రివ్యూ

నిరర్థక పరిశోధన .. *ప్రేమికులపై పిహెచ్‌డి ( బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
ఆదిత్య, సోనాలీ, శిరీష తదితరులు
సంగీతం:
రమేష్ ముక్కెర
నిర్మాత:
లక్ష్మీ శ్రీవాస్తవ
దర్శకత్వం:
కోట మునీష్.

‘ప్రేమ’, ‘ఇష్క్’, ‘కాదల్’, ‘ప్యార్’’.. ఇలా ప్రేమ పేరిట ఉన్న పదాలన్నీ ఫార్స్. నిన్ను ఎడారిలో వదిలేస్తాయ్. అంతా మోసం అన్న అభిప్రాయాల్ని ఆసాంతం నమ్మిన యువకుడు అభి (ఆదిత్య). ప్రేమికులపై పిహెచ్‌డి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎదురైన సంఘటనలు, చివరకు అతనే స్వచ్ఛమైన ప్రేమకు ఎలా ఆత్మీయుడయ్యాడన్నది మిగిలిన కథతో తయారైన చిత్రం -ప్రేమికులపై పిహెచ్‌డి. చిత్ర కథాంశం, పరిశోధన అన్నీ కీలకాంశంపై తిరిగినప్పుడు కనీసం మనం సినిమాకు సంబంధించిన అంశాలపై ఏమైనా కనీసస్థాయి అధ్యయనం చేసామా? అన్నది ఆలోచించుకోవాలి. అలాంటి ప్రాథమిక స్థాయి అవగాహనపైనా దృష్టిపెట్టని నిర్లక్ష్యం చిత్ర నిర్మాణంలో అడుగడుగునా కనపడింది. ప్రత్యేకించి సినిమాకు ప్రాణావసరమైన శబ్ద, దృశ్యం తదితర అంశాల్లోనూ ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. దాంతో తెరపై బొమ్మ సరిగ్గా కనపడలేదు. మాటలోనూ స్పష్టతలేదు. దానికితోడు సంగీత దర్శకుడు ఇచ్చిన గరిష్టస్థాయి నేపథ్య సంగీతం కాస్తా మాటల్ని మరింత మింగేసింది. దీంతో గంటా నలభై ఏడు నిమిషాల చిత్ర నిడివిని భారంగా భరించాల్సి వచ్చింది. కథ విషయంలో దర్శకుడు పద్ధతి పాటించలేదనడానికి, ఎలాపడితే అలా నడిచిన కథా విధానమే నిదర్శనం. ముందుగా ప్రేమికులపై పరిశోధన అన్నారు. మధ్యలో క్రైం రిపోర్టర్‌నంటూ నాయక పాత్రను పెట్టారు. ఆమెకు సాయం చేసిన నాయకుడిని అనంతర సన్నివేశంలో నాయికతో కలిపి ఓ డెన్‌లో ఉంచేస్తారు. అక్కణ్ణించి సినిమా అంతమయ్యే వరకూ అదే నడుస్తుంది. చివరకు వాళ్లకు కలిగిన స్థితికి కారణమైన ప్రతి నాయక బృందం పోలీసులకు చిక్కేలా చేస్తుంది నాయిక. ఈమధ్య కాలంలో హీరో, హీరోయిన్స్ మధ్య పుట్టిన ప్రేమవల్ల ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని మార్చేసుకుంటాడు నాయకుడు. చదువుతుంటేనే ఇదంతా గజిబిజిగా ఉంది కదా! సినిమా చూస్తోంటే ఇంతకు రెట్టింపు గందరగోళం ప్రేక్షకుడు ఫీలయ్యాడు. ఇంతటి సాధారణ అంశానికి ఆ స్థాయి గడచిన చిత్రీకరణలో అనవసరం.
మిగిలిన విషయాలు చూస్తే నాయకీ, నాయకుల కంటే హీరో ఫ్రెండు పొట్టిగాఉన్న మధుకే కొన్నిచోట్ల ఫోకస్ ఎక్కువైంది. శబ్దలోపంవల్ల అదీ రాణించలేదు. ఆదిత్య (నాయక పాత్రధారి) చూపులకు బాగానే ఉన్నా భావ వ్యక్తీకరణలో తేలిపోయాడు. గబ్బర్‌సింగ్ బ్యాచ్ అంటూ వాళ్లని ప్రతినాయకుడు అడిగిన ప్రశ్నలు (చరిత్రలో పేరొందిన ముగ్గురు రాజుల పేర్లు చెప్పమంటే సమాధానం వాళ్లు దిల్‌రాజు, ఎంఎస్ రాజు, రామరాజు అని చెప్తారు. ఇలాంటివి ఎంత సిల్లీగా ఉన్నాయో గమనించండి)- జవాబులూ సహనానికి పెద్ద పరీక్షలా నిలిచాయి. ‘నేను రిస్క్‌కే రిస్క్‌లాంటి వాణ్ణి’ అనే ‘పంచ్’ ప్రయత్నాలూ ఇందులో నిష్ఫలమైపోయాయి. కాస్తో కూస్తో బాగున్నది ఓ పాట రచనలోని పదాలు. ‘శిఖరం అంటని పరువు బరువుల బ్రతుకెందుకో’ (నీవంటే నాకు తెగ కొడుతోంది షాకు.. పాటలో) అయితే ఈ పదాల అంతరార్ధాన్ని పాట చిత్రీకరణలో సరిగ్గా చిత్రీకరించక పోవడంవల్ల అది గుర్తింపునకు నోచుకోలేక పోయింది. అలాగే ఇదే పాటలో ‘ఇన్నాళ్లు లేని ఏ తొందరా, అవుతోంది నా మనసు చిందర వందర...’ అన్న పద ప్రయోగమూ బావుంది. ఇలా అక్కడక్కడ పాటల పదాలపై పెట్టిన శ్రద్ధ వగైరా సినిమా కథ, సన్నివేశాల కుదురుపై పెట్టివుంటే ప్రేక్షకులపై చేయబోయిన ఈ పరిశోధన ప్రేక్షకులకు కొద్దిగానైనా చేరి ఉండేది.

-అనే్వషి