బిజినెస్

ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వం, పరిశ్రమలయజమాన్యాలు విద్య, సంక్షేమం, నాణ్యమైన ఆరోగ్య సేవల రంగంలో కలిసిపనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ దిశగా పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ తెలంగాణ నిర్మాణం అనే అంశంపై సిఐఐ తెలంగాణ విభాగం నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యమానవులకు మంచినీరు, నాణ్యమైన విద్య, పక్కా గృహం నిర్మించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధికి అన్ని వర్గాలు మమేకం కావాలని ఆయన కోరారు. రాష్ట్భ్రావృద్ధిలో మానవవనరులు కీలకపాత్రవహిస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆయన సిఐఐ తెలంగాణ నూతన విభాగాన్ని అభినందించారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి పరిశ్రమల రంగంలో చేపట్టిన నూతన సంస్కరణలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, టాటా స్ట్రైవ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిత రంజన్, సియాంట్ ఎండి కృష్ణబోదనపు, సిఐఐ తెలంగాణ విభాగం చైర్మన్ వి రాజన్న, డిప్యూటీ చైర్మన్ ఆర్ దినేష్ ప్రసంగించారు
కొత్త చైర్మన్‌గా సంజయ్ సింగ్
సిఐఐ ( భారతీయ పరిశ్రమల సమాఖ్య) తెలంగాణ విభాగం చైర్మన్‌గా సంజయ్ సింగ్, వైస్ చైర్మన్‌గా కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డి రాజు ఎన్నికయ్యారు. ఈ వివరాలను సిఐఐ ప్రకటనలో వెల్లడించింది. చైర్మన్‌గా ఎన్నికైన సంజయ్ సింగ్ కాన్పూర్ ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. ఐటిసి భద్రాచలం బోర్డులో మేనేజిమెంట్ ట్రైనీగా 1977లో చేరారు. అదే సంస్థలో ఉన్నత స్థానానికి పదోన్నతి చెందారు. 2017-18 లో సిఐఐ తెలంగాణ చాప్టర్‌కు వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. ఆరు సంవత్సరాల పాటు సిఐఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభాగంలో ఇంధనం, పర్యావరణం విభాగాలను పర్యవేక్షించారు. వైస్‌చైర్మన్‌గా ఎన్నికైన డి రాజు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. ఉస్మానియా వర్శిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో, ఎంబిఏలో డిగ్రీ తీసుకున్నారు. 2012 నుంచి సిఐఐ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
చిత్రం..సీఐఐ తెలంగాణ విభాగం నిర్వహించిన సదస్సులో గవర్నర్, పారిశ్రామిక వేత్తలు