం సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమ్మేళనంలో పాల్గొని స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ సదస్సులో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించి ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ఆమె మెచ్చుకున్నారు.

షారుఖ్‌ను నెట్టేసిన విరాట్

బ్రాండ్ అంబాసిడర్ల కేటగిరిలో ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టేసి భారత క్రికెట్ జట్టు రథసారధి విరాట్ కోహ్లి ముందంజలో నిలిచాడు. ఓ ప్రముఖ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టాప్ రాంక్‌డ్ సెలెబ్రిటీ బ్రాండ్‌గా కోహ్లీ ముందు వరుసలో నిలిచాడు. ఈ ఏడాది షారుఖ్ బ్రాండ్ విలువ 106 మిలియన్ డాలర్లు కాగా, 144 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో విరాట్ తన విశ్వరూపం ప్రదర్శించాడు.