పశ్చిమగోదావరి

పోలవరం నిర్వాసితుల భారీ ర్యాలీ, ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఫిబ్రవరి 23: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ ప్రాజెక్టు కారణంగా సర్వం కోల్పోయే నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయన్నారు. భూ నష్టపరిహారం, గృహ నష్ట పరిహారం, పునారావాసంలో భూ ఆవాసం, గృహ నిర్మాణం విషయంలో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పునరావాస గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించే గృహాల్లో కనీసం మంచమైనా పట్టని పరిస్థితి ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారిని ఒక రకంగాను, 13 జిల్లాలకు సంపూర్ణంగా తాగునీరు, సాగునీరు అందించే ప్రాజెక్టు నిర్వాసితులను మరోరకంగా చూడడం విచారకరమన్నారు. వీరికి రెండు పడగ గదులతో నిర్మాణం, 18 సంవత్సరాలు నిండిన యువతకు అన్ని రకాల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు సాధించే వరకు అఖిల పక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. వేలేరుపాడు ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీ వందలాది మందితో తహసీల్దారు కార్యాలయం వరకు కొనసాగింది. తహసీల్దారు కార్యాలయం ఎదుట గంటకు పైగా ధర్నా నిర్వహించారు. దీంతో తహసీల్దారు రవికుమార్, ఎస్సై మధు వెంకటరాజా ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇచ్చారు.

సేవలందిస్తూ ఆదాయాభివృద్ధికి తోడ్పాలి: ఆర్టీసీ ఈడీ జయరావు
ఏలూరు, ఫిబ్రవరి 23: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులంతా ప్రయాణీకులకు మెరుగైన సేవలందించటంతోపాటు సంస్ధకు ఆదాయం పెరిగే విధంగా వ్యవహరించాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు జి జయరావు అన్నారు. శుక్రవారం స్ధానిక ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో జిల్లాలోని ఎనిమిది ఆర్టీసీ డిపో మేనేజర్లు, ముఖ్య అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ఆదరించేవిధంగా వ్యవహరించాలని, తద్వారానే సంస్ధకు ఆదాయం పెరుగుతుందన్నారు. సకాలంలో ప్రయాణీకులను గమ్యస్దానాలకు సురక్షితంగా చేర్చటం, బస్సులను కండిషన్లలో ఉంచటం, బస్‌స్టేషన్‌లలో పరిశుభ్రత పాటించటంతోపాటు విక్రయించే వస్తువులు పూర్తి నాణ్యతతో ఉండేలా పర్యవేక్షించటం చేయాలన్నారు. బస్టాండ్‌లలో బస్సుల రాకపోకలు కూడా ప్రయాణీకులకు తెలిసేవిధంగా ఒకటి,రెండుసార్లు ప్రకటించాలన్నారు. ప్రయాణీకుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంపొందించుకునే విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.