బిజినెస్

మళ్లీ రోడ్డు ప్రాజెక్టుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: టోల్-నిర్వహణ-బదలాయింపు ప్రాతిపదికన దేశంలోని 9 హైవే ప్రాజెక్టులనుంచి ఆశించిన దానికంటే అధిక రాబడులు నమోదు కావడం కేంద్ర ప్రభుత్వంలో ఉత్సాహం నింపింది. వీటి ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఖాతాలో మొత్తం రూ.10,500 కోట్లు చేరాయి. వీటి నుంచి రూ.6,258 కోట్లు సమకూరగలవని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అంచనాలకు మించి ఆదాయం లభించిన నేపథ్యంలో, ఏప్రిల్‌లో రెండో విడత రోడ్ల ప్రాజెక్టులను నగదీకరణ చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. వర్తమాన పోకడలను బట్టి మొత్తం నగదీకరణ చేపట్టాల్సిన 105 ప్రాజెక్టులను గుర్తించామన్నారు. తొమ్మిది రోడ్డు ప్రాజెక్టుల నగదీకరణ కోసం కేంద్రం బిడ్‌లను ఆహ్వానించింది. ఆస్ట్రేలియాకు చెందిన మాక్‌క్వారీ సంస్థ ఫిబ్రవరి 28న మొత్తం రూ.9,681.5 కోట్లు ఆఫర్ ఇచ్చింది. అయితే మొత్తం నగదు ప్రవాహం మాత్రం రూ.10,500 కోట్ల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.855 కోట్లు. బిడ్ ల ద్వారా వచ్చే ఆదాయం రూ.6,258 కోట్లుగా అంచనా వేసింది. కానీ వచ్చిన మొత్తం రూ.10,500 కోట్లు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో 105 ప్రాజెక్టులను కూడా నగదీకరణ చేయాలని నిర్ణయించింది. ఎన్‌హెచ్‌ఏఐలో ఆర్థికశాఖ సభ్యుడు రోహిత్ సింగ్ మాట్లాడుతూ త్వరలోనే మరో పది రోడ్డు ప్రాజెక్టులను టీఓటీ నమూనాలో వేలం వేస్తామన్నారు. దీనికి కూడా మంచి స్పందని వస్తుందని అంచనా. రెండోసారి వేలంలో బిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయం రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017, అక్టోబర్‌లో ఎన్‌హెచ్‌ఏఐ విడుదల చేసిన 9 రోడ్డు ప్రాజెక్టుల్లో, ఐదు ఆంధ్రప్రదేశ్‌లో, నాలుగు గుజరాత్‌లో ఉన్నాయి. హైవే రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధానంలో భాగంగా టీఓటీ పద్ధతిని ప్రభు త్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ఆపరేటర్ ఒకేసారి రాయితీ పీజును చెల్లించడం ద్వారా, 30 సంవత్సరాల వరకు ఆయా రోడ్లపై టోల్‌ను వసూలు చేయవచ్చు. ఇదే సమయంలో ఆ రోడ్డు నిర్వహణ బాధ్యత కూడా వారిదే. ఈ మోడల్ ఈపీసీ, బీఓటీ హైవే ప్రాజెక్టులకు వర్తిస్తుంది.